Dhoni Birthday: హ్యాపీ బర్త్ డే ధోని- క్రికెట్ పిచ్ దాటి తలా సరికొత్త ప్లాన్-ఇకపై ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్‌గా ఇన్నింగ్స్?

Dhoni Birthday: భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు నేడు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఎంఎస్ ధోని బర్త్ డే ట్రెండ్స్ తో ఊగిపోతోంది. అయితే కేవలం క్రికెటర్ మాత్రమే కాదు.. సినిమా ప్రొడ్యూసర్‌గా, నటుడిగా ధోని సౌత్ సినీ ఇండస్ట్రీపై కన్నేశారు. ఆయన నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో చూసేయండి.

Published on: Jul 7, 2026, 10:30:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dhoni Birthday: టీమిండియాకు అన్ని రకాల ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని బర్త్ డే ఇవాళ (జూలై 7). మైదానంలో హెలికాప్టర్ షాట్లతో అలరించిన ధోని, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్త రూట్‌లో దూసుకుపోతున్నాడు.

హ్యాపీ బర్త్ డే ధోని- క్రికెట్ పిచ్ దాటి తలా సరికొత్త ప్లాన్-ఇకపై ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్‌గా ఇన్నింగ్స్? (x/DhoniLtd)
హ్యాపీ బర్త్ డే ధోని- క్రికెట్ పిచ్ దాటి తలా సరికొత్త ప్లాన్-ఇకపై ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్‌గా ఇన్నింగ్స్? (x/DhoniLtd)

ఐపీఎల్ కు గుడ్ బై!

ఎంఎస్ ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నాడని టాక్. గాయం కారణంగా 2026 ఐపీఎల్ సీజన్ లో ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు ధోనికి 45 ఏళ్లు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ లో ధోని ఆడటం కష్టమే. దీంతో తలా ధోని ఇప్పుడు ప్రొడ్యూసర్ కెరీర్ పై ఫోకస్ పెట్టాడని టాక్.

తన భార్య సాక్షి సింగ్ తో కలిసి ధోని 'ధోని ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్ ను స్థాపించాడు. ఇప్పుడీ బ్యానర్ పై బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్లాన్ చేస్తూ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు ధోని.

సౌత్ సినిమాపైనే 'తలా' కన్ను

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచే ధోనికి సౌత్ ఇండియాపై.. ముఖ్యంగా తెలుగు, తమిళ ఆడియన్స్‌పై ప్రత్యేకమైన ప్రేమ ఉంది. అందుకే బాలీవుడ్ వైపు వెళ్లకుండా తన ప్రొడక్షన్ హౌస్‌ను సౌత్ మార్కెట్ వైపు మళ్లించాడని సమాచారం.

  • ఎల్జీఎం (LGM - Let's Get Married): ధోని ప్రొడక్షన్‌లో వచ్చిన మొదటి కమర్షియల్ సినిమా ఇది. రొమాంటిక్ కామెడీగా వచ్చిన ఈ తమిళ చిత్రం తెలుగులోనూ డబ్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్‌గా యావరేజ్ అయినప్పటికీ, ప్రొడ్యూసర్‌గా ధోనికి మంచి గుర్తింపు తెచ్చింది.
  • క్రేజీ డాక్యుమెంటరీలు: అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ కంబ్యాక్ ఆధారంగా తీసిన 'రోర్ ఆఫ్ ది లయన్' (Roar of the Lion), 2011 వరల్డ్ కప్ విక్టరీపై తీసిన 'బ్లేజ్ టు గ్లోరీ' డాక్యుమెంటరీలతో ధోని ఓటీటీ స్పేస్‌లో సంచలనం సృష్టించాడు.

టాలీవుడ్ స్టార్స్‌తో భారీ డీల్స్?

ట్రేడ్ ఇన్‌సైడర్స్ టాక్ ప్రకారం.. ధోని త్వరలోనే టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరోతో పాటు కోలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో భారీ బడ్జెట్ సినిమాలను ఎనౌన్స్ చేయబోతున్నాడని తెలిసింది. ధోని ఎంటర్ టైన్మెంట్స్ అప్ కమింగ్ మూవీస్ లిస్ట్‌లో ఒక మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ కథ కూడా ఉన్నట్లు సమాచారం.

మాధవన్ తో కలిసి

ధోనికి కెమెరా కొత్తేం కాదు. అతను ఇప్పటికే చాలా యాడ్లలో నటించాడు. వెర్సటైల్ యాక్టర్ ఆర్.మాధవన్‌తో కలిసి డైరెక్టర్ వసన్ బాలా తెరకెక్కించిన ‘ది ఛేజ్’ వీడియోలో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ కెరీర్ కు పూర్తిగా గుడ్ బై చెప్పిన తర్వాత ధోని నటుడిగానూ మారిన ఆశ్చర్యమేమీ లేదు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More