మై విలేజ్ షో నుంచి తొలిసారిగా ఓటీటీ సిరీస్ చేశాం.. విజయ్ దేవరకొండ అన్ననే అలా.. యూట్యూబర్ అనిల్ గీలా కామెంట్స్

యూట్యూబ్‌లో మై విలేజ్ షో సిరీస్‌తో ఎంతో పాపులర్ అయిన అనీల్ గీలా ఓటీటీ వెబ్ సిరీస్‌ మోతెవరి లవ్ స్టోరీ‌తో అలరించనున్నాడు. రీసెంట్‌గా మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూట్యూబర్ అనిల్ గీలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Jul 10, 2025 6:03 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూట్యూబ్‌లో చాలా పాపులర్ అయిన సిరీస్‌లలో మై విలేజ్ షో ఒకటి. ఈ సిరీస్‌తో బిగ్ బాస్ గంగవ్వ, యూట్యూబర్ అనిల్ గీలా మంచి పాపులారిటి కూడా తెచ్చుకున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ జీలా ఇప్పుడు ఓటీటీ సిరీస్‌తో అలరించనున్నాడు.

మై విలేజ్ షో నుంచి తొలిసారిగా ఓటీటీ సిరీస్ చేశాం.. విజయ్ దేవరకొండ అన్ననే అలా.. యూట్యూబర్ అనిల్ గీలా కామెంట్స్
మై విలేజ్ షో నుంచి తొలిసారిగా ఓటీటీ సిరీస్ చేశాం.. విజయ్ దేవరకొండ అన్ననే అలా.. యూట్యూబర్ అనిల్ గీలా కామెంట్స్

తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో

అనిల్ గీలా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్, కామెడీ ప్రధాన అంశాలుగా తెరకెక్కింది మోతెవరి లవ్ స్టోరీ. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కు శివకృష్ణ బుర్రా దర్శకత్వం వహించారు.

తాజాగా మోతెవరి ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. జీ5లో ఆగస్ట్ 8 మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో జూలై 9న మోతెవరి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో, యూట్యూబర్అనిల్ గీలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

మొదటి సిట్టింగ్‌కే

అనిల్ గీలా మాట్లాడుతూ .. "మా ‘మై విలేజ్ షో’ టీం నుంచి మొదటి సారిగా ఇలా సిరీస్ చేశాం. మధుర శ్రీధర్ గారు మొదటి సిట్టింగ్‌కే కథను ఓకే చేశారు. జీ5 టీం వల్లే ఈ సిరీస్ ఇంత బాగా వచ్చింది. అనురాధ మేడం ఎప్పుడూ మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ధైర్యం వల్లే ఈ సిరీస్‌ ఇక్కడి వరకు వచ్చింది" అని అన్నాడు.

"మేం ఈ ప్రయాణంలో చాలా కష్టాల్ని ఎదుర్కొంటూనే ఎంతో నేర్చుకున్నాం. చివరకు ఓ అద్భుతమైన సిరీస్ ఆడియెన్స్‌కు అందివ్వబోతోన్నాం. మేం ఇప్పటి వరకు ఎన్నో సార్లు చూశాం. ఆద్యంతం నవ్వుకుంటూనే ఉన్నాం" అని అనిల్ గీలా తెలిపాడు.

మోతెవరి ఓటీటీ రిలీజ్ డేట్

"నన్ను విజయ్ దేవరకొండఅన్ననే సినిమాల్లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు నా కోసం వచ్చిన ఆనంద్ అన్నకి థాంక్స్. మా ఓటీటీ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ ఆగస్ట్ 8న రాబోతోంది. అందరూ చూడండి" అని యూట్యూబర్, హీరో అనిల్ గీలా కోరాడు.

ఇదే ఈవెంట్‌లో జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ మాట్లాడుతూ .. "కరోనా టైంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చూసి ఆశ్చర్యపోయాను. ఆ చిత్రం నాకు చాలా ఇష్టం. వెంటనే ఆ మూవీ రైట్స్‌ను మేం కొనేశాం" అని ఆనంద్ దేవరకొండ మూవీ గురించి చెప్పారు.

అనిల్ గీలాకు స్టార్‌డమ్

"ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో సంగీత్ శోభన్‌ (మ్యాడ్ ఫేమ్)కు స్టార్‌డమ్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‌తో అనిల్ గీలాకు స్టార్‌డమ్ వస్తుంది. మై విలేజ్ షో టీంతో అసోసియేట్ అవ్వడం, మధుర శ్రీధర్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. గ్రామీణ రొమాంటిక్-కామెడీగా తెరకెక్కిన ఈ సిరీస్ అందరినీ మెప్పిస్తుంది" జీ5 ఓటీటీబిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ తెలిపారు.

News/Entertainment/మై విలేజ్ షో నుంచి తొలిసారిగా ఓటీటీ సిరీస్ చేశాం.. విజయ్ దేవరకొండ అన్ననే అలా.. యూట్యూబర్ అనిల్ గీలా కామెంట్స్
News/Entertainment/మై విలేజ్ షో నుంచి తొలిసారిగా ఓటీటీ సిరీస్ చేశాం.. విజయ్ దేవరకొండ అన్ననే అలా.. యూట్యూబర్ అనిల్ గీలా కామెంట్స్