ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. 8.0 ఐఎమ్‌డీబీ రేటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న సోషల్ డ్రామా చిత్రం నారి: ది ఉమెన్ స్ట్రీమింగ్ కానుంది. సమాజంలో జరిగే అఘాయిత్యాలను బోల్డ్‌గా చూపించిన నారి సినిమాలో సీనియర్ హీరోయిన్ ఆమని ప్రధాన పాత్ర పోషించారు. ఐఎమ్‌డీబీలో 8.0 రేటింగ్ ఉన్న నారి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 17, 2025, 05:33:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ జోనర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. థియేట్రికల్ రిలీజ్ అవ్వగానే నెల లేదా 20 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ టైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అయితే, ఇంకొన్ని థియేటర్లలో నుంచి వెళ్లిపోయి నెలలు గడుస్తున్న డిజిటల్ ప్రీమియర్‌కు నోచుకోవు.

ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. 8.0 ఐఎమ్‌డీబీ రేటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. 8.0 ఐఎమ్‌డీబీ రేటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆమని ప్రధాన పాత్రలో

ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమా కూడా అలాంటి కోవకు చెందినదే. ఆ సినిమానే నారి: ది ఉమెన్. సీనియర్ హీరోయిన్ ఆమని ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. నిజానికి ఇది ఒక తెలుగు సోషల్ డ్రామా చిత్రం. కానీ, ఇందులో క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎక్కువగానే ఉంటాయి. అవి కూడా నిజ జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని తెరకెక్కించినవి.

సమాజాంలో జరిగే ఆకృత్యాలు

సమాజంలో మహిళలకు, బాలికలను చూసే విధానం, వారిపై జరిగే అఘాయిత్యాలు, వారు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ, ఇంటి నుంచి బయట వరకు పడే అవమానాలు, అత్యాచారం వంటి అనేక అంశాలను నారి సినిమాలో చూపించారు. ఇలాంటి నారి మూవీకి సూర్య వంటిపల్లి దర్శకత్వం వహించారు.

నారి నటీనటులు

సూర్య వంటిపల్లితోపాటు భార్గవ చారి కథ అందించారు. నారి సినిమాలో ఆమని ప్రధాన పాత్ర పోషించగా.. నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, వికాస్ వశిష్ట, ప్రగతి, రాజశేఖర్ అనింగి, కార్తికేయ దేవ్, కేదార్ శంకర్, ఛత్రపతి శేఖర్, సునైన ఇతర కీలక పాత్రల్లో నటించారు.

నారి ఐఎమ్‌డీబీ రేటింగ్

క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సోషల్ డ్రామాగా తెరకెక్కిన నారి మూవీ థియేటర్లలో మార్చి 7న విడుదలైంది. నారి మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. కానీ, ఐఎమ్‌డీబీ నుంచి మాత్రం పదికి ఏకంగా 8.0 రేటింగ్ సాధించుకుంది నారి సినిమా.

నారి ఓటీటీ రైట్స్

సోషల్ ప్రాబ్లమ్స్‌ను బోల్డ్‌గా చూపించిన నారి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. నారి ఓటీటీ రైట్స్ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అంటే, నెట్‌ఫ్లిక్స్‌లోనే నారి ఓటీటీ రిలీజ్ అవుతుంది. అయితే, ఇప్పటివరకు నారి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అటు నెట్ఫ్లిక్స్, ఇటు మేకర్స్ ప్రకటించలేదు.

నారి ఓటీటీ రిలీజ్

థియేట్రికల్ రిలీజ్ అయి దాదాపుగా 5 నెలలు కావొస్తున్న నారి ఓటీటీ రిలీజ్‌కు ఇంకా నోచుకోలేదు. మరి త్వరలో నారి ఓటీటీ స్ట్రీమింగ్ తేదిని ప్రకటిస్తారేమో వేచి చూడాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More