తొలిసారి డీ గ్లామర్ రోల్‌లో నాగార్జున.. రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు.. కుబేరలో కింగ్ నటనపై ప్రశంసలు!

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కలిసి నటించిన కుబేర థియేటర్లలో జూన్ 20న విడుదలైంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన కుబేరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ధనుష్, నాగార్జున యాక్టింగ్‌కు ఆడియెన్స్ లోకం ఫిదా అవుతోంది. తొలిసారిగా డీ గ్లామర్ రోల్‌లో నాగార్జున నటించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Jun 21, 2025, 06:31:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి జాలువారిన మరో ముత్యంలాంటి సినిమా కుబేర అని టాక్ తెచ్చుకుంటోంది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా మెయిన్ లీడ్ రోల్స్ చేసిన కుబేర జూన్ 20న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కుబేరకు ట్రెమండస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

తొలిసారి డీ గ్లామర్ రోల్‌లో నాగార్జున.. రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు.. కుబేరలో కింగ్ నటనపై ప్రశంసలు!
తొలిసారి డీ గ్లామర్ రోల్‌లో నాగార్జున.. రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు.. కుబేరలో కింగ్ నటనపై ప్రశంసలు!

టాప్ యాక్టర్ అంటూ

ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజే అటు పబ్లిక్, ఇటు మీడియా నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కుబేరసినిమా దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్-నాగార్జునల నటన గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ధనుష్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడని అంతా పొగుడుతున్నారు. టాప్ యాక్టర్ అంటూ ప్రశంసిస్తున్నారు.

అలాగే, నాగార్జున యాక్టింగ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కుబేరలో నాగార్జున దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. నిజానికి నాగార్జున టాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోలలో ఒకరని తెలిసిందే.

సపోర్ట్ చేయడాన్ని

స్టార్ హీరో అయిన నాగార్జున ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవడం, ఒక మంచి సినిమాను సపోర్ట్ చేయడానికి ముందుకు రావడాన్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా నాగార్జునకి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి తొలిసారిగా డీ గ్లామ్ రోల్ చేయడం అభినందనీయమని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.

అలాగే, ఈ సినిమాలో నాగార్జున పర్ఫామెన్స్ అదిరిపోయిందని చెబుతున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసలు వర్షం కురుస్తోంది. శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకు వస్తే, ఆయనను ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు, తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు నాగార్జున.

ఫుల్ ఫామ్‌లోకి

ఒక రకంగా నాగార్జున తన నటనతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసాడు. దీంతో కేవలం ప్రేక్షకులు, విమర్శకులు, అభిమానుల నుంచే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తోంది. ధనుష్తోపాటు నాగార్జున నటనను పొగుడుతూ ట్విటర్‌లో పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా అక్కినేని అభిమానులు వాటిని వైరల్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు.

ఈ సినిమాలోని పాత్రలో నాగార్జున నటించాడు అనడం కన్నా జీవించాడు అంటేనే కరెక్ట్ అంటున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలో క్యారెక్టర్లు చాలా నేచురల్‌గా ఉంటాయని తెలిసిందే. అలాంటి పాత్రలో నాగ్ ఒదిగిపోయి నటించాడు. ఇలాంటి గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం కత్తి మీద సాము లాంటి విషయం.

గ్రే పాత్రలో

అలాంటి పాత్రలో కూడా నాగార్జున నటించి కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతం అనే ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా చూసిన వారంతా ఆయన నటన చూసి ఆశ్చర్యపోతున్నారు. గ్రే పాత్రలో నాగార్జున నటించి షో మొత్తం దోచేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More