నాకు తెలియని యాక్టింగ్ ఏదో నేర్పించారు.. ఆమెను చూస్తే క్షణక్షణంలో శ్రీదేవి గుర్తొచ్చింది.. హీరో నాగార్జున కామెంట్స్

నాగార్జున నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేరలో ధనుష్, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించారు. తాజాగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన కుబేర కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇటీవల జరిగిన కుబేర సక్సెస్ ఈవెంట్‌లోని నాగార్జున కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 26, 2025, 11:09:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర తాజాగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. అయితే, ఇటీవల నిర్వహించిన కుబేర సక్సెస్ మీట్‌లో నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నాకు తెలియని యాక్టింగ్ ఏదో నేర్పించారు.. ఆమెను చూస్తే క్షణక్షణంలో శ్రీదేవి గుర్తొచ్చింది.. హీరో నాగార్జున కామెంట్స్
నాకు తెలియని యాక్టింగ్ ఏదో నేర్పించారు.. ఆమెను చూస్తే క్షణక్షణంలో శ్రీదేవి గుర్తొచ్చింది.. హీరో నాగార్జున కామెంట్స్

మై బ్రదర్ పద్మ విభూషణ్

కింగ్ నాగార్జున మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం. మై బ్రదర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్యూ. ఇండస్ట్రీ అంతా చిరంజీవి గారిని ఎంతగానో ప్రేమిస్తుంది. విక్రమ్ సినిమా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించారు" అని అన్నారు.

"అమీర్ ఖాన్ గారు హిందీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సినిమాని పక్కనుండి సపోర్ట్ చేశారు. చిన్న సినిమా, పెద్ద సినిమా ఏదైనా కావచ్చు.. సపోర్ట్ చేయడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది" అని నాగార్జున తెలిపారు.

థ్రిల్లర్‌తో హ్యూమన్ ఎమోషన్

"ఇది శేఖర్ కమ్ముల ఫిల్మ్. థ్రిల్లర్‌తో హ్యూమన్ ఎమోషన్‌తో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఈ సినిమాతో కుదిరింది. ఈ సినిమాలో దీపక్ దేవా సమీరా ఇలా అన్ని పాత్రలే తప్పా స్టార్స్ కనిపించరు. ఈ సినిమా దేవ సినిమా.. దీపక్ సినిమా.. సమీరా సినిమా.. కుష్బూ సినిమా... ఇట్స్ బిలాంగ్స్ టు శేఖర్ కమ్ముల. ఆయనకి థాంక్యూ" అని నాగార్జున చెప్పారు.

"నాకు తెలియని యాక్టింగ్ ఏదో ఇందులో ఆయన (శేఖర్ కమ్ముల) నేర్పించారు (నవ్వుతూ). నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రతిరోజు కొత్తగా ఉండేది. చిరంజీవి గారు వచ్చేటప్పుడు కారులో చెప్పారు 'చాలా బాగా చేశావు దీపక్ అయిపోయావు' అన్నారు. అప్పుడు నాకు శేఖర్ కమ్ముల గొప్పతనం అర్థమైంది" అని కింగా నాగ్ గుర్తు చేసుకున్నారు.

3 రేటింగ్ కంటే తక్కువ

"ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. సునీల్ గారు నాకు బ్రదర్ లాంటివారు. రామ్మోహన్ గారు, జాన్వి అందరూ చాలా వెరీ స్వీట్ పర్సన్స్. నికిత్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. దేవి శ్రీ మ్యూజిక్ ఫెంటాస్టిక్. ఈ సినిమా మీడియాకు నచ్చింది. ఆడియన్స్‌కి నచ్చింది. ఎక్కడ కూడా మూడు రేటింగ్ కంటే తక్కువ ఇవ్వలేదు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి మిరాకిల్‌ని శేఖర్ క్రియేట్ చేశాడు" అని నాగార్జున వెల్లడించారు.

"ధనుష్ని సెట్‌లో అసలు పోల్చుకోలేకపోయా. సినిమా అంతా దేవా క్యారెక్టర్‌లోనే ఉన్నారు. అలా ఉండడం అంత ఈజీ కాదు. రష్మికని చూస్తే క్షణక్షణంలో శ్రీదేవి గారు గుర్తుకొచ్చారు. ఈ సినిమాలో తను చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ సినిమా నాలో కొత్త వరల్డ్‌ని ఓపెన్ చేసింది. మరో 40 ఏళ్లు తిరుగుండదు. ఐ లవ్ యు ఆల్" అని నాగార్జున తన స్పీచ్ ముగించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More