శేఖర్ కమ్ముల గురించి అడిగితే నాగ చైతన్య అలా చెప్పాడు.. రజనీకాంత్ కూలీలో క్యారెక్టర్‌పై నాగార్జున అప్డేట్ ఇదే!
నాగార్జున నటించిన కుబేర సినిమా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అయితే, కుబేర డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి నాగ చైతన్యను అడిగినప్పుడు చైతూ ఏం చెప్పాడో నాగార్జున తెలిపాడు. అలాగే, రజనీకాంత్ కూలీ మూవీలో నాగార్జున క్యారెక్టర్ గురించి చిన్ని అప్డేట్ ఇచ్చాడు టాలీవుడ్ కింగ్.
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. జూన్ 20న థియేటర్లలో రిలీజ్ అయిన కుబేర మూవీకి అన్ని చోట్ల నుంచి ఫుల్ పాజిటివ్ రివ్యూలు పడుతున్నాయి. అయితే, కుబేర డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఇదివరకు నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా చేసిన విషయం తెలిసిందే.

రజనీకాంత్ కూలీలో
సినిమా ప్రారంభానికి ముందు శేఖర్ కమ్ముల గురించి నాగ చైతన్యను అడిగితే ఏం చెప్పాడో నాగార్జున కుబేర రిలీజ్‌కు ముందు ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తెలిపాడు. అలాగే, లోకేష్ కనగరాజ్-రజనీకాంత్ కాంబినేషన్ మూవీ కూలీలో తన క్యారెక్టర్‌పై చిన్ని అప్డేట్ ఇచ్చాడు నాగార్జున.
మీ ఫ్యామిలీలో దాదాపుగా అందరూ శేఖర్ కమ్ముల గారితో చేశారు కదా. ఆయన స్టైల్ గురించి ముందుగా ఎవరినైనా అడిగారా?
-నాగ చైతన్యని అడిగాను. ‘ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారు' అని చెప్పాడు.
ఇప్పుటి వరకు మీరు చేసిన క్యారెక్టర్ అన్నిటిలో కుబేరలో క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందా ?
- కుబేరసినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్.. అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. శేఖర్ కమ్ముల స్టైల్‌లో ఉంటాయి. సినిమాని దాదాపుగా రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. తిరుపతి, ముంబై, గోవా, బ్యాంకాక్ ఇలా అన్ని బిగ్ రియల్ లొకేషన్స్‌లో వర్క్ చేసాం.
రష్మిక మందన్నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
-రష్మిక మందన్నా క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. తను చాలా అద్భుతంగా చేసింది. సినిమా చూసి నువ్వే స్టార్ అని చెప్పాను. ఆ కథలో చాలా రిప్రెషన్ క్యారెక్టర్ అది.
కుబేర నిర్మాతల గురించి?
-సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ గారు ఒక పెద్ద సినిమా చేయాలనుకున్నారు. తెలుగు, తమిళ్.. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టుని చేయడం జరిగింది. చాలా పాషన్‌తో సినిమా తీశారు. డైరెక్టర్ శేఖర్ కమ్ములకి కావాల్సినది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు. సినిమా చాలా అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది.
కూలీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?
-కూలీలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. లోకేష్ కనకరాజ్ కంప్లీట్ న్యూ ఏజ్ డైరెక్టర్. క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ టైమ్ ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేశాను.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



