కథ చెబుతానని ఆఫీస్‌కు పిలిచి ముద్దు పెట్టుకున్నాడు, అతనెవరో కూడా చెప్పలేదు: సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ షాకింగ్ కామెంట్స్
నాగిని సీరియల్‌తో హిందీ, తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటి మౌనీ రాయ్. అయితే, 21 ఏళ్ల వయసులో తనకు జరిగిన చేదు అనుభవం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది మౌనీ రాయ్. కథ చెబుతానని పిలిచి ఒకరు ముద్దు పెట్టుకున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మౌనీ రాయ్.
సినీ ఇండస్ట్రీలో చేదు అనుభవాలు, లైంగిక వేధింపులు ఎక్కువగా వినపడుతుంటాయి. ఎంతపెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఏదో ఒక సమయంలో ఇలాంటి అనుభవాన్ని చూసి ఉంటారు. అయితే, రీసెంట్‌గా సీరియల్స్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పింది.

అపూర్వ ముఖిజా షో
కాస్టింగ్ కౌచ్ గురించి సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు చర్చ నడుస్తూనే ఉంటుంది. అపూర్వ ముఖిజా హోస్ట్‌గా చేస్తున్న స్పైస్ ఇట్ అప్ అపూర్వతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మౌనీ రాయ్‌కు ప్రశ్న ఎదురైంది. తాను కాస్టింగ్ కౌచ్ ఎప్పుడు ఎదుర్కోలేదు కానీ 21 ఏళ్లలో జరిగిన దారుణ సంఘటనను గుర్తు చేసుకుంది మౌనీ రాయ్.
21 ఏళ్ల వయసులో
"బాలీవుడ్‌లో నేను ఎప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడూ ఎదుర్కోలేదు కానీ, నాకు ఒకసారి చేదు అనుభవం మాత్రం ఎదురైంది. నాతో అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు. నాకు అప్పుడు 21-22 ఏళ్లు. నేను ముంబైలో కథ చెబుతానంటే ఒకరి ఆఫీస్‌కు వెళ్లాను. ఆఫీస్ లోపల జనాలు ఉన్నారు. నాకు ఒకతను కథ చెబుతున్నారు" అని మౌనీ రాయ్ తెలిపింది.
అతనెవరో కూడా తెలియదు
"స్టోరీలో హీరోయిన్ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయే సీన్ వచ్చింది. స్విమ్మింగ్ పూల్‌లో హీరోయిన్ పడిపోతే హీరో వచ్చి కాపాడి నోట్లో నోరు పెట్టి శ్వాస అందేలా చేస్తాడు. దాంతో ఆమె స్పృహలోకి వస్తుంది. ఇది సీన్. అతను డైరెక్టరా, నటుడా, కథ చెప్పే ఏజెంటా ఇదేం చెప్పకుండానే అతను నా ముఖాన్ని పట్టుకుని నోటితో శ్వాసక్రియ చేయడం చూపించాడు" అని తనకు ముద్దు పెట్టడం గురించి చెప్పింది మౌనీ రాయ్.
చాలా కాలం వెంటాడింది
మౌనీ రాయ్ ఇంకా కొనసాగిస్తూ.. "ఒక్క రెప్పపాటు కాలం నాకు స్తంభించినట్లు అయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నాకు శివరింగ్ స్టార్ట్ అయింది. వెంటనే అక్కడి నుంచి లేచి పరిగెత్తాను. ఇది నిజంగా నన్ను చాలా కాలం పాటు వెంటాడింది. అలా ఎన్నో కష్టాలు, మానసిక ఒత్తిడి, ట్రోలింగ్స్ ఎదుర్కొని ఈరోజు ఈ స్టేజ్‌లో నిలబడ్డాను" అని చెప్పుకొచ్చింది.
నాగిని సీరియల్‌తో
దీంతో మౌనీ రాయ్ చేసిన షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, తనకు ముద్దు పెట్టిన డైరెక్టర్ ఎవరో మాత్రం మౌనీ రాయ్ చెప్పలేదు. ఇదిలా ఉంటే, నాగినీ సీరియల్‌తో దేశవ్యాప్తంగా హిందీ, తెలుగు ఆడియెన్స్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది మౌనీ రాయ్. యశ్ కేజీఎఫ్ 1లో హిందీలో ఐటమ్ సాంగ్‌తో స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది బ్యూటీఫుల్ మౌనీ రాయ్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


