ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ.. తండ్రికూతుళ్ల అనుబంధంతో హత్తుకునేలా.. ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ నగుమోము కనలేని స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తనికెళ్ల భరణి, శరణ్య శర్మ, ఇందుమతి, రాజా చెంబోలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగాలతో తెరకెక్కించారు. మరి నగుమోము కనలేని ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ప్రతివారం సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఈ వారం కూడా సుమారుగా 30కిపైగా ఓటీటీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఎక్కువగా శుక్రవారం (జూలై 18) ఎక్కువగా 20 వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

ఓటీటీలోకి ఎమోషనల్ ఫ్యామిలీ చిత్రం
ఇక ఇవాళ (జూలై 20) ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. ఆ సినిమానే నగుమోము కనలేని. ఈ మూవీలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి తండ్రి పాత్రలో నటించాడు. ఆయనతోపాటు శరణ్య శర్మ, ఇందుమతి, రాజా చెంబోలు, ఫణి ప్రకాష్, నెహల్, జయ పరమేశ్వరన్, సుస్మిత, శ్రీనివాస్, రాజు, కిశోర్, సందీప్ ఇతర పాత్రలు పోషించారు.
మనసుకు హత్తుకునే భావోద్వేగాలు
నగుమోము కనలేని సినిమాను తండ్రీకూతుళ్లమధ్య అనుబంధం, భావోద్వేగాలతో ఎమోషనల్‌గా మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు డైరెక్టర్ అనురాధ. లేడి దర్శకురాలు తెరకెక్కించిన నగుమోము కనలేని ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది.
నగుమోము కనలేని ఓటీటీ రిలీజ్
ఈటీవీ విన్‌లో నగముమోము కనలేని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగు భాషలో ఇవాళ నగుమోము కనలేని ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, గత కొంతకాలంగా ఈటీవీ విన్‌లో కథా సుధా అనే మినీ ఓటీటీ సిరీస్‌తో అతి తక్కువ నిడివి గల తెలుగు సినిమాలను డిజిటల్ ప్రీమియర్ చేస్తున్నారు.
కథా సుధాలో భాగంగా
ఈ క్రమంలోనే ఇవాళ కథా సుధా మినీ సిరీస్‌లో భాగంగా నగుమోము కనలేని ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు. కేవలం 36 నిమిషాల 9 సెకన్ల రన్ టైమ్‌తో నగుమోము కనలేని సినిమాను రూపొందించారు. రీసెంట్‌గానే నగుమోము కనలేని ట్రైలర్‌ను ఈటీవీ విన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో రిలీజ్ చేసింది.
స్నేహితుల్లా తండ్రీకూతుళ్లు
ఇక నగుమోము కనలేని కథ విషయానికొస్తే.. తండ్రీ, తల్లి, కూతురు ముగ్గురు కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. తల్లి కంటే ఎక్కువగా తండ్రిని కూతురు ప్రేమిస్తుంది. అలాగే, తండ్రి కూడా కూతురుని బాగా గారాబం చేస్తూ పెంచుతాడు. తండ్రీకూతుళ్లు ఇద్దరు స్నేహితుల్లా సందడి చేస్తుంటారు.
నగుమోము కనలేని ట్విస్టులు
ఇలా ఆనందంగా సాగుతున్న వారి జీవితంలోకి ఓ ఊహించని వ్యక్తి వస్తాడు. తల్లిదండ్రుల మాట ఎప్పుడు కూడా వినని ఆ కుమార్తె అతని మాట విని ఒకేచోట ఉండిపోతుంది. ఆ తర్వాత ఏమైంది?, ఎవరా వ్యక్తి? తండ్రికి దూరంగా కూతురు ఎందుకు ఉండాల్సి వచ్చింది? వంటి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే సినిమానే నగుమోము కనలేని మూవీ కథ.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper













