RGV Ramayana: వాల్మీకి పేరును మర్చిపోతారు.. నమిత్ పేరే గుర్తుంటుంది.. రామాయణాన్ని వదలని ఆర్జీవీ.. మరో సంచలన ట్వీట్!

RGV Ramayana: నమిత్ మల్హోత్రా 'రామాయణం' సినిమా టైటిల్ వివాదంపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో స్పందించారు. ఇకపై జనాలు వాల్మీకి పేరును మర్చిపోయి నమిత్ పేరును మాత్రమే గుర్తుపెట్టుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదంటూ ఆర్జీవీ చేసిన బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Published on: Nov 12, 2026, 10:21:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

RGV Ramayana: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం సినిమాను ఆర్జీవీ వదలట్లేదు. ఇప్పటికే రెండు సార్లు మూవీని చూసిన ఆయన లెంగ్తీ రివ్యూ ఇచ్చారు. ఇప్పుడు రామాయణం టైటిల్ వివాదంపై తన స్టైల్లో రామ్ గోపాల్ వర్మ రియాక్టయ్యారు.

వాల్మీకి పేరును మర్చిపోతారు.. నమిత్ పేరే గుర్తుంటుంది.. రామాయణాన్ని వదలని ఆర్జీవీ.. మరో సంచలన ట్వీట్!
వాల్మీకి పేరును మర్చిపోతారు.. నమిత్ పేరే గుర్తుంటుంది.. రామాయణాన్ని వదలని ఆర్జీవీ.. మరో సంచలన ట్వీట్!

ఆర్జీవీ ట్వీట్

'నమిత్ మల్హోత్రా రామాయణం' అని పిలవడంపై ప్రస్తుతం జరుగుతున్న రాద్ధాంతం చాలా మూర్ఖమైనదని ఆర్జీవీ కొట్టిపారేశారు. ఒకవేళ వేల సంవత్సరాల క్రితం నమిత్ మల్హోత్రా అనే వ్యక్తి ఈ ఇతిహాసాన్ని రాసి, ఈరోజు వాల్మీకి అనే డైరెక్టర్ సినిమాగా తీసి ఉంటే అప్పుడు కూడా జనాలు ఇలాగే అరిచేవారని ఎద్దేవా చేశారు. అసలు ఈ ఓనర్ షిప్ గురించి మాట్లాడటం అనేది కేవలం ఒక దృష్టి మళ్లింపు చర్య మాత్రమే అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

రామాయణం గొప్పదనం

రామాయణం శతాబ్దాల తరబడి మనుగడ సాగించడానికి అసలు కారణం అందులోని కేవలం అద్భుతమైన ప్లాట్ పాయింట్స్ కాదని వర్మ విశ్లేషించారు. అందులోని మూల సంఘర్షణలు ప్రతి కుటుంబంలోనూ నేటికీ కనిపిస్తూనే ఉంటాయని ఆయన అన్నారు.

అసూయపడే భార్యలు, తోబుట్టువుల మధ్య శత్రుత్వం, తల్లిదండ్రులు లేదా అధికారం పట్ల గుడ్డి విధేయత, ఇంట్లో జరిగే వెన్నుపోట్లు, అహంకారం, హోదా.. ఇవన్నీ కేవలం పురాణాల్లోని అసాధారణ విషయాలు కావని, ఇవి మన దైనందిన జీవితంలో జరిగేవేనని వివరించారు. ఈ రిలేటబిలిటీ వల్లే ప్రజలు రామాయణంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు తప్ప, ఒకరు గాలిలో ఎగరగలరు లేదా పర్వతాన్ని ఎత్తగలరు అని కాదని వర్మ కుండబద్దలు కొట్టారు.

హాలీవుడ్ సినిమాలతో పోలిక

ప్రపంచవ్యాప్తంగా కల్చరల్ ఫినామినన్ గా మారిన 'ది గాడ్ ఫాదర్' సినిమాను ఉదహరిస్తూ ఆర్జీవీ ఆసక్తికర పోలిక తెచ్చారు. ఆ సినిమాను ఎవరూ అండర్ వరల్డ్ ఆపరేషన్స్ కోసం చూడరని, అందులోని విధేయత, ద్రోహం, కుటుంబ బంధాల కోసమే చూస్తారని తెలిపారు. దాన్ని 'మారియో పుజో నవల' అని పిలవకుండా 'కొప్పోలా సినిమా' అంటామని గుర్తుచేశారు.

అలాగే పీటర్ జాక్సన్ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్', మెల్ గిబ్సన్ 'ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్' అని అంటాం తప్ప.. అసలు రచయితలైన టోల్కీన్ లేదా షేక్స్ పియర్ పేర్లతో సినిమాలను పిలవమని ఉదహరించారు.

భన్సాలీ 'దేవదాస్' లాగే

ఇండియాలోనూ సంజయ్ లీలా భన్సాలీ 'దేవదాస్', భన్సాలీ 'పద్మావత్' అని అంటాం కానీ అసలు మూల కథల రచయితల పేర్లతో కాదని వర్మ అన్నారు. నమిత్ మల్హోత్రా రామాయణం అని పిలవడం వల్ల వాల్మీకి చరిత్రను ఎవరూ చెరిపేయలేరని స్పష్టం చేశారు.

ఒక ప్రాచీన కథను తీసుకుని, ప్రస్తుత కాలానికి, టెక్నాలజీకి తగినట్లుగా, తనదైన కోణంలో ఒక అద్భుతమైన సినిమాగా మలిచిన వ్యక్తిని గుర్తించడమే దీని ఉద్దేశమని వివరించారు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్న వారు రామాయణాన్ని కించపరచరని, ఒక ప్రాజెక్టును అడాప్ట్ చేసిన వ్యక్తులను ప్రతిబింబించేలా ఈ టైటిల్ ఉందంటూ ఆర్జీవీ తన పోస్ట్ ను ముగించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More