Song Lyrics: నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ మూవీ నుంచి నమో నమః శివాయ సాంగ్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. డివోషనల్ టచ్‌తో కూడిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
Namo Namah Shivaya Lyrics: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజైంది. నమో నమః శివాయ లిరికల్ వీడియోను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. రిలీజైన కొద్ది సేపట్లోనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.
నమో నమః శివాయ లిరిక్స్
డివోషనల్ టచ్‌తో...
భక్తి ప్రధానంగా సాగిన నమో నమః శివాయ పాటను అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు. శివుని సర్వశక్తి, ఆధ్యాత్మికత సారాంశాన్ని చూపిస్తూ జొన్నవిత్తుల ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. . డివోషనల్ టచ్‌తో సాగిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్తో పాటు విజువల్స్, డ్యాన్స్ హైలైట్‌గా నిలుస్తోన్నాయి. నమో నమః శివయా పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. డ్యాన్స్ ద్వారా శివుడి శక్తిని, మహిమల్ని పాటలో ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటోంది.
43 మిలియన్ల వ్యూస్...
తండేల్ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన బుజ్జితల్లి పాట పెద్ద హిట్టయ్యింది. 43మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. నమో నమః శివాయ కూడా అదే స్థాయిలో ట్రెండింగ్ అవుతోందని మేకర్స్ భావిస్తోన్నారు.
ఫిబ్రవరి 7న రిలీజ్...
లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న మూవీ ఇది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు. డిసెంబర్‌లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ థియేటర్ ఇష్యూస్‌తో పాటు ఇతర సమస్యల కారణంగా ఫిబ్రవరికి వాయిదాపడింది.తండేల్ మూవీకి షామ్‌దత్ సినిమాటోగ్రఫీ అందిస్తోండగా...నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తోన్నారు.