అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా మాస్ ర్యాంపేజ్ తో, వీర లెవల్ యాక్షన్ తో అదరగొట్టారు హీరో నాని. ఆయన అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా యాక్ట్ చేసిన ‘హిట్ ది థర్డ్ కేస్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసింది. ఈ మూవీలో నాని ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సత్తాచాటారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘హిట్ 3’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘హిట్ 3’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో డిజిటల్ స్ట్రీమ్ అవుతోంది ఈ మూవీ. మే 28 అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే మే 29న ఓటీటీలో అడుగుపెట్టింది హిట్ 3. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 4కే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఆడియోతో ఈ మూవీ ఫ్యాన్స్ కు మంచి ఎక్స్ పీరియన్స్ ను అందిస్తోంది.
థియేటర్లలో అదుర్స్
మేడే సందర్భంగా మే 1న థియేటర్లలో రిలీజైంది హిట్ 3 మూవీ. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని అదరగొట్టారు. మాస్ యాక్షన్ తో పాటు బీభత్సమైన వైలెన్స్ తో చెలరేగిపోయారు. థియేటర్లలో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ తో ఈలలు కొట్టించింది.
శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. నాని సరసన శ్రీనిధి శెట్టి నటించింది.
కథ ఏమిటంటే?
అర్జున్ సర్కార్ (నాని) ఓ పోలీస్ ఆఫీసర్. ఏపీకి ఎస్‌పీగా బదిలీపై వస్తాడు. నిజాయితీతో పాటు కోపం ఎక్కువే. సొసైటీలో క్రిమినల్ అనే వాడు కనిపించకూడదు అన్నది అతడి సిద్ధాంతం.
అర్జున్ సర్కార్‌కు దొరికితే క్రిమినల్స్‌కు నరకమే. క్రూరంగా హింసిస్తుంటాడు. అర్జున్ తీరుపై అధికారులతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కానీ అవేవి పట్టించుకోకుండా డ్యూటీలో ముందుకు సాగిపోతుంటాడు అర్జున్ సర్కార్.
{{/usCountry}}అర్జున్ సర్కార్‌కు దొరికితే క్రిమినల్స్‌కు నరకమే. క్రూరంగా హింసిస్తుంటాడు. అర్జున్ తీరుపై అధికారులతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కానీ అవేవి పట్టించుకోకుండా డ్యూటీలో ముందుకు సాగిపోతుంటాడు అర్జున్ సర్కార్.
{{/usCountry}}సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన అర్జున్ సర్కార్ అసలు ఎందుకు హత్యలు చేస్తున్నాడు? జమ్ము కశ్మీర్‌లో ఎస్‌పీగా పనిచేసిన అర్జున్ సర్కార్ టెర్రరిస్ట్‌లకు ఎలాంటి శిక్షలు విధించాడు? దేశంలో ఒకే రోజు ఒకే రీతిలో జరిగిగిన పదమూడు హత్యల వెనకున్న మిస్టరీ ఏంటి? ఈ హత్యలు చేసిన సైకో కిల్లర్స్ ఎవరు?
సీటీకే అనే డార్క్ వెబ్‌సైట్ వెనకున్న వ్యక్తిని అర్జున్ సర్కార్ కనిపెట్టాడా? సీటీకే ఆగడాలను అర్జున్ అడ్డుకున్నాడా? మృదులతో అర్జున్ ప్రేమాయణం సాఫీగా సాగిందా? లేదా? అర్జున్ గురించి వర్షకు తెలిసిన షాకింగ్ నిజం ఏమిటి? అన్నదే హిట్ 3లో మిగిలిన కథ.