వెయిటింగ్ ఓవర్.. అర్జున్ సర్కార్ ఆగయా.. ఓటీటీలోకి వచ్చేసిన నాని బ్లాక్ బస్టర్ మూవీ.. హిట్ 3 స్ట్రీమింగ్ ఇక్కడే!

మూవీ లవర్స్ వెయిటింగ్ కు ఎండ్ కార్డు పడింది. నేచురల్ స్టార్ నాని రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ 3 ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో సహా అయిదు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే? 

May 29, 2025, 05:53:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా మాస్ ర్యాంపేజ్ తో, వీర లెవల్ యాక్షన్ తో అదరగొట్టారు హీరో నాని. ఆయన అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా యాక్ట్ చేసిన ‘హిట్ ది థర్డ్ కేస్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసింది. ఈ మూవీలో నాని ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సత్తాచాటారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘హిట్ 3’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీలోకి వచ్చేసిన నాని హిట్ 3 మూవీ (x/NameisNani)
ఓటీటీలోకి వచ్చేసిన నాని హిట్ 3 మూవీ (x/NameisNani)

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘హిట్ 3’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో డిజిటల్ స్ట్రీమ్ అవుతోంది ఈ మూవీ. మే 28 అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే మే 29న ఓటీటీలో అడుగుపెట్టింది హిట్ 3. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 4కే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఆడియోతో ఈ మూవీ ఫ్యాన్స్ కు మంచి ఎక్స్ పీరియన్స్ ను అందిస్తోంది.

థియేటర్లలో అదుర్స్

మేడే సందర్భంగా మే 1న థియేటర్లలో రిలీజైంది హిట్ 3 మూవీ. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని అదరగొట్టారు. మాస్ యాక్షన్ తో పాటు బీభత్సమైన వైలెన్స్ తో చెలరేగిపోయారు. థియేటర్లలో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ తో ఈలలు కొట్టించింది.

శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. నాని సరసన శ్రీనిధి శెట్టి నటించింది.

కథ ఏమిటంటే?

అర్జున్ స‌ర్కార్ (నాని) ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. ఏపీకి ఎస్‌పీగా బ‌దిలీపై వ‌స్తాడు. నిజాయితీతో పాటు కోపం ఎక్కువే. సొసైటీలో క్రిమిన‌ల్ అనే వాడు క‌నిపించ‌కూడ‌దు అన్న‌ది అత‌డి సిద్ధాంతం.

అర్జున్ స‌ర్కార్‌కు దొరికితే క్రిమిన‌ల్స్‌కు న‌ర‌క‌మే. క్రూరంగా హింసిస్తుంటాడు. అర్జున్ తీరుపై అధికారుల‌తో పాటు ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త ఎదుర‌వుతుంది. కానీ అవేవి ప‌ట్టించుకోకుండా డ్యూటీలో ముందుకు సాగిపోతుంటాడు అర్జున్ స‌ర్కార్‌.

సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ అయిన అర్జున్ స‌ర్కార్ అస‌లు ఎందుకు హ‌త్య‌లు చేస్తున్నాడు? జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎస్‌పీగా ప‌నిచేసిన అర్జున్ స‌ర్కార్ టెర్ర‌రిస్ట్‌ల‌కు ఎలాంటి శిక్ష‌లు విధించాడు? దేశంలో ఒకే రోజు ఒకే రీతిలో జ‌రిగిగిన ప‌ద‌మూడు హ‌త్య‌ల వెన‌కున్న మిస్ట‌రీ ఏంటి? ఈ హ‌త్య‌లు చేసిన సైకో కిల్ల‌ర్స్‌ ఎవ‌రు?

సీటీకే అనే డార్క్ వెబ్‌సైట్ వెన‌కున్న వ్య‌క్తిని అర్జున్ స‌ర్కార్ క‌నిపెట్టాడా? సీటీకే ఆగ‌డాల‌ను అర్జున్ అడ్డుకున్నాడా? మృదుల‌తో అర్జున్ ప్రేమాయ‌ణం సాఫీగా సాగిందా? లేదా? అర్జున్ గురించి వ‌ర్ష‌కు తెలిసిన షాకింగ్ నిజం ఏమిటి? అన్న‌దే హిట్ 3లో మిగిలిన క‌థ‌.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More