నాన్న నువ్వు నా ప్రాణం.. ఫాదర్స్ డే రోజు తండ్రి కోసం ఈ యానిమల్ సాంగ్ పాడేయండి.. 4.2 కోట్ల వ్యూస్.. ఇదిగో లిరిక్స్
నాన్న.. తీర్చుకోలేని రుణం, వెలకట్టలేని ప్రేమ. చేయి పట్టుకుని అడుగులు నేర్పించి.. జీవితానికి అర్థం చెప్పే నాన్న.. మన కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. ఫాదర్స్ డే రోజు అలాంటి తండ్రి ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకునేందుకు యానిమల్ మూవీ నుంచి ఈ సాంగ్ పాడేయండి. నాన్నను సర్ ప్రైజ్ చేయండి.
అమ్మ తొమ్మిది నెలల బిడ్డను కడుపులో మోస్తే.. తండ్రి జీవితాంతంం గుండెల్లో మోస్తాడు అని చెప్తారు. భుజాలపై ఎత్తుకుని ప్రపంచాన్ని చూపించే నాన్న.. ఆ ప్రపంచాన్ని గెలిచేలా దిశగా నడిపిస్తాడు. నాన్న అంటేనే స్పెషల్ ఎమోషన్. తండ్రి అంటేనే మాటల్లో చెప్పలేని రిలేషన్ షిప్. నాన్న అయ్యాకే నాన్న గొప్పతనం తెలుస్తుందని అంటుంటారు. అది నిజమే. ఈ ఫాదర్స్ డే రోజు మీ నాన్నను సర్ ప్రైజ్ చేసేందుకు ఆ సాంగ్ పాడేయండి. యానిమల్ మూవీ నుంచి ‘నాన్న నువ్వు నా ప్రాణం’ సాంగ్ తెలుగు లిరిక్స్ మీ కోసం.

నాన్న కోసం
2023లో వచ్చిన యానిమల్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మొత్తం నాన్నపై ప్రేమతో సాగే కొడుకు చుట్టూనే ఉంటోంది. తండ్రిని చంపాలనుకునే వాళ్లను చంపే దాకా వదలని కొడుకు పాత్రలో రణ్ బీర్ కపూర్ అదరగొట్టాడు. ఈ మూవీలోని సాంగ్స్ అని సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇందులో ముఖ్యంగా ‘నాన్న నువ్వు నా ప్రాణం’ సాంగ్ మనసులను కదిలించింది.
ఈ సాంగ్ ను అనంత్ శ్రీరామ్ రాశారు. సోను నిగమ్ అద్భుతంగా పాడారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సాంగ్లిరిక్స్ ఇక్కడున్నాయి. ఈ వీడియో సాంగ్ కు యూట్యూబ్ లో ఇప్పటివరకూ 4.2 కోట్ల వ్యూస్ వచ్చాయి.
సాంగ్ లిరిక్స్
నా సూర్యుడివి
నా చంద్రుడివి
నా దేవుడివి నువ్వే
నా కన్నులకి
నువ్వు వెన్నెలవి
నా ఊపిరివి నువ్వే
నువ్వే కదా నువ్వే కదా
సితార నా కలకీ
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదట ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవాల నీ ఎదుటా
నీ చేతులలో ఊయలలూగే
ఆ సంబరమింకెపుడు
నీ భుజములపై తలవాల్చుకునే
ఆ పండగ నాకెపుడు
క్షణానికో సవాలిలా
జవాబు లేదెపుడు
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదట ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవాల నీ ఎదుటా
ఏ కానుకలో నీ లాలనతో
సరితూగవు ఇది నిజమే
నీ సమయముకై ఈ జీవితమే
చూస్తున్నది పసితనమై
జగాలనే జయించినా
తలొంచి నీ వెనకే
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదటా ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవాల నీ ఎదుటా
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



