నరివెట్ట ఓటీటీ రిలీజ్ ట్విస్ట్..ఒక రోజు ముందే స్ట్రీమింగ్ కు వచ్చేసిన టొవినో థామస్ బ్లాక్ బస్టర్ మలయాళం మూవీ..తెలుగులోనూ

టొవినో థామస్ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ నరివెట్ట ఓటీటీ రిలీజ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ మూవీ ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. 

Published on: Jul 10, 2025, 13:44:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ‘నరివెట్ట’ ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా ప్రకటించిన దాని కంటే ఒక రోజు ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సూపర్ హిట్ మూవీ. థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ ఆడియన్స్ ను అలరిస్తోంది. టొవినో థామస్ నటించిన ఆ పోలీస్ సోషల్ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఓటీటీలోకి నరివెట్ట మూవీ (x)
ఓటీటీలోకి నరివెట్ట మూవీ (x)

ఏ ఓటీటీలో అంటే?

నరివెట్ట మూవీ ఈ రోజు (జూలై 10) ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా జూలై 11న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. గురువారం నుంచే ప్రసారమవుతుంది. సోనీ లివ్ ఓటీటీలో ఈ మూవీ అడుగుపెట్టింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

అదిరే రెస్పాన్స్

మే 23, 2025న థియేటర్లలో రిలీజైంది నరివెట్ట సినిమా. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సత్తాచాటింది. రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన నరివెట్ట రూ.30 కోట్లు రాబట్టింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఇప్పుడు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమాకు అనురాజ్ మనోహర్ డైరెక్టర్. ఇండియన్ సినిమా కంపెనీ బ్యానర్ పై నిర్మించారు.

కథ ఏమిటంటే?

నరివెట్ట మూవీ గిరిజన ఆదివాసీ ప్రజలకు, పోలీసు.. రాజకీయ నాయకులకు మధ్య జరిగే కథ. ఫారెస్ట్ కన్సర్వేషన్ అండ్ డెవలప్ మెంట్ కోసమని కొన్ని తరలుగా అడవిలో నివాసం ఉంటున్న గూడెం ప్రజలను ఖాళీ చేయించాలని చూస్తారు. కానీ అందుకు నిరాకరించిన ప్రజలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తారు. ఆ సమయంలోనే పోలీసులు అమాయకులపై విరుచుకుపడతారు.

అమాయక జనాలను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతుంటారు. పోలీసు కానిస్టేబుల్ గా పని చేస్తున్న హీరో ఈ దుశ్చర్యను చూసి తట్టుకోలేకపోతాడు. పోలీసులు, గిరిజన ప్రజల మధ్య నలిగిపోతాడు. మరి చివరకు హీర ఏం చేశాడు? తన సొంత డిపార్ట్ మెంట్ పోలీసులను ఎదురించి అమాయక ప్రజలకు అండగా నిలిచాడా? ఆ ఊరి జనాలు పోరాటంలో గెలిచారా? అన్నదే కథ.

రియల్ స్టోరీ

నరివెట్ట సినిమా వెనుక రియల్ స్టోరీ ఉంది. 2003లో జరిగిన ముతంగ ట్రైబల్ ప్రొటెస్ట్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో టొవినో థామస్, సూరజ్ వెంజారమూడు, ఆర్య సలీం తదితరులు నటించారు. గిరిజనుల పోరాటాన్ని గుండెకు హత్తుకునేలా ఈ మూవీలో చూపించారు. థ్రిల్ తో పాటు కదిలించే ఎమోషన్, డ్రామాను ఈ సినిమాలో చూడొచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More