...
...
Next Story

నరివెట్ట రివ్యూ.. ఓ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్.. పోలీసుల దౌర్జ్యన్యాన్ని కళ్లకు కట్టిన మూవీ.. నిజ జీవిత ఘటన ఆధారంగా..

మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ నరివెట్ట (Narivetta) గురువారం (జులై 10) సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పోలీసుల దౌర్జన్యాన్ని, అభంశుభం తెలియని ఆదివాసీలపై జరిగిన అకృత్యాలను కళ్లకు కట్టేలా సాగింది.

Published on: Jul 10, 2025, 21:30:02 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

నరివెట్ట అంటే తెలుగులో నక్కల వేట అని అర్థం. 2003లో కేరళలోని వయనాడ్ లో జరిగిన ఆదివాసీల ఉద్యమం, దానిని అణచివేయడానికి అప్పటి ప్రభుత్వం, పోలీసులు చేసిన దారుణాలను కళ్ల ముందుకు తీసుకొచ్చిన సినిమా ఇది. ఈ ఏడాది మే 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. గురువారం (జులై 10) నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

నరివెట్ట రివ్యూ.. ఓ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్.. పోలీసుల దౌర్జ్యన్యాన్ని కళ్లకు కట్టిన మూవీ.. నిజ జీవిత ఘటన ఆధారంగా..
నరివెట్ట రివ్యూ.. ఓ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్.. పోలీసుల దౌర్జ్యన్యాన్ని కళ్లకు కట్టిన మూవీ.. నిజ జీవిత ఘటన ఆధారంగా..

మూవీ: నరివెట్ట

ఓటీటీ: సోనీ లివ్

డైరెక్టర్: అనురాజ్ మనోహర్

నటీనటులు: టొవినో థామస్, సూరజ్ వెంజరమూడు, చేరన్ తదితరులు

స్టోరీ: 2003లో కేరళలో జరిగిన ముత్తాంగ ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా

నరివెట్ట స్టోరీ ఏంటంటే?

నరివెట్ట మూవీని అనురాజ్ మనోహర్ తెరకెక్కించాడు. కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించి అతడు పెద్ద సాహసమే చేశాడు. 2003, ఫిబ్రవరి 19న తమకు ప్రభుత్వం ఇస్తామన్న భూముల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసీలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం, కాల్పులు జరపడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆధారంగా నరివెట్ట సినిమాను రూపొందించారు.

ఇది కానిస్టేబుల్ పీటర్ వర్గీస్ (టొవినో థామస్) చుట్టూ తిరిగే కథ. కేరళలోని వయనాడ్ లో ఉన్న అడవుల్లో ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయడానికి వెళ్లిన పోలీసు బలగాల్లో అతడు కూడా ఒకడు. అక్కడే పోలీస్ డిపార్ట్‌మెంట్ లో తన గురువుగా, శ్రేయోభిలాషిగా భావించే హెడ్ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ (సూరజ్ వెంజరమూడు)ను కోల్పోతాడు. అయితే దాని వెనుక ఉన్న కుట్రను అతడు ఛేదిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? పీటర్ వర్గీస్ ఆ ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని ఎలా బయటి ప్రపంచానికి తెలియజేస్తాడు? ఈ కుట్రలో భాగమైన వాళ్లు ఎవరు అన్నదే నరివెట్ట మూవీ స్టోరీ.

నరివెట్ట ఎందుకు చూడాలంటే?

సినిమాలోని కొన్ని సీన్లు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేస్తాయి. ఓ సాధారణ కానిస్టేబుల్.. మొత్తం వ్యవస్థనే ఎదిరించి ఓ పెద్ద కుట్రను బయటపెట్టిన తీరును కూడా ఆకట్టుకునే కథనంతో ఎంతో ఆసక్తికరంగా మలిచారు. ఇక ఈ సినిమాలో కానిస్టేబుల్ పీటర్ వర్గీస్ పాత్రలో టొవినో థామస్ జీవించేశాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ బీజీఎం కూడా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

నరివెట్ట.. బాక్సాఫీస్ సక్సెస్

నరివెట్ట 22 ఏళ్ల కిందట కేరళలో జరిగిన ఓ దురదృష్టకర సంఘటనపై తెరకెక్కిన సినిమా. సాధారణంగా ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా సక్సెస్ సాధించడం అరుదు. కానీ నరివెట్ట మాత్రం బాక్సాఫీస్ దగ్గర కూడా విజయం సాధించింది. రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సుమారు రూ.30 కోట్ల వరకూ వసూలు చేసింది.

ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన మలయాళం సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న నరివెట్ట ఓ మంచి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇదో మస్ట్ వాచ్ మూవీ.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe