ముగ్గురు హీరోయిన్లతో సూపర్ స్టార్ కృష్ణ డ్యూయెట్ సాంగ్- నీతో సాయంత్రం ఎంతో సంతోషం లిరిక్స్- శృంగార భావంతో రొమాంటిక్‌గా!
సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఎన్నో విషయాల్లో ఎక్స్‌పరిమెంట్స్ చేసిన కృష్ణ ముగ్గురు హీరోయిన్లతో కూడా ఆడిపాడారు. అలాంటి సినిమానే అమ్మ దొంగ. రొమాంటిక్‌గా సాగే అమ్మ దొంగ మూవీలోని డ్యూయెట్ సాంగ్ నీతో సాయంత్రం ఎంతో సంతోషం సాంగ్ లిరిక్స్ ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగు చిత్రసీమలో లెజండరీ హీరోగా పేరు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. అనేక అంశాల్లో విభిన్న ప్రయోగాలు చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కింది. టెక్నికల్‌గానే కాకుండా గ్లామర్ పరంగా కూడా వినూత్న ప్రయోగాన్ని సూపర్ స్టార్ కృష్ణ 90స్ కాలంలోనే చేశారు.

1994లోనే ముగ్గురితో
అదే ముగ్గురు హీరోయిన్లతో జోడీ కట్టడం. ఇటీవల తెలుగు కమర్షియల్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ఉండటం సాధారణం అయిపోయింది. కానీ, ముగ్గురు హీరోయిన్లతో డ్యూయెట్ సాంగ్ చేయడం చాలా అరుదు. అలాంటిది సూపర్ స్టార్ కృష్ణ 1994లోనే ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్‌తో అదరగొట్టారు.
ఆ పాటనే నీతో సాయంత్రం ఎంతో సంతోషం. 1994లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాల్లో అమ్మ దొంగ ఒక్కటి. ఈ సినిమాలో కృష్ణకు జోడీగా సౌందర్య, ఆమని, ఇంద్రజ ముగ్గురు హీరోయిన్స్ నటించారు. దివంగత నటుడు కోట శ్రీనివాసరావు విలన్ రోల్ ప్లే చేశారు.
నీతో సాయంత్రం సాంగ్ లిరిక్స్
అమ్మ దొంగ సినిమాలో సూపర్ హిట్ అయిన సాంగ్స్‌లో ముగ్గురు హీరోయిన్స్‌తో సూపర్ స్టార్ కృష్ణ డ్యాన్స్ చేసిన నీతో సాయంత్రం ఎంతో సంతోషం పాట ఒకటి. రొమాంటిక్ పదాలతో సాగే అమ్మ దొంగ మూవీలోని నీతో సాయంత్రం సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూద్దాం.
నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయి నీ సంతకం..
కొంగే బంగారం పొంగే సింగారం చుసేయ్ నా వాలకం..
ఓయమ్మో.. ఒపేరాల గమ్మో.. ఒళ్లంత తిమ్మిరాయనమ్మో..
బావయ్యో.. బంతులాడవయ్యా.. ఈ రాత్రే సంకురాతిరయ్యే..
ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం
ఓ హో హో హో.. హో హో హో..
హో హో హో.. హో హో హో..
నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయి నీ సంతకం..
నీ జంట కోరే సాయంత్రము.. నా ఒంటి పేరే సౌందర్యము..
మామిళ్లకొస్తే ఓ ఆమని.. కౌగిళ్లకిచ్ఛా నా ప్రేమని..
ఆ రాధాగోలేమో రాగం తీసే.. ఈ రాసలీలేమో ప్రాణం తీసే..
దరువే ఆనందం.. అయినా పరువే గోవిందం..
యమగున్న ఇతగాడే బహు కొంటె జతగాడు
చలి చుక్కల గిలిగింతకు పులకింతకు నిను పిలిచేలా..
కొంగే బంగారం పొంగే సింగారం చుసేయ్ నా వాలకం..
నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయి నీ సంతకం..
మేనత్త కొడుకా ఇది మేనకా.. మరుగుమ్మ కోసం పరుగెత్తక..
ఊహల్లో ఉంటె నీ ఊర్వశి.. నీకెందుకంటా ఈ రాక్షసి..
మీ కళ్లలో మాయ మస్కా కొట్టి.. నేనెల్లనా గాలి జట్కా ఎక్కి..
అదిగో ఆకాశం.. తారాసఖితో సావాసం..
మనఇద్దరి కసిముద్దులా రసమద్దెల వింతే..
నిద్రొయినా తొలిజన్మల సోదలిప్పుడు పొదలడిగేలే..
నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయి నీ సంతకం..
కొంగే బంగారం పొంగే సింగారం చుసేయ్ నా వాలకం..
ఓయమ్మో ఒపేరాల గమ్మో.. ఒళ్లంతా తిమ్మిరాయనమ్మో..
బావయ్యో బంతులాడవయ్యా.. ఈ రాత్రే సంకురాతిరయ్యే..
ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం..
ఓ హో హో హో.. హో హో హో..
హా హా హా.. హా హా హా..
రచన-గానం
కాస్తా అటు ఇటుగా శృంగార భావంతో ఉండే నీతో సాయంత్రం సాంగ్ లిరిక్స్‌ను పాటల రచయిత వేటూరి సుందరరామ్మూర్తి రాయగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర, ఎస్పీ శైలజ ముగ్గురు ఆలపించారు. ఇక ఈ సినిమాకు మంచి ఊపునిచ్చే సంగీతాన్ని కోటి అందించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



