Neevalle Song Lyrics: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న నీవల్లే సాంగ్ లిరిక్స్ ఇవే.. మాయ చేస్తున్న సిద్ శ్రీరామ్ వాయిస్

Neevalle Song Lyrics: నీవల్లే అనే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీ నుంచి మూడు రోజుల కిందట వచ్చిన ఈ పాట అప్పుడే మిలియన్ వ్యూస్ మార్క్ దాటేసింది. మరి ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ పాడుకోండి.

Published on: Feb 10, 2025, 15:48:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Neevalle Song Lyrics: నీవల్లే నీవల్లే అంటూ సిద్ శ్రీరామ్ పాడిన ఓ పాట ఇప్పుడు యువతను తెగ ఆకట్టుకుంటోంది. త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీ నుంచి మూడు రోజుల కిందట ఈ పాట రిలీజైంది. అప్పుడే మిలియన్ మార్క్ దాటి దూసుకెళ్తోంది. రోజురోజుకూ నీవల్లే సాంగ్ క్రేజ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నీవల్లే సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. చూసి మీరూ కాస్త గళం సవరించుకోండి.

యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న నీవల్లే సాంగ్ లిరిక్స్ ఇవే.. మాయ చేస్తున్న సిద్ శ్రీరామ్ వాయిస్
యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న నీవల్లే సాంగ్ లిరిక్స్ ఇవే.. మాయ చేస్తున్న సిద్ శ్రీరామ్ వాయిస్

దుమ్ము రేపుతున్న నీవల్లే సాంగ్

నీవల్లే సాంగ్ త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీలోనిది. వశిష్ట, సాంచీ రాయ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ ఈ పాట పాడాడు. ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ మ్యూజిక్ అందించింది. రఘురాం లిరిక్స్ అందించాడు. వల్లి గాయత్రి, లక్ష్మి మేఘన, ప్రియా, బృందలాంటి వాళ్లు కోరస్ అందించారు.

ఈ త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీకి కథ అందించి డైరెక్ట్ చేస్తున్నాడు మోహన్ శ్రీవత్స. విజయపాల్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజైన నీవల్లే సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా నిలిచింది. ఈ పాటను కంపోజ్ చేసిన విధానం, లిరిక్స్, స్టెప్స్ మరింత హైలైట్ గా నిలిచాయని చెప్పొచ్చు.

సిద్ శ్రీరామ్ వాయిస్ కు తెలుగులో చాలా మంది అభిమానులే ఉన్నారు. అతడు మరోసారి ఈ నీవల్లే పాటతో ఆకట్టుకుంటున్నాడు. త్రిబాణధారి బార్బారిక్ అనే వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ మారుతి సమర్పిస్తుండటం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ది రాజా సాబ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.

నీవల్లే సాంగ్ లిరిక్స్

ఏం అవుతున్నదో నా గుండెలో..

ఉంటుంది ఈ రోజిలా..

ఏం దాచుంచావో ఆ కళ్లలో..

నిలువెల్లా మునిగానిలా..

ఈ సంగతే నచ్చింది చాలా..

నీ సందడే నాలోపలా..

ఈ హాయినే మోయాలి అంటే..

ఎలా.. ఎలా..

నీవల్లే నీవల్లే ఈ మాయే నీవల్లే..

కల్లోనూ కల్లోలాలే నీవల్లే..

నీవల్లే నీవల్లే ఆనందం నన్నెల్లే..

మొత్తంగా మరిచాను నా నిన్నలే..

నీవల్లే నీవల్లే వెన్నెల్లో వర్షాలే..

కురిసాయిలే నీవల్లే..

నీవల్లే నీవల్లే వేవేల వర్ణాలే

నా చుట్టూ వాలాయిలే నీవల్లే..

నిన్నా మొన్నా నా తీరులో..

లేనే లేదే ఈ ఆరాటం..

నీతో పాటే అడుగేస్తుంటే..

మారిందే నా వాలకం..

సరదా సరదాగా సాగే ఈ పయనం..

సరిపోవట్లేదే నీతోటి సమయం..

జతగా నువ్వుంటే.. అంతే అదృష్టం..

అతిగే పొగిడేస్తే కాదే నా నేరం..

ఈ సంగతే నచ్చింది చాలా..

నీ సందడే నా లోపలా..

ఈ హాయినే మోయాలి అంటే..

ఎలా.. ఎలా..

నీవల్లే నీవల్లే ఈ మాయే నీవల్లే..

కల్లోనూ కల్లోలాలే నీవల్లే..

నీవల్లే నీవల్లే ఆనందం నన్నెల్లే..

మొత్తంగా మరిచాను నా నిన్నలే..

నీవల్లే నీవల్లే వెన్నెల్లో వర్షాలే..

కురిసాయిలే నీవల్లే..

నీవల్లే నీవల్లే వేవేల వర్ణలే

నా చుట్టూ వాలాయిలే నీవల్లే..

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More