Netflix Comedy Web Series: బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఫన్నీగా ట్రైలర్
Netflix Comedy Web Series: సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ 'ఢింఢోరా' (Dhindora) రెండో సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2021లో యూట్యూబ్ వేదికగా విడుదలై ఏకంగా 8.7 ఐఎండీబీ రేటింగ్ సాధించిన ఈ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Netflix Comedy Web Series: ఐదేళ్ల కిందట యూట్యూబ్ లో వచ్చి సంచలన విజయం సాధించిన ఢింఢోరా వెబ్ సిరీస్ రెండో సీజన్ నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. డబుల్ డోస్ తో వస్తున్న ఈ రెండో సీజన్.. నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు.

ఢింఢోరా సీజన్ 2 ట్రైలర్ ఇలా..
నెట్‌ఫ్లిక్స్ ఇండియా తమ సోషల్ మీడియా వేదికగా 'ఢింఢోరా సీజన్ 2' పోస్టర్‌ను షేర్ చేస్తూ.. “బాధలన్నీ పక్కన పెట్టి, రేపు ఢింఢోరా మోగించడానికి సిద్ధం కండి” అంటూ ఆసక్తి రేపింది. ఆ తర్వాత నవంబర్ 13న విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
మొదటి సీజన్‌లో తన విచిత్రమైన ప్రవర్తనతో కడుపుబ్బా నవ్వించిన టిటు మామ (Titu Mama), ఈ సీజన్‌లో ఏకంగా ప్రేమకథతో సందడి చేయబోతున్నారు. మొదటి సీజన్‌తో పోలిస్తే సీజన్ 2 చాలా పెద్ద స్కేల్‌లో రూపొందింది. ఇందులో కేవలం హాస్యం మాత్రమే కాకుండా, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, ఆకట్టుకునే పాటలు కూడా ఉండబోతున్నాయని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.
మొదటి సీజన్‌కు హిమాంక్ గౌడ్ దర్శకత్వం వహించగా, సీజన్ 2కు స్నేహా శెట్టి కోహ్లీ దర్శకత్వం వహించారు. భువన్ బామ్‌తో పాటు అబ్బాస్ దలాల్, హుస్సేన్ దలాల్, గోపాల్ దత్ తదితరులు రచనా బాధ్యతలు నిర్వర్తించగా, రోహిత్ రాజ్, భువన్ బామ్ సంయుక్తంగా నిర్మించారు.
టిటు మామకు గట్టి పోటీ ఇచ్చే ‘కవిత మామి’
ఈ సీజన్‌లో అత్తారింటి వారితో రాజీ పడటానికి టిటు మామ చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదురయ్యే ఊహించని చిక్కులే ప్రధాన కథాంశమని భువన్ బామ్ వెల్లడించారు. తన పాత్రలన్నీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరగా, సహజంగా అనిపించాలనే ఉద్దేశంతో వీటిని తీర్చిదిద్దానని ఆయన తెలిపారు.
మరోవైపు సీజన్ 2లో 'కవిత మామి' అనే కీలక పాత్రలో నటి సంజీదా షేక్ కనిపించనున్నారు. తన పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ.. “కవిత పాత్రలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, ఆమె టిటు మామకు ఏమాత్రం తగ్గకుండా గట్టి పోటీ ఇస్తుంది. ఆమె దగ్గర ప్రతిదానికీ సమాధానం సిద్ధంగా ఉంటుంది. నిజాన్ని ముందే పసిగట్టే తెలివైన మహిళ. టిటు మామను అందరికంటే బాగా అర్థం చేసుకున్న వ్యక్తిని ప్రేక్షకులు త్వరలోనే చూడబోతున్నారు” అని ఉత్సాహంగా చెప్పారు. వీరితో పాటు గాయత్రీ భరద్వాజ్, అనూప్ సోనీ, జీవేషు అహ్లువాలియా, ఇష్తియాక్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు.
సీజన్ 1 రీక్యాప్: లాటరీ టికెట్ చుట్టూ తిరిగిన అద్భుత కథ
2021లో భువన్ బామ్ తన యూట్యూబ్ ఛానెల్ 'బీబీ కి వైన్స్' (BB Ki Vines) లో విడుదల చేసిన మొదటి సీజన్ సంచలన విజయం సాధించింది. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులో ఉంది.
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబ పెద్ద అయిన బబ్లూకు అనుకోకుండా భారీ లాటరీ తగులుతుంది. ఆ సంతోషంలో అతడు తన భార్యకు ఈ విషయం చెప్పగా, ఆమె ఆగలేక కాలనీ అంతా ఢింఢోరా వేసి చెప్పేస్తుంది. కానీ సరిగ్గా అదే సమయంలో బబ్లూకు యాక్సిడెంట్ జరిగి గతం మర్చిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఈ సిరీస్‌లో భువన్ బామ్ ఒక్కరే పలు వైవిధ్యమైన పాత్రలను పోషించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు.
ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న 'ఢింఢోరా సీజన్ 2', నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునే వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


