నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ మూడో సీజన్ వచ్చేస్తోంది. ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ తేదీని ఓ వీడియో ద్వారా ఆ ఓటీటీ గురువారం (అక్టోబర్ 16) వెల్లడించింది. మరి ఎప్పటి నుంచి ఈ సిరీస్ చూడాలి? ఈసారి అసలు స్టోరీ ఏంటన్నది తెలుసుకోండి.

Published on: Oct 16, 2025, 17:45:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెట్‌ఫ్లిక్స్ లో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఉన్నాయి. వాటిలో ప్రేక్షకుల ఆదరణ పొందిన సిరీస్ ఢిల్లీ క్రైమ్. షెఫాలీ షా లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు మూడో సీజన్ రాబోతోంది. తాజాగా గురువారం (అక్టోబర్ 16) మూడో సీజన్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన ఓటీటీ
నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన ఓటీటీ

ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్

ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 రిలీజ్ డేట్ ఫైనల్‌గా వచ్చేసింది. షెఫాలీ షా, హుమా ఖురేషి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సిరీస్ నవంబర్‌లో రాబోతోంది. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ ఒక డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. 'ఢిల్లీ క్రైమ్ సీజన్ 3' నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ నవంబర్ మధ్యలో రిలీజ్ అవుతుందని కొన్ని రోజుల కిందట రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ వార్త నిజమని కన్ఫర్మ్ అయింది.

'ఢిల్లీ క్రైమ్' మేకర్స్ సీజన్ 3 కోసం ఒక డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో 'బడీ దీదీ' గురించి ఒక హింట్ ఇచ్చారు. ఈ రోల్‌ని హుమా ఖురేషి చేసినట్టు కనిపిస్తోంది. ఈ సీజన్‌తో ఆమె ఈ ఫ్రాంచైజీలోకి మెయిన్ విలన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ వీడియో చివర్లో షో టైటిల్ ద్వారానే ప్రీమియర్ డేట్‌ని అనౌన్స్ చేశారు.

'ఢిల్లీ క్రైమ్ సీజన్ 3' గురించి

షెఫాలీ షా 'మేడమ్ సర్' వర్తికా చతుర్వేదిగా, ఆమె టీమ్‌లో రసికా దుగల్ (నీతి సింగ్), రాజేష్ తైలాంగ్ (ఇన్‌స్పెక్టర్ భూపేంద్ర సింగ్) నటిస్తున్నారు. 'ఢిల్లీ క్రైమ్ సీజన్ 3' హ్యూమన్ ట్రాఫికింగ్, అబ్యూస్‌కి సంబంధించిన కేసు. ఈ సీజన్‌ని 'బేబీ ఫలక్ కేసు' ఆధారంగా తీశారని అంటున్నారు. ఈ కథ ఫలక్ అనే రెండేళ్ల పాప చుట్టూ తిరుగుతుంది. ఆ పాప తలకు గాయాలు, మనుషులు కొరికిన గాట్లు లాంటి తీవ్రమైన హింసను ఎదుర్కొంది.

ఆమె హ్యూమన్ ట్రాఫికింగ్‌కి గురైందని తేల్చారు. తానే తల్లిని అని చెప్పుకున్న 15 ఏళ్ల అమ్మాయి ఫలక్‌ని ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కి తీసుకొచ్చింది. కానీ ఇన్వెస్టిగేషన్‌లో ఆ టీనేజ్ అమ్మాయి కూడా ట్రాఫికింగ్, అబ్యూస్‌కి గురైందని, ఒక పెద్ద వయసు వ్యక్తి ఆమెను మోసం చేసి వాడుకున్నాడని తెలిసింది. ఈ కేసు పిల్లల మీద అఘాయిత్యాలు, బలవంతపు వ్యభిచారం, రహస్య పెళ్లిళ్లు చేసే ఒక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ని బయటపెట్టింది. ఇందులో ఆ మనుషుల అక్రమ రవాణాకు కారణమయ్యే బడీ దీదీ పాత్రలోనే హుమా ఖురేషీ నటించినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More