నెట్‌ఫ్లిక్స్ హారర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తోంది.. తొలి 6 నిమిషాల వీడియో రిలీజ్.. తొలి సీజన్‌కు 8 ఐఎండీబీ రేటింగ్

నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ హారర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది. గతంలోనే టీజర్ రిలీజ్ చేసిన ఆ ఓటీటీ తాజాగా.. తొలి 6 నిమిషాల వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తొలి సీజన్ కంటే కూడా ఈ రెండో సీజన్ మరింత భయపెట్టనున్నట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

Jun 5, 2025, 16:09:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హారర్ వెబ్ సిరీస్ అభిమానులకు గుడ్ న్యూస్. నెట్‌ఫ్లిక్స్ లో రెండున్నరేళ్ల కిందట వచ్చిన హారర్ సిరీస్ వెన్స్‌డే (Wednesday)కు ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. అది కూడా రెండు భాగాలుగా కావడం విశేషం. గత ఏప్రిల్ నెలలో ఈ రెండో సీజన్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్ గురువారం (జూన్ 5) ఈ రెండో సీజన్ తొలి 6 నిమిషాల వీడియోను రిలీజ్ చేయడం విశేషం.

నెట్‌ఫ్లిక్స్ హారర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తోంది.. తొలి 6 నిమిషాల వీడియో రిలీజ్.. తొలి సీజన్‌కు 8 ఐఎండీబీ రేటింగ్
నెట్‌ఫ్లిక్స్ హారర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తోంది.. తొలి 6 నిమిషాల వీడియో రిలీజ్.. తొలి సీజన్‌కు 8 ఐఎండీబీ రేటింగ్

వెన్స్‌డే రెండో సీజన్

నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన వెన్స్‌డే వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో ఏకంగా 8 రేటింగ్ నమోదైంది. దీంతో రెండో సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఆ ఓటీటీతొలి 6 నిమిషాల వీడియో రిలీజ్ చేసింది.

ఇందులో వెన్స్‌డే అనే అమ్మాయిని ఓ కుర్చీకి కట్టేసి ఉండటం చూడొచ్చు. తాను సీరియల్ కిల్లర్ బేస్‌మెంట్ లో ఉన్నానని, తానే అతని తర్వాత టార్గెట్ అని అతడు అనుకుంటున్నట్లు ఆమె వాయిస్ ఓవర్ చెబుతుంది. అక్కడితో సీన్ కట్ అయి ఆరు వారాల ముందుకు వెళ్తుంది. ఆమెకు అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పే ఫ్లాష్‌బ్యాక్ అది.

వెన్స్‌డే సీజన్ 2 వచ్చేది ఎప్పుడంటే?

వెన్స్‌డే రెండో సీజన్ టీజర్ గతంలోనే రిలీజ్ చేశారు. అప్పుడే ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ తేదీలను నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ లోని ప్రధాన పాత్ర వెన్స్‌డే ఆడమ్స్ ఈ కొత్త సీజన్లో మరింత ప్రమాదకరంగా మారి భయపెట్టడానికి వస్తున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

“మీ కేలండర్ ను ఇప్పుడే క్లియర్ చేసి పెట్టుకోండి. వెన్స్‌డే సీజన్ 2 ఆగస్ట్ 6 నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది” అనే క్యాప్షన్ తో అప్పట్లో ఈ టీజర్ రిలీజ్ చేసింది. వెన్స్‌డే రెండో సీజన్ రెండు భాగాలుగా రాబోతుండటం విశేషం. తొలి భాగం ఆగస్ట్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక రెండో భాగం సెప్టెంబర్ 3న వస్తుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.

వెన్స్‌డే వెబ్ సిరీస్ గురించి..

వెన్స్‌డే ఓ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ కామెడీ వెబ్ సిరీస్. ఛార్లెస్ ఆడమ్స్ క్రియేట్ చేసిన వెన్స్‌డే ఆడమ్స్ అనే పాత్ర చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఈ పాత్రలో జెన్నా ఒర్టెగా నటించింది. ఆమెకు కొన్ని అతీత శక్తులు ఉంటాయి. తన సోదరుడిని బాయ్స్ పోలో టీమ్ సభ్యులు ఏడిపించారని తెలుసుకొని పూల్ లోకి పిరానాలను వదులుతుంది.

అది తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం ఆమెను స్కూల్ నుంచి పంపించేస్తుంది. అక్కడి నుంచి ఆమె వెర్మాంట్ లోని జెరికోలో ఉన్న నెవెర్‌మోర్ అకాడెమీకి వెళ్తుంది. అక్కడ కూడా ఆమె ప్రవర్తన ఇతర విద్యార్థులకు వింతగా అనిపిస్తుంది. అయితే తనకున్న శక్తులతో అక్కడ జరిగే ఓ హత్య మిస్టరీని ఛేదిస్తుంది. తొలి సీజన్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆగస్టులో రాబోయే వెన్స్‌డే రెండో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More