నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ మారిన టాప్ 10 ట్రెండింగ్ సినిమాల స్థానాలు- కొత్తగా 4, ది బెస్ట్ 2- తెలుగులో స్ట్రీమింగ్!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 సినిమాలు ట్రెండింగ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయ. అయితే, ఈ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ మూవీస్‌ స్థానాలు మారిపోయాయి. కొత్తగా ఓటీటీ రిలీజ్ అయిన నాలుగు సినిమాలు ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చేశాయి. మరి వీటిలో ది బెస్ట్‌గా ఉన్న రెండు సినిమాలపై లుక్కేద్దాం.

Published on: Jun 2, 2025, 14:37:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటికప్పుడు న్యూ కంటెంట్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటుంది. వాటిలో ట్రెండింగ్ అయ్యే టాప్ 10 సినిమాల జాబితా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది. అయితే, ఇవాళ నెట్ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల స్థానాలు మారిపోయాయి. మరి ఆ సినిమాలు, వాటి ట్రెండింగ్ స్థానాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ మారిన టాప్ 10 ట్రెండింగ్ సినిమాల స్థానాలు- కొత్తగా 4, ది బెస్ట్ 2- తెలుగులో స్ట్రీమింగ్!
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ మారిన టాప్ 10 ట్రెండింగ్ సినిమాల స్థానాలు- కొత్తగా 4, ది బెస్ట్ 2- తెలుగులో స్ట్రీమింగ్!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు:

హిట్ 3 (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- టాప్ 1

రెట్రో (తెలుగు, తమిళ గ్యాంగ్‌స్టర్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం)- టాప్ 2

సికందర్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- టాప్ 3

ఏ విడోస్ గేమ్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- టాప్ 4

ది డిప్లోమాట్ (హిందీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- టాప్ 5

గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- టాప్ 6

జాక్ (తెలుగు ఇన్వెస్టిగేషన్ కామెడీ రొమాంటిక్ సినిమా)- టాప్ 7

ఛావా (తెలుగు డబ్బింగ్ హిందీ పీరియాడిక్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- టాప్ 8

కోర్ట్ (తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- టాప్ 9

మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ స్పై యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- టాప్ 10

కొత్తగా నాలుగు

ఇలా ఇవాళ (జూన్ 2) ఈ పది సినిమాలు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో చోటు సంపాదించుకున్నాయి. అయితే వీటిలో కొత్తగా నాలుగు సినిమాలు హిట్ 3, రెట్రో, సికందర్, ఏ విడోస్ గేమ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ అయిన తక్కువ సమయంలో మొదటి టాప్ 4 స్థానాల్లో ఈ మూవీస్ ట్రెండ్ అవుతున్నాయి.

ఓటీటీ ట్రెండింగ్‌లో స్థానాల మార్పు

ఇక మిగతా ఆరు సినిమాల ఓటీటీ ట్రెండింగ్‌ స్థానాల్లో మార్పు జరిగింది. ఇంతకుముందు టాప్ 1లో ది డిప్లోమాట్, టాప్ 2లో జాక్, టాప్ 3లో గుడ్ బ్యాడ్ అగ్లీ ఇలా స్థానాలు ఉండేవి. కానీ, ఇవాళ మాత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ 10 సినిమాల స్థానాలు మారిపోయాయి.

హిట్ 3 ఓటీటీ

ఇక కొత్తగా ఓటీటీ ట్రెండ్ అవుతోన్న నాలుగు సినిమాల్లో ది బెస్ట్‌గా హిట్ 3, రెట్రో మూవీస్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అర్జున్ సర్కార్‌గా నటించిన నేచురల్ స్టార్ నాని మూవీ హిట్ 3 రూ. 100 కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. అలాగే, ఐఎమ్డీబీ నుంచి పదికి 7.1 రేటింగ్ సొంతం చేసుకుంది.

రెట్రో ఓటీటీ

కాబట్టి హిట్ 3 చూసేందుకు ది బెస్ట్ మూవీ. హిట్ ది థర్డ్ కేస్‌తోపాటు చూసేందుకు మరో ది బెస్ట్ సినిమా రెట్రో. తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్‌గా నటించిన మూవీ ఇది. రెట్రో మూవీ కూడా రూ. 200 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. అలాగే, ఐఎమ్‌డీబీలో 7.3 రేటింగ్ తెచ్చుకుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More