నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన ది బెస్ట్ 4 ఇవే.. ఎందుకో తెలుసా?
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో ఇవాళ టాప్ 10 సినిమాలు ఉన్నాయి. వీటిలో చూడాల్సిన ది బెస్ట్ సినిమాలుగా నాలుగు మాత్రమే ఉన్నాయి. అవి కూడా తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్స్ గల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో పాపులారిటీ పొందినవాటిలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ ప్రియులను ఆకర్షిస్తుంది. అలాంటి నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే, వాటిలోని ది బెస్ట్ 4 సినిమాలపై లుక్కేద్దాం.

జాట్ ఓటీటీ
టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన తొలి బాలీవుడ్ మూవీ జాట్. జూన్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తెలుగు భాషల్లో జాట్ ఓటీటీ రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 1 ప్లేసులో జాట్ దూసుకుపోతోంది. యాక్షన్ థ్రిల్లర్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 120 కలెక్షన్స్ రాబట్టింది. దీంతో జాట్ చూసేందుకు బెస్ట్ మూవీగా నిలిచింది.
హిట్ 3 ఓటీటీ
నేచురల్ స్టార్ నాని-శైలేష్ కొలను కాంబినేషన్‌లో వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్ 3 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉంది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న హిట్ 3 ఐఎమ్‌డీబీ నుంచి 7 రేటింగ్ పొందడంతో చూసేందుకు బెస్ట్ మూవీగా స్థానం సంపాదించుకుంది.
రెట్రో ఓటీటీ
సూర్య, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సినిమా రెట్రో. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 3 ప్లేసులో ఓటీటీ ట్రెండింగ్ అవుతోన్న రెట్రో తెలుగులో రిలీజ్ అయింది. 7.1 రేటింగ్ సాధించిన రెట్రో చూసేందుకు బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు.
కె.ఒ ఓటీటీ
ఫ్రెంచ్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ కె.ఒ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 4 స్థానంలో దూసుకుపోతోంది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ సూపర్బ్‌గా ఉండటంతో చూసేందుకు బెస్ట్ మూవీగా నిలిచింది.
ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు
వీటితోపాటు పాటు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 5లో సికందర్, టాప్ 6లో స్నైపర్ అల్టిమేట్ కిల్, ఏడో స్థానంలో ది డిప్లోమాట్, 8వ ప్లేసులో హిట్ ది ఫస్ట్ కేస్ (హిందీ), టాప్ 9లో ఏ విడోస్ గేమ్, టాప్ 10లో గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచాయి.
వీకెండ్‌లో
టాప్ 5 నుంచి 10 వరకు స్థానాల్లో ఉన్న ఓటీటీ ట్రెండింగ్ సినిమాల కంటే మొదటి నాలుగు చూసేందుకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవి వీకెండ్‌లో చూసేందుకు మరింత బెస్ట్.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



