ఆ స్టార్ హీరో నిర్మించిన సినిమాలన్నీ తొలగించిన నెట్‌ఫ్లిక్స్.. మూడు మాత్రమే మిగిలాయి.. కావాలనే చేసిందా?

నెట్‌ఫ్లిక్స్ సడెన్‌గా కొన్ని సినిమాలను తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమాల్లో మూడు తప్ప మిగిలినవన్నీ కనిపించడం లేదు. సితారే జమీన్ పర్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యే ముందు ఇలా చేయడం గమనార్హం.

Published on: Jun 13, 2025, 16:37:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆమిర్ ఖాన్ తాను తాజాగా నిర్మించిన మూవీ సితారే జమీన్ పర్ కేవలం థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని, తర్వాత ఓటీటీలోకి రాదని సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.125 కోట్ల ఆఫర్ ఇచ్చినా అతడు తిరస్కరించాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడీ మూవీ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన కొన్ని సినిమాలను నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్ పై నుంచి తొలగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఆ స్టార్ హీరో నిర్మించిన సినిమాలన్నీ తొలగించిన నెట్‌ఫ్లిక్స్.. మూడు మాత్రమే మిగిలాయి.. కావాలనే చేసిందా?
ఆ స్టార్ హీరో నిర్మించిన సినిమాలన్నీ తొలగించిన నెట్‌ఫ్లిక్స్.. మూడు మాత్రమే మిగిలాయి.. కావాలనే చేసిందా?

ఈ సినిమాలన్నీ మాయం..

సితారే జమీన్ పర్ మూవీ థియేటర్లలో మాత్రమే రిలీజ్ అవుతుందన్న ఆమిర్ ఖాన్ ప్రకటన సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపింది. అయితే ఆ తర్వాత తాజాగా నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'సీక్రెట్ సూపర్‌స్టార్', 'దంగల్', 'ఢిల్లీ బెల్లీ', 'పీప్లీ లైవ్', 'ధోబీ ఘాట్', 'జానే తూ... యా జానే నా', 'తారే జమీన్ పర్', ‘లగాన్’లాంటి సినిమాలను నెట్ఫ్లిక్స్ తొలగించింది.

రాబోయే ఆమిర్ ఖాన్ థియేట్రికల్ ఎక్స్‌క్లూజివ్‌లను, 'తారే జమీన్ పర్' ఫ్రాంఛైజ్‌లోని సినిమాలను థియేటర్లలోకి రాకముందే దక్కించుకోవాలనుకునే ఒక పెద్ద వ్యూహంలో ఇది భాగం అని తెలుస్తోంది.

అయితే నెట్‌ఫ్లిక్స్ లో ఇంకా ఈ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన కొన్ని సినిమాలు ఉన్నాయి. 'లాపతా లేడీస్', 'లాల్ సింగ్ చద్దా', 'తలాష్: ది ఆన్సర్ లైస్ వితిన్' అనే మూడు మూవీస్ ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

ఓటీటీ రిలీజ్‌లపై ఆమిర్ అసంతృప్తి

సినిమాలు చాలా త్వరగా థియేటర్ల నుండి స్ట్రీమింగ్ సేవలకు మారుతుండటంపై ఆమిర్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనికి 'లాపతా లేడీస్' ఉదాహరణను ప్రస్తావించాడు. 2024 మార్చి 1న థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత అది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఇలా త్వరగానే ఓటీటీలోకి తీసుకురావడంతో దాని బాక్సాఫీస్ కలెక్షన్లు పరిమితమైపోయాయన్నది ఆమిర్ వాదన. దీంతో తన నెక్ట్స్ మూవీ సితారే జమీన్ పర్ ను కేవలం థియేటర్లలో రిలీజ్ చేయాలని, తర్వాత ఓటీటీ లేదా వీడియో ఆన్ డిమాండ్ సర్వీసులకు ఇవ్వకూడదని ఆమిర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఓటీటీల ఆధిపత్యాన్ని సవాలు చేస్తోంది.

అంతేకాదు తమ కొత్త సినిమాను భారీ మొత్తానికి కూడా ఇవ్వకపోవడం ద్వారా థియేటర్లలో సినిమాల ప్రదర్శన ప్రాముఖ్యతను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ చాటి చెప్పినట్లయింది. ఇక ఇప్పుడు సితారే జమీన్ పర్ సినిమాను ప్రేక్షకులు కేవలం థియేటర్లలోనే చూడాల్సి వస్తుంది. తర్వాత ఓటీటీలో చూద్దాంలే అనే అవకాశం లేదు. మరి దీనికి ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More