Super Subbu Trailer: నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్

Super Subbu Trailer: నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన తొలి తెలుగు వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు ట్రైలర్ రిలీజ్ కు ముహూర్త ఫిక్సయింది. ఈ ట్రైలర్ ను బుధవారం (జూన్ 24) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Published on: Jun 23, 2026, 17:53:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Super Subbu Trailer: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటిస్తున్న నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా సందీప్ నటిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ రేపు రిలీజ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

Super Subbu Trailer: నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్
Super Subbu Trailer: నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్

సూపర్ సుబ్బు ట్రైలర్

నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన తొలి తెలుగు వెబ్ సిరీస్ గా ఈ సూపర్ సుబ్బు ప్రత్యేకత సంపాదించుకుంది. ఈ సిరీస్ ను జులై 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.

ఇక బుధవారం (జూన్ 24) ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. “ఎంతో అసౌకర్యానికి గురి చేసే సంభాషణే సుబ్బు ఫుల్ టైమ్ జాబ్ లాగా మారిపోయింది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేస్తూ.. ట్రైలర్ ను రేపు లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఓ ఫన్నీ పోస్టర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ విశేషాలు

'ఛోటా భీమ్' ఫేమ్ రాజీవ్ చిలకా, భరత్ లక్ష్మీపతులు తమ చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సిరీస్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. యానిమేషన్, కిడ్స్ కంటెంట్ లో టాప్ లో ఉన్న ఈ ప్రొడక్షన్ హౌస్.. ఒక మెయిన్ స్ట్రీమ్ లైవ్-యాక్షన్ వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టడం టాలీవుడ్ బిజినెస్ సర్కిల్స్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

సాధారణంగా నెట్‌ఫ్లిక్స్ అంటే 'రానా నాయుడు' లేదా 'సేక్రెడ్ గేమ్స్' లాంటి డార్క్, గ్రిట్టీ క్రైమ్ థ్రిల్లర్స్‌కు కేరాఫ్ అడ్రస్ అనే ముద్ర ఉంది. కానీ టాలీవుడ్ లోకల్ మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించాలంటే పక్కా రీజనల్ కామెడీయే ఏకైక మార్గమని ఈ గ్లోబల్ ప్లాట్‌ఫామ్ గ్రహించినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ సంస్థ నేరుగా నిర్మించిన తొలి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

మల్లిక్ రామ్ ఈ కామెడీ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. మురళీ శర్మ, గెటప్ శ్రీనులాంటి వాళ్లు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే టాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న సందీప్ కిషన్.. ఈ వెబ్ సిరీస్ లో ఓ సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా నటించడమే అన్నింటి కంటే ఆసక్తి రేపుతోంది. మరి ఈ సిరీస్ ట్రైలర్ ఎలా ఉండబోతోంది? ఇది తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తిని రేపనుంది అన్నది తేలాలంటే మరికొన్ని గంటలు ఆడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More