నెట్ఫ్లిక్స్ థ్రిల్లర్ సిరీస్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ప్రతీక్ గాంధీ నటించిన తాజా వెబ్ సిరీస్ 'సారే జహాన్ సే అచ్చా' విడుదల తేదీని ప్రకటించారు. మేకర్స్ విడుదల చేసిన కొత్త డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోలో ప్రధాన నటుడు ప్రతీక్ గాంధీ కీలక పాత్రలో కనిపిస్తూ కాస్త డిఫరెంట్ గా ఈ డేట్ అనౌన్స్ చేశారు. ఈ స్పై డ్రామా వచ్చే నెల ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది.
'సారే జహాన్ సే అచ్చా' రిలీజ్ డేట్

'సారే జహాన్ సే అచ్చా' ఆగస్ట్ 13 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మేరకు మేకర్స్ ప్రతీక్ గాంధీతో కూడిన ఒక అనౌన్స్‌మెంట్ వీడియోను గురువారం (జులై 17) విడుదల చేశారు. ఇందులో అతడు గూఢచారి అధికారి విష్ణు శంకర్‌గా కనిపించాడు. మోర్స్ కోడ్‌లో సమాచారాన్ని సేకరిస్తుంటాడు. ఒక గూఢచారికి ప్రతి సమాచారం ఎంత ముఖ్యమన్నది వివరిస్తాడు.
"మా మిషన్ విజయం లేదా వైఫల్యం దానిపై ఆధారపడి ఉంటుంది" అని అతను ఆ వీడియోలో చెబుతూ.. శత్రు దేశమే లక్ష్యమని, వారి స్థావరంలోకి ప్రవేశించి వారిని అణుశక్తిగా మారకుండా ఆపడమే అంతిమ లక్ష్యమని అనడం చూడొచ్చు. అతడు రాసిన మోర్స్ కోడ్ ను డీకోడ్ చేస్తూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని స్క్రీన్ పై చూపించారు. "ఈ ఇండిపెండెన్స్ డే నాడు మా లక్ష్యం స్పష్టం. భారతదేశాన్ని శత్రువు కంటే ఒక అడుగు ముందుంచాలి" అని అతను వీడియోలో చెప్పడం వినిపిస్తుంది.
'సారే జహాన్ సే అచ్చా' గురించి..
1970ల నేపథ్యంలో రూపొందిన ‘సారే జహాన్ సే అచ్చా’లో ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో నటించాడు. సుమిత్ పురోహిత్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సన్నీ హిందూజా, సుహైల్ నాయర్, కృతికా కమ్రా, తిలోతమా షోమ్, రజత్ కపూర్, అనూప్ సోని కీలక పాత్రల్లో నటించారు.
తన పాత్ర గురించి ప్రతీక్ ఒక మీడియా ప్రకటనలో మాట్లాడుతూ.. "మేము అత్యవసరమైన, తీవ్రమైన, బెదిరింపులతో నిండిన, నిశ్శబ్ద ఉద్రిక్తతతో కూడిన ప్రపంచాన్ని నిర్మించాం" అని అన్నాడు. విష్ణు శంకర్‌ను కర్తవ్యం, నైతికత మధ్య సన్నని దారంపై నడిచే వ్యక్తిగా అతను గుర్తు చేసుకున్నాడు. ఇది ఇటీవలి కాలంలో తన అత్యంత సవాలుతో కూడుకున్న పాత్రలలో ఒకటి అని ప్రతీక్ స్పష్టం చేశాడు. ఈ వెబ్ సిరీస్ లోని ఇతర పాత్రల గురించి సమాచారం ఇంకా వెల్లడించలేదు.
{{/usCountry}}తన పాత్ర గురించి ప్రతీక్ ఒక మీడియా ప్రకటనలో మాట్లాడుతూ.. "మేము అత్యవసరమైన, తీవ్రమైన, బెదిరింపులతో నిండిన, నిశ్శబ్ద ఉద్రిక్తతతో కూడిన ప్రపంచాన్ని నిర్మించాం" అని అన్నాడు. విష్ణు శంకర్‌ను కర్తవ్యం, నైతికత మధ్య సన్నని దారంపై నడిచే వ్యక్తిగా అతను గుర్తు చేసుకున్నాడు. ఇది ఇటీవలి కాలంలో తన అత్యంత సవాలుతో కూడుకున్న పాత్రలలో ఒకటి అని ప్రతీక్ స్పష్టం చేశాడు. ఈ వెబ్ సిరీస్ లోని ఇతర పాత్రల గురించి సమాచారం ఇంకా వెల్లడించలేదు.
{{/usCountry}}