నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. తెలుగులో 6 స్ట్రీమింగ్.. కానీ, చూడాల్సిన ది బెస్ట్ 4 మాత్రమే!
నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ టాప్ 10లో పది సినిమాలు ట్రెండింగ్ అవుతున్నాయి. వాటిలో ఏకంగా 6 సినిమాలు తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక అందులోను తెలుగు ఓటీటీ ఆడియెన్స్ చూడాల్సిన ది బెస్ట్ సినిమాలుగా నాలుగు మాత్రమే ఉన్నాయి. మరి ఆ ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ఓటీటీ దిగ్గజ సంస్థల్లో నెట్ఫ్లిక్స్ ఒకటి. ఇందులో ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌ను ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో ప్రతి రోజు ఓటీటీ ట్రెండింగ్లో టాప్ 10 సినిమాలను నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్‌లో చూపిస్తుంది. అలా నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వాటిలో చూడాల్సిన ది బెస్ట్ 4 ఓటీటీ స్ట్రీమింగ్సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు:
థగ్ లైఫ్ తెలుగు, తమిళ గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం)- టాప్ 1లో ట్రెండింగ్
రైడ్ 2 (హిందీ పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా)- టాప్ 2 స్థానంలో ట్రెండింగ్
ది ఓల్డ్ గార్డ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- టాప్ 3లో ట్రెండింగ్
హిట్ 3 (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- టాప్ 4 ప్లేసులో ట్రెండింగ్
ది ఓల్డ్ గార్డ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- టాప్ 5 స్థానంలో ట్రెండింగ్
జాట్ (తెలుగు డబ్బింగ్ హిందీ రూరల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- టాప్ 6లో ట్రెండింగ్
కెపాప్ డీమాన్ హంటర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ డ్రామా సినిమా)- టాప్ 7 స్థానంలో ట్రెండింగ్
లైఫ్ ఇన్ ఏ మెట్రో (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ)- టాప్ 8లో ట్రెండింగ్
ది డిప్లోమాట్ (హిందీ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- టాప్ 9 స్థానంలో ట్రెండింగ్
సికందర్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- టాప్ 10లో ట్రెండింగ్
ది బెస్ట్ నాలుగు మాత్రమే
ఈ టాప్ 10 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో ఆరు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో తెలుగు ఆడియెన్స్ చూసేందుకు ది బెస్ట్‌గా ఉన్న సినిమాలు మాత్రం నాలుగే.
థగ్ లైఫ్ ఓటీటీ
థగ్ లైఫ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ టాప్ 1 స్థానంలో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. కమల్ హాసన్, త్రిష, శింబు, అభిరామి, సాన్య మల్హోత్రా వంటి అగ్ర నటీనటులు నటించడం, ఈ సినిమాకు లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించడం వంటి కారణాలతో థగ్ లైఫ్ ది బెస్ట్‌గా ఉంది.
హిట్ 3 ఓటీటీ
నేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిట్ 3. ఇది టాప్ 4లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎంతో థ్రిల్లింగ్‌గా చివరి వరకు చూసేలా కట్టిపడేస్తుంది. అందుకే ఈ సినిమా కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
ది ఓల్డ్ గార్డ్ అండ్ ది ఓల్డ్ గార్డ్ 2
జులై 2 నుంచి ది ఓల్డ్ గార్డ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆరోజు నుంచే టాప్‌లో ట్రెండింగ్ అయిన ఈ సినిమా ఇవాళ టాప్ 3 స్థానంలో ఉంది. దీంతోపాటు 2020లోని ది ఓల్డ్ గార్డ్ కూడా ఇప్పుడు టాప్ 5 ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ రెండింట్లో అదిరిపోయే యాక్షన్ సీన్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండటంతో ది బెస్ట్ అనొచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



