...
...
Next Story

చిరంజీవి, విజయశాంతి పాత్రలతో సరికొత్త సీరియల్.. పగ తీర్చుకునే చెల్లి కథ.. 2 రోజుల్లో ప్రారంభం!

బుల్లితెరపై సరికొత్త సీరియల్ ఆటో విజయశాంతి ప్రారంభం కానుంది. ఈ సీరియల్‌లో ప్రధాన పాత్రల పేర్లు చిరంజీవి, విజయశాంతి కావడం విశేషంగా మారింది. అన్న చావుకు పగ తీర్చుకునే చెల్లి కథతో తెరకెక్కిన ఆటో విజయశాంతి సీరియల్ మరో రెండు రోజుల్లో జీ తెలుగులో ప్రారంభం కానుంది.

Published on: Jul 5, 2025, 12:10:50 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్‌​లతో సాగే సీరియళ్లను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్‌​ను అందించేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునే కథ, కథనం ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు అందిస్తున్న సరికొత్త ధారావాహిక ‘ఆటో విజయశాంతి’.

ఆటో విజయశాంతి టీవీ ప్రీమియర్

చిరంజీవి, విజయశాంతి పాత్రలతో సరికొత్త సీరియల్.. పగ తీర్చుకునే చెల్లి కథ.. 2 రోజుల్లో ప్రారంభం!
చిరంజీవి, విజయశాంతి పాత్రలతో సరికొత్త సీరియల్.. పగ తీర్చుకునే చెల్లి కథ.. 2 రోజుల్లో ప్రారంభం!

కుటుంబ బాధ్యతలు, ప్రేమ, త్యాగం వంటి భావోద్వేగాలతో అల్లుకున్న కథతో రూపొందుతున్న ‘ఆటో విజయశాంతి’ జులై 7న ప్రారంభం కానుంది. అంటే, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సీరియల్ ప్రసారం కానుంది. జీ తెలుగులో జులై 7న టీవీ ప్రీమియర్ కానున్న ఆటో విజయశాంతి సీరియల్ రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.

చెల్లెళ్ల కథ

ఆటో విజయశాంతి సీరియల్​ కథ కుటుంబ బాధ్యతలు, బంధాల చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కింది. చెల్లెళ్లను ప్రేమగా పెంచుకునే రజినీకాంత్ ​(అలీ రెజా) ఓ ప్రమాదంలో చనిపోవడంతో కథ మొదలవుతుంది. అన్న బాధ్యతలను నెరవేర్చేందుకు ఆటో డ్రైవర్‌​గా మారుతుంది విజయశాంతి (వర్షిణి).

అన్న చావుకు ప్రతీకారం

అన్న చావుకి కారణమైన వాళ్లపై పగ సాధించాలనుకుంటుంది దుర్గ (సాండ్ర). అనుకోకుండా విజయశాంతి జీవితంలోకి వస్తాడు చిరంజీవి (స్వామి). తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేమకు నోచుకోని చిరంజీవి.. విజయశాంతి మనసు ఎలా గెలుస్తాడు? తన అన్న చావుకి ప్రతీకారం తీర్చుకునేందుకు దుర్గ ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే ఆటో విజయశాంతి సీరియల్‌​ని తప్పకుండా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.

ఆటో విజయశాంతి నటీనటులు

కుటుంబ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ధారావాహికలో స్వామి, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, సాండ్ర, సంధ్య, రాజేష్, నిహాల్, మహర్షి రాఘవ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

జీ తెలుగులో

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe