Nidhhi Agerwal: ముఖానికి మాస్క్ పెట్టుకొని ఈడీ ముందుకు నిధి అగర్వాల్.. బెట్టింగ్ కేసులో హాజరైన రాజా సాబ్ బ్యూటీ

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో ఈడీ ముందు హాజరైంది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి ఆమె ముఖానికి మాస్క్ పెట్టుకొని వచ్చింది. ఈ కేసులో ఆమెతోపాటు పలువురు ఇతర సెలబ్రిటీలు కూడా ఉన్న విషయం తెలిసిందే.

Published on: Aug 19, 2026, 14:32:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nidhhi Agerwal: అక్రమ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ హాట్ బ్యూటీ, ఇటీవల 'ది రాజా సాబ్' సినిమాలో మెరిసిన నిధి అగర్వాల్ బుధవారం (ఆగస్ట్ 19) హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడి) ఆఫీస్‌లో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల భారీ భద్రత నడుమ ఈడీ కార్యాలయానికి చేరుకున్న నిధి.. ముఖానికి మాస్క్ ధరించి లోపలికి వెళ్లిపోయారు. అక్కడ వేచి ఉన్న మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాపర్లతో మాట్లాడేందుకు ఆమె అసలు ఇష్టపడలేదు.

Nidhhi Agerwal: ముఖానికి మాస్క్ పెట్టుకొని ఈడీ ముందుకు నిధి అగర్వాల్.. బెట్టింగ్ కేసులో హాజరైన రాజా సాబ్ బ్యూటీ
Nidhhi Agerwal: ముఖానికి మాస్క్ పెట్టుకొని ఈడీ ముందుకు నిధి అగర్వాల్.. బెట్టింగ్ కేసులో హాజరైన రాజా సాబ్ బ్యూటీ

ఈడీ అధికారులు ఆమెను గంటల తరబడి సుదీర్ఘంగా విచారించినట్లు సమాచారం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు ఆమెకు ఎంత మొత్తం ముట్టింది? ఆ లావాదేవీలు ఏ ఖాతాల ద్వారా జరిగాయనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

బెట్టింగ్ యాప్ కేసులో అసలేం జరిగింది?

అక్రమ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై తెలంగాణ పోలీసులు గతంలోనే గట్టి నిఘా పెట్టారు. గతంలో సిఐడీ ముందు విచారణకు హాజరైన నిధి అగర్వాల్‌కి.. తాజాగా ఈడీ సమన్లు జారీ చేసి రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, స్టార్స్ వల్ల లక్షలాది మంది యువత బెట్టింగ్ యాప్స్ బారిన పడి కోట్లాది రూపాయలు నష్టపోతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో పిఎమ్ ఫణీంద్ర శర్మ అనే వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867ని ఉల్లంఘిస్తూ ప్రమోషన్లు చేస్తున్నారని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దాంతో నిధి అగర్వాల్‌తో పాటు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి సహా 21 మంది ప్రముఖులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

"సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం వల్ల సామాన్య యువత వాటిని నిజమైన ఇన్వెస్ట్‌మెంట్ అని నమ్మి మోసపోతున్నారు. ఈ ఆర్థిక నేరాల్లో ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే" అని పిటిషనర్ ఫణీంద్ర శర్మ అన్నారు.

సుప్రీం కోర్టు సీరియస్.. ఇండస్ట్రీలో తీవ్ర ఆందోళన

ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను కఠినంగా నియంత్నించాలని, వీటి ప్రచారాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై త్వరలోనే తుది విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేయడంతో, ప్రమోషన్లు చేసిన ఇతర సినీ ప్రముఖులకు కూడా వరుసగా సమన్లు అందే అవకాశం కనిపిస్తోంది.

కెరీర్ పీక్‌లో లీగల్ ట్రబుల్స్

అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన 'సవ్యసాచి' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన నిధి అగర్వాల్.. ఉస్తాద్ రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారింది.

ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన 'ది రాజా సాబ్' సినిమాలో నటించి మెప్పించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు' ప్రాజెక్ట్‌లోనూ కీలక పాత్ర పోషించింది. తమిళం, హిందీ ఆఫర్లతో బిజీగా ఉన్న టైమ్‌లో ఈ ఈడి విచారణ, లీగల్ ఇష్యూస్ ఆమె కెరీర్‌కి కాస్త ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More