Niharika Konidela Snake Dance: అదిరిపోయిన నిహారిక కొణిదెల స్నేక్ డ్యాన్స్- రాకాస నుంచి క్యాచీ ట్యూన్‌తో సాంగ్ రిలీజ్!

Niharika Konidela Snake Dance Song Released: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా నిర్మించిన తెలుగు కామెడీ హారర్ ఫాంటసీ సినిమా రాకాస. తాజాగా రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో నిహారిక డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mar 21, 2026, 13:54:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత కథానాయికగా టాలీవుడ్‌లో అంతగా క్లిక్ అవని నిహారిక కొణిదెల నిర్మాతగా మారి సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తోంది. ఇటీవలే కమిటీ కుర్రోళ్లు వంటి మంచి హిట్ అందుకుంది.

అదిరిపోయిన నిహారిక కొణిదెల స్నేక్ డ్యాన్స్- రాకాస నుంచి క్యాచీ ట్యూన్‌తో సాంగ్ రిలీజ్!
అదిరిపోయిన నిహారిక కొణిదెల స్నేక్ డ్యాన్స్- రాకాస నుంచి క్యాచీ ట్యూన్‌తో సాంగ్ రిలీజ్!

అవార్డులు, రివార్డులు

నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కించిన ఈ కమిటీ కుర్రోళ్లు మూవీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు వరించింది. ఇక ప్రస్తుతం నిహారిక కొణిదెల మరో క్రేజీ ప్రాజెక్టును తెలుగు ఆడియెన్స్ ముందు ప్రవేశపెట్టనుంది. ఆ సినిమానే రాకాస.

తెలుగు కామెడీ హారర్ ఫాంటసీ మూవీ

తెలుగులో కామెడీ హారర్ ఫాంటసీ చిత్రంగా రాకాస తెరకెక్కింది. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు నిహారిక కొణిదెల. ఈ రాకాస సినిమాకు ఓటీటీ సిరీస్‌లతో మంచి పేరు తెచ్చుకున్న మానస శర్మ దర్శకత్వం వహించారు.

రాకాస నటీనటులు

అలాగే మ్యాడ్, మ్యడ్ స్క్వేర్ సినిమాల్లో కామెడీ టైమింగ్‌తో అలరించిన సంగీత్ శోభన్ రాకాస మూవీలో హీరోగా చేస్తున్నాడు. అయితే, సంగీత్ శోభన్ సోలో హీరోగా చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ మూవీలో సంగీత్ శోభన్‌కు జోడీగా నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. ఈ ఇద్దరితోపాటు రాకాసలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

రాకాస మ్యూజికల్ ప్రమోషన్స్

ఇక రాకాస సినిమాను ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో రాకాస మ్యూజికల్ ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్ ప్రారంభించింది. ఇప్పటి వరకు ‘రపప్పా’, ‘పదే పదే’ పాటల్ని మేకర్లు రిలీజ్ చేశారు. అవి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ రిలీజ్

ఇక తాజాగా రాకాస మూవీ నుంచి ‘స్నేక్ డ్యాన్స్’ అనే పాటను విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే ఇదొక ప్రమోషనల్ గీతంగా కనిపిస్తోంది. గ్యాంగ్ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఈ స్నేక్ డ్యాన్స్ పాటను కంపోజ్ చేశారు.

నిహారిక కొణిదెల డ్యాన్స్

ఈ ‘స్నేక్ డ్యాన్స్’ పాటలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, సంగీత్ శోభన్, నయన్ సారిక తమ స్టైల్లో దుమ్ములేపేశారు. ఇక చివర్లో మెగా ప్రొడ్యూసర్ నిహారిక వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. నిర్మాతగా మారిన తర్వాత ఓ సాంగ్‌లో నిహారక కొణిదెల డ్యాన్స్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఆకట్టుకునేలా సాహిత్యం

స్నేక్ డ్యాన్స్ పాటకు అనుదీప్ క్యాచీ ట్యూన్‌ను ఇచ్చారు. రఘురాం సాహిత్యం ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. బెన్నీ దయాల్, మనీషా పాండ్రంకి, రితేష్ జి రావు, లక్ష్మీ మేఘన, వినాయక్ గాత్రం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

వైరల్‌గా నిహారిక కొణిదెల స్నేక్ డ్యాన్స్

కాగా, రాకాస మూవీకి రాజు ఎదురోలు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయగా అన్వల్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇక నిహారిక కొణిదెల స్నేక్ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More