నిన్ను కోరి జూలై 12 ఎపిసోడ్: విరాట్ బిజినెస్ డీల్- చంద్రకళను తప్పించడానికి శ్యామల ప్లాన్- ఇరికించడానికి శాలిని స్కెచ్

నిన్ను కోరి సీరియల్ జూలై 12 ఎపిసోడ్‌లో ఒకేసారి డోర్ తీయడంతో విరాట్, చంద్రకళ ఒకరిపై మరొకరు పడి రొమాన్స్ జరుగుతుంది. బిజినెస్ డీల్ ఉందని హాల్లోకి రావొద్దని చంద్రకళకు విరాట్ వార్నింగ్ ఇస్తాడు. బిజినెస్ మ్యాన్‌ను చూసిన చంద్రకళ జరిగిన యాక్సిడెంట్ గుర్తుకు తెచ్చుకుంటుంది. చంద్రకళ సైన్ అవసరం పడుతుంది.

Published on: Jul 12, 2025, 08:41:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్ ప్రాజెక్టు సంబంధించిన ఫైల్ మొత్తం కంప్లీట్ చేసుకుని కిందికి వెళ్లి బిజినెస్ మాన్ గురించి వెయిట్ చేయాలి అని అనుకుంటాడు. అదే సమయానికి చంద్రకళ విరాట్ దగ్గరికి వస్తుంది. ఇంతలో ఇద్దరు ఒకేసారి డోర్ తీయడంతో ఇద్దరు కిందపడిపోతారు.

నిన్ను కోరి సీరియల్ జూలై 12 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ జూలై 12 ఎపిసోడ్‌

పైనే ఉండు

ఒకరిపై మరొకరు పడి రొమాంటిక్‌గా చూసుకుంటారు విరాట్, చంద్రకళ. తర్వాత బిజినెస్ మ్యాన్ వస్తున్నాడు. నువ్ ఇక్కడే ఇదే రూమ్‌లో ఉండు, కిందకు రాకు. నేనే ప్రజంటేషన్ ఇచ్చుకుంటాను అని చంద్రకళకు విరాట్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో చంద్రకళ సరే సరే శ్రీవారు. మీరే వెళ్లి నీ ప్రజెంటేషన్ ఇచ్చుకో. నేను పైనే ఉంటాను అని చెబుతుంది.

విరాట్ కిందికి వెళ్లిపోతాడు. తరువాత విరాట్ తన అమ్మ జగదీశ్వరి దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్టు ఓకే అయ్యేలాగా నన్ను ఆశీర్వదించమని అడగుతాడు. దాంతో ఏ ఆశీర్వాదం అవసరం లేదు. కష్టపడి నువ్వు పని చేస్తే అది తప్పకుండా వచ్చేస్తుంది. నా ఆశీర్వాదంతో సంబంధం లేదు అని జగదీశ్వరి అంటుంది.

బిజినెస్ మ్యాన్ ఎంట్రీ

బలవంతంగా విరాట్ తన తల్లి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇంతలో బిజినెస్ మాన్ ఇంటికి వస్తాడు. విరాట్ ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తుంది. చంద్రకళ మాత్రం పైన బెడ్ రూమ్‌లో ఉంటుంది. కానీ, బిజినెస్ మ్యాన్‌ను చూసి బురద గొడవ గుర్తు చేసుకుంటుంది. బిజినెస్ మ్యాన్ మొత్తం చెక్ చేస్తాడు. తనకి విరాట్ చేసిన బిజినెస్ చాలా బాగా నచ్చుతుంది. దానితో ఆ బిజినెస్ మ్యాన్ వ్యాపారాని ఒప్పుకుని సంతకాలు చేస్తాడు.

చివరికి నీ భార్య కూడా సంతకం చేయలేని బిజినెస్ మ్యాన్ అడుగుతాడు. దాంతో చంద్రకళను తీసుకురమ్మని శృతిని పంపిస్తాడు విరాట్. శృతి వెళ్లి చంద్రకళతో బావ పిలుస్తున్నాడు ఏదో సంతకం చేయాలంట అని చెబుతుంది. నేను రాను అని చెప్పు అని చంద్రకళ అంటుంది. శ్రుతి కిందకు వచ్చి అదే విషయం చెబుతుంది.

నువ్ సైన్ చేస్తేనే

నేను నేను తీసుకొస్తాను అని శ్యామల పైకి వెళ్తుంది. చంద్రకళ దగ్గరికి శ్యామల వెళ్లి నీ గురించి కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. సంతకం చేయాలి. ఆ సంతకం కంప్లీట్ చేస్తేనే విరాట్‌కి ఆ బిజినెస్ డీల్ ఓకే అవుతదంట అని చెబుతుంది శ్యామల. దాంతో రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్, ఆ బిజినెస్ మ్యాన్‌ని తిట్టిన విషయం అంత శ్యామలకు చెబుతుంది చంద్రకళ.

ఇప్పుడు నేను కిందికి వస్తే ఆ బిజినెస్ క్యాన్సిల్ అయిపోతుంది. దాంతో విరాట్ కోపంతో ఊగిపోతాడు అని చంద్రకళ అంటుంది. సరే ముసుగు కప్పుకుని కిందకు రా, అది ఆచారం అని సర్దిచెబుతాను అని ప్లాన్ చెబుతుంది శ్యామల. కానీ, ఆ మాటలన్నీ శాలిని వింటుంది. ఆ బిజినెస్‌ మ్యాన్ దగ్గర చంద్రకళను ఇరికించాలని స్కెచ్ వేస్తుంది శాలిని. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More