నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్: బిజినెస్ డీల్ క్యాన్సిల్..కోపంతో చంద్ర చెంపపై కొట్టిన విరాట్.. దుష్ట త్రయం ఫుల్ హ్యాపీ

నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 14వ తేదీ ఎపిసోడ్ లో చీర కొంగును ముసుగుగా వేసుకుని చంద్రకళ సంతకం పెట్టడానికి వస్తుంది. కానీ శాలిని ప్లాన్ తో చంద్ర ముసుగు ఎగిరిపోతుంది. చంద్రను చూసిన బిజినెస్ మాన్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటాడు. కోపంతో ఊగిపోయిన విరాట్ చంద్ర చెంపపై కొడతాడు.

Published on: Jul 14, 2025, 07:44:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 14వ తేదీ ఎపిసోడ్ లో డీల్ ఫైనల్ కావాలంటే నామినీ సైన్ కూడా కావాలని విరాట్ తో చెప్తాడు బిజినెస్ మాన్. మీ ఆవిడను పిలవమంటాడు. శ్రుతి పిలిస్తే చంద్రకళ రాదు. శ్యామల పైకి వచ్చి జరిగింది తెలుసుకుంటుంది. విరాట్ తో బిజినెస్ మాన్ మీ ఆవిడ వచ్చి సంతకం పెడితే డీల్ ఓకే అయినట్టు అని చెప్పగానే తను వచ్చేస్తుంది సార్ అని విరాట్ అంటాడు.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్

ముఖంపై ముసుగు

చంద్రకళ ముఖంపై ముసుగు వేసుకుని శ్యామల కిందకు తీసుకొస్తుంది. అందరూ చంద్రకళని చూసి షాక్ అవుతారు. ఈ ముసుగేంటి అనేసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అడుగుతారు. అప్పుడు శ్యామల కవర్ చేస్తూ తను ఒక నోము నోచుకున్నది ఈరోజు తన మొహాన్ని ఎవరికీ చూపించకుండా పూజ చేస్తుంది అని చెప్తుంది. దీంతో సరే అనుకొని ఆ డీల్ మీద సంతకం పెట్టమంటారు. చంద్రకళ సైన్ చేయడం స్టార్ట్ చేస్తుంది.

ఫ్యాన్ తీసుకొచ్చి

పైన గదిలో చంద్రకళ, శ్యామల మాట్లాడుకున్నది శాలిని వింటుంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన శాలిని అదంతా చూసి ఆ ముసుగును ఎలా తీయాలని ఆలోచిస్తుంది. పక్కనే ఉన్న ఒక ఫ్యాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆన్ చేస్తుంది. దానితో చంద్రకళ ముఖంపై ఉన్న చీర కొంగు ఎగిరిపోతుంది. చంద్రకళను ఆ బిజినెస్ మాన్ చూసి నువ్వా అసలు ఈ డీలే వద్దు అని చంద్రకళని తిట్టి, నీ వల్ల డీల్ క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పి వెళ్లిపోతాడు.

విరాట్ ఫైర్

బిజినెస్ మాన్ వెళ్లిపోవడంతో అందరూ ఏం జరిగిందని అడుగుతారు. అప్పుడు పొద్దున జరిగిన విషయాన్ని, బిజినెస్ మాన్ తో గొడవను అందరికీ చెప్తుంది చంద్రకళ. ఆ విషయం తెలిసివిరాట్ ఊగిపోతాడు. డీల్ క్యాన్సిల్ అయిన కోపంతో చంద్రకళ చెంపపై కొడతాడు విరాట్. వెంటనే శ్యామల విరాట్ అంటే.. దయచేసి మా మధ్యలోకి ఎవరూ రావొద్దు అని అంటాడు విరాట్. చేయి చేసుకోవద్దు అని జగదీశ్వరి అంటే తాను చేసింది తప్పు అని విరాట్ అంటాడు.

ప్లాన్ ప్రకారమే

ప్లాన్ ప్రకారమే డీల్ క్యాన్సిల్ చేశావని చంద్రకళపై ఆరోపణలు చేస్తాడు విరాట్. అందుకేనా రాత్రి ప్రాజెక్టు విషయాలు తెలుసుకున్నావు, పొద్దున వెళ్లి గొడవ పెట్టుకున్నావని విరాట్ ఊగిపోతాడు. దీంతో శృతి, శాలిని, కామాక్షి ఆనందంగా ఉంటారు. చంద్రను ఇంకా అసహ్యించుకుని ఇంట్లో నుంచి గెంటేసేలా చూడాలని శాలిని అంటుంది.

అప్పుడే శాలినికి ఆ స్పాన్సర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నేను చెప్పిన డబ్బులు అరెంజ్ చేశారా మేడం అని తను వార్నింగ్ ఇచ్చాడు. కంపెనీని ప్రాఫిట్ ఇవ్వాలి అని శాలిని అంటుంది. కానీ సుందర్ ఒకే ఒక్క రోజు టైమ్ ఇస్తాడు. రూ.20 లక్షలు ఇవ్వకపోతే నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ భర్త ముందే నిజం చెప్పేస్తా అంటాడు. ఏం చేయాలో శాలినికి అర్థం కాదు. దీంతో నిన్ను కోరి సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More