...
...
Next Story

నిన్ను కోరి జూలై 18 ఎపిసోడ్: ఇంటికి తాగి తూలుతూ వచ్చిన క్రాంతి- శాలినిపైనే అందరి డౌట్, ముచ్చెమటలు-ఉదయాన్నే తేలనున్న నిజం

నిన్ను కోరి సీరియల్ జూలై 18 ఎపిసోడ్‌లో ఇంటికి శ్యామల వాళ్లు వచ్చి దాంపత్య వ్రతం సక్సెస్‌గా జరిగిందని చెబుతుంది. రాత్రి క్రాంతి తాగి తూలుతూ వస్తాడు. అదంతా చూసిన ఇంట్లోవాళ్లు షాక్ అవుతారు. ఎందుకు తాగొచ్చావ్ అని క్రాంతిని అడిగితే శాలిని అని చెప్పి ఆగిపోతాడు. దాంతో అంతా శాలినిని అనుమానిస్తారు.

Published on: Jul 18, 2025, 06:25:09 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శాలిని ఇంట్లో కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. క్రాంతికి నిజం తెలిసిపోయిందని తెగ భయపడిపోతుంటుంది. ఇంతలో అక్కడికి జగదీశ్వరి వచ్చి ఏమైంది షాలిని, అంతలా కంగారుగా ఉన్నావేంటీ, ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయేంటీ అని అడుగుతుంది.

శాలినికి ముచ్చెటమలు

నిన్ను కోరి సీరియల్ జూలై 18 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ జూలై 18 ఎపిసోడ్‌

దానికి ఏం లేదు, ఎండలో ఉన్నాను అందుకే మొహం మీద చెమటలు పడుతున్నాయి, కాస్తా నీరసంగా ఉంది అని శాలిని చెబుతుంది. అయితే, వెళ్లి నీళ్లు తాగమని జగదీశ్వరి చెబుతుంది. దాంతో శాలిని వెళ్లిపోతుంది. అప్పుడే అక్కడికి గుడి నుంచి శ్యామల విరాట్ చంద్రకళ కామాక్షి శ్రుతి వస్తారు.

గుళ్లో వీళ్లకు దాంపత్యవ్రతం చేయించాను అని శ్యామల చెబుతుంది. అప్పుడే చిరాకుతో విరాట్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. కామాక్షి శ్రుతి మీరెందుకు వెళ్లారు అని జగదీశ్వరి అడిగితే.. పెళ్లి గురించి కోరుకోవడానికి వెళ్లాను అని శ్రుతి చెబుతుంది. గుడిలో ఇలా మేము ప్లాన్ అనుకున్నాము. కానీ, అది జరగలేదని శాలినీతో చెబుతారు కామాక్షి, శ్రుతి.

దాంతో కోపంగా తల్లీకూతుళ్లను తిట్టిన శాలిని వెళ్లిపోతుంది. శ్యామల వచ్చి కామాక్షి, శ్రుతి మీ ఇద్దరితో పనుందని వారిని తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లిన తర్వాత తన బట్టలు ఎలా లగేజ్ బ్యాగ్‌లో సర్ది పెట్టారో అలాగే రూమ్‌లో పెట్టమని ఆర్డర్ వేస్తుంది శ్యామల. దానితో అష్ట కష్టాలతో శ్రుతి కామాక్షి ఇద్దరు శ్యామల బట్టలు కబోర్డ్‌లో సర్దుతారు.

ఎందుకు ఇంతలా తాగొచ్చాడు

అదంతా అయిపోయిన తర్వాత రాత్రి కాంతి మందు తాగి మత్తులో తూగుతూ ఇంటికి వస్తాడు. అదంతా అందర చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఏమైంది వీడికి, ఎందుకు ఇంతలా తాగొచ్చాడు అని బాధపడుతారు. క్రాంతినే అడుగుతారు. కానీ, క్రాంతి మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా శాలిని వైపు చూస్తూ ఉండిపోతాడు.

దాంతో క్రాంతిని తీసుకొని గదిలో పడుకోబెట్టడానికి తీసుకెళ్తుంది శాలిని. గదిలోకి వెళ్లిన తర్వాత జగదీశ్వరీ అసలు ఏం జరిగిందో పర్సనల్‌గా అడుగుతున్నాను అని శాలినిని అడుగుతుంది జగదీశ్వరి. కానీ, శాలిని మాత్రం నాకు నిజంగా ఏం తెలియదు అత్తయ్య అని శాలిని అంటుంది.

ఉదయాన్నే తెలుస్తుంది

ఉదయాన్నే ఎలాగో క్రాంతి లేస్తాడు కదా. అప్పుడు నేనే క్రాంతిని అడుగుతా. అప్పుడు అసలు విషయం, నిజం తెలుస్తుంది అని శ్యామల, జగదీశ్వరి అని వెళ్లిపోతారు. అలానే అందరూ వెళ్లిపోతారు. ఇక అదంతా జరగడంతో బాగా టెన్షన్‌కి గురైన శాలిని జగ్గులో వాటర్ గడగడ తాగుతుంది.

అదంతా చూసిన కామాక్షి, శ్రుతి ఇద్దరూ ఏదో జరిగింది అని అనుమానిస్తారు. వెళ్లిని శాలినిని అడుగుతారు. కానీ, ఏం లేదని శాలిని వెళ్లిపోతుంది. కచ్చితంగా ఏదో జరిగింది. ఇదే ఏదో చేసింది అని శాలినిపై శ్రుతి, కామాక్షి అనుమానిస్తారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks