నిన్ను కోరి జూన్ 19 ఎపిసోడ్: తల్లీకూతుళ్లకు జగదీశ్వరి ఫైనల్ వార్నింగ్- శాలిని కన్నింగ్ ప్లాన్- కంట్రోల్ తప్పిన విరాట్!

నిన్ను కోరి సీరియల్ జూన్ 19 ఎపిసోడ్‌లో చంద్రకళ పుట్టింటి విషయాలు శ్యామలకు చెప్పొద్దని తల్లీకూతుళ్లు కామాక్షి, శ్రుతిని జగదీశ్వరి తిట్టి ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది. క్రాంతి వేసిన డిజైన్స్ ఫొటోలు తీసుకున్న శాలిని చంద్రను తిట్టేలా కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. చంద్రకళ నడుము చూసి విరాట్ కంట్రోల్ తప్పుతాడు.

Jun 19, 2025, 09:00:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సారీ చంద్రకళ అని శ్యామల అంటుంది. చంద్రకళను విరాట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంటి పనులు చక్కగా చేస్తుంది. అది చాలు. తన పుట్టింటి వాళ్ల గురించి అవసరం లేదు. వాళ్లే వచ్చి కలుస్తారు. అంతవరకు ఎవరి పనులు వాళ్లు చూసుకుంటే మంచిది. అనవసరంగా చంద్రకళను బాధపెట్టే పని చేస్తే నేను ఊరుకోను అని శ్యామల వెళ్లిపోతుంది.

నిన్ను కోరి సీరియల్ జూన్ 19 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ జూన్ 19 ఎపిసోడ్‌

పనిగట్టుకుని

హమ్మయ్య అని బతికిపోయినట్లు చంద్రకళ ఊపిరి తీసుకుంటుంది. కామాక్షి నీతో మాట్లాడాలి నీ కూతురుని తీసుకుని రా అని జగదీశ్వరి వెళ్లిపోతుంది. హమ్మా బతికించావ్ దేవుడా. ఎక్కడ నిజం తెలిసిపోతుందా అని భయపడ్డాను అని చంద్రకళ అనుకుంటుంది. శ్యామలకు పనిగట్టుకుని ఎందుకు చంద్రకళ గురించి చెప్పాలని చూస్తున్నావ్ అని తిడుతుంది జగదీశ్వరి.

నీకు చివరిసారిగా చెబుతున్నా చంద్రకళ పుట్టింటి గురించి శ్యామలకు తెలియకూడదు. ఇదే నీకు చివరి అవకాశం. శ్రుతి నీ కూడా ఇదే చెబుతున్నా అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది జగదీశ్వరి. శ్యామలకు తెలిస్తే గొడవ అయి చంద్రకళ వెళ్లిపోతుంది కదా. అత్తయ్య ఎందుకు భయపడుతుంది అని శ్రుతి అంటుంది. చంద్ర స్థానంలో నిన్ను ఉంచడమే నా లక్ష్యం. అంతవరకు ఎవరు ఏమన్నా పట్టించుకోను అని కామాక్షి అంటుంది.

మనం డైరెక్ట్‌గా చెప్పకూడదు. మన ఇన్వాల్‌మెంట్ లేనట్లుగా శ్యామలకు చంద్ర పుట్టింటి వాళ్ల గురించి తెలిసినట్లుగా ఉండాలి అని శాలిని అంటుంది. తర్వాత డిజైన్స్ వేస్తున్న క్రాంతి తనను తానే పొగుడుకుంటాడు. చంద్ర వదిన వల్లే ఇదంతా. హ్యాట్సాఫ్ టు చంద్ర వదిన అని క్రాంతి అంటాడు. అది చూసిన శాలిని ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే చంద్ర జపం చేస్తాడని అనుకున్న శాలిని ఆ డిజైన్స్ ఫొటో తీస్తుంది.

ద్వితీయ లగ్నం

శాలిని ఫొటోలు తీయడం చంద్ర చూస్తుంది. కానీ, శాలిని మురిసిపోతుందని చంద్ర అనుకుని వెళ్లిపోతుంది. చంద్ర నిన్ను పొగిడినవాళ్లే తిట్టేలా చేస్తాను అని శాలిని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. మరోవైపు విరాట్ సంతోషంగా చంద్రకోసం ఎదురుచూస్తుంటే చంద్ర వస్తుంది. ద్వితీయ లగ్నం భగ్నం కాకూడదని ఈరోజు కూడా పిన్ని గారు ఈ ఏర్పాట్లు చేశారని చంద్ర అంటుంది.

బాగుంది. నువ్వు కూడా బాగున్నావని విరాట్ అంటాడు. పిచ్చెక్కిస్తున్నావ్. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని రొమాంటిక్‌గా చంద్రను పొగుడుతాడు విరాట్. తర్వాత చంద్రను ప్రేమగా హత్తుకుంటాడు విరాట్. తర్వాత ఇద్దరు బెడ్‌పై వాలిపోతారు. ఇంతలో నో అంటూ శ్రుతి అరుస్తూ నిద్రలోనుంచి లేస్తుంది. అయిపోయిందమ్మా. రెండో కార్యం కూడా జరిగిపోయిందని శ్రుతి అంటుంది.

కంట్రోల్ తప్పిన విరాట్

అదంతా నీ కలే అని కామాక్షి అంటుంది. అది నిజమైతే ఎలా. వాళ్ల మధ్య నిజంగా ఏం జరిగిందో తెలియకుంటే మనశ్శాంతిగా ఉండలేను అని శ్రుతి అంటుంది. డోర్ తీస్తే శ్యామల వస్తుంది. నోరు మూసుకుని పడుకో అని శ్రుతిని అంటుంది కామాక్షి. మరోవైపు చంద్రకళ విరాట్ దగ్గరికి వెళ్తుంది. పాలు తాగిన విరాట్ ఎంగిలిని తుడిచి ఇస్తాడు. గదిలోకి వచ్చేముందే పాల గ్లాస్ ఎంగిలి చేసి ఇచ్చాను అని చంద్రకళ అంటుంది.

సోఫాపై చంద్రకళ పడుకుంటుంది. చంద్రకళ రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. సోఫాపై పడుకున్న చంద్రను చూసి కంట్రోల్ చేసుకోలేకపోతాడు విరాట్. చంద్ర దగ్గరికి వెళ్తాడు. ఇంతలో లేచిన చంద్ర ఏంటీ దొంగచూపులు చూస్తున్నావ్ అని అడుగుతుంది.

నడుము చూస్తు

వాటర్ కోసం అని బాటిల్ తీసుకుంటాడు విరాట్. తర్వాత చంద్ర నడుము చూస్తు కంట్రోల్ తప్పిన విరాట్ పొరపాటుగా సోఫాపై నీళ్లు పోస్తాడు. అక్కడితో నేటి నిన్ను కోరిసీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More