నిన్ను కోరి జూన్ 23 ఎపిసోడ్: శాలిని చెంపలు వాయించిన చంద్రకళ- విరాట్‌కు తిరిగి దక్కిన తల్లి ప్రేమ- శ్యామలకు తెలిసిన నిజం!
నిన్ను కోరి సీరియల్ జూన్ 23 ఎపిసోడ్‌లో క్రాంతిని స్పాన్సర్స్ తిట్టి వెళ్లిపోతారు. అంతా చంద్రను అంటారు. శాలిని చెంపలు వాయించిన చంద్ర ఇదంతా నువ్వే చేశావని తెలుసు. ఇంకోసారి చేస్తే అందరిముందు నిజం బయటపెడతానని వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. విరాట్‌కు దెబ్బ తగిలితే జగదీశ్వరి కట్టు కడుతుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో క్రాంతి సబ్‌మిట్ చేసిన డిజైన్స్ కాపీ కొట్టినవని స్పాన్సర్స్ తిడతారు. క్రాంతి కాకపోయింటే చంద్రకళ కాపీ కొట్టి ఉండొచ్చు. ముందే తెలిసింది కాబట్టి లేకుంటే మిమ్మల్ని చీటింగ్ చేసేవారనుకునేవాళ్లు అని స్పాన్సర్ అంటాడు. ఒకే డిజైన్‌ను ఇద్దరు వేసిండొచ్చుగా అని విరాట్అంటాడు.

ప్లాన్‌డ్‌గా చేసిన ఇన్సల్ట్
అదంతా మాకు తెలియదు. మా రెండు రోజుల్లో తిరిగి ఇచ్చి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోండి. లేకుంటే లీగల్‌గా వెళ్తామని స్పాన్సర్స్ వెళ్లిపోతారు. దాంతో శాలిని వచ్చి కావాలనే కాపీ డిజైన్స్ చేయించాని చంద్రకళను తిడుతుంది శాలిని. ఇది ప్లాన్‌డ్‌గా చేసిన ఇన్సల్ట్ క్రాంతి అని శాలిని అంటుంది. దాంతో శాలిని ఫొటోలు తీయడం గుర్తు చేసుకుంటుంది చంద్ర.
కానీ, ఇది చెబితే జీవితంలో శాలిని మొహం క్రాంతి చూడడు అని చెప్పకుండా ఉంటుంది. కామాక్షి, శ్రుతి కూడా వచ్చి చంద్రను అంటారు. ఆయన చెప్పినట్లే క్రాంతి ఐడియా ఇంకొకరికి వచ్చినట్లుందని చంద్ర అంటుంది. శాలిని కోపంగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత శాలిని దగ్గరికి వెళ్లిన చంద్రకళ లాగిపెట్టి కొడుతుంది. శాలిని కొట్టబోతుంటే ఆపి మళ్లీ తిరిగి చెంపలు వాయిస్తుంది చంద్ర.
సొంత భర్తను ఫ్రాడ్‌లా చూపించాలనుకున్నావ్ సిగ్గులేదా. ఫొటోలు తీసి వేరేవాళ్లకు పంపించింది నువ్వే కదా. ఫొటోలు తీయడం నేను చూశాను. భర్త మీద ఇంత ఇగోనా అని శాలినిని నిలదీస్తుంది చంద్రకళ. నా భర్త మీద కాదు నీ మీద. నువ్ క్రాంతికి సపోర్ట్ చేయడం, నీ గురించి క్రాంతి గొప్పగా చెప్పడం నాకు నచ్చలేదు. మధ్యలో నువ్వు ఎవ్వతివే అని శాలిని అంటుంది.
నాతో చూసుకో
దాంతో శాలినికి సరైన కౌంటర్ ఇస్తుంది చంద్ర. ఫ్యామిలీకి సమస్య వచ్చేలా చేస్తే ఊరుకోను. ఏదైనా ఉంటే నాతో చూసుకో. క్రాంతిని కాదు. ఇలా చేస్తే నీ నిర్వాకం బయటపెడతాను. ఇదే క్రాంతికి చెబితే నిన్ను బయటకు పంపిస్తారు. మారితే నీకే మంచిది. లేకుంటే ఈ చంద్రకళ ఏంటో చూపిస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది చంద్ర.
క్రాంతి ఫీల్ అవుతుంటే జగదీశ్వరి వచ్చి ఓదార్చి సపోర్ట్ చేస్తుంది. నా వల్ల చంద్ర వదినను చీటర్ అన్నారు. తనెంత బాధపడుతుందో అని క్రాంతి అంటాడు. నేనేం బాధపడట్లేదు. నేనేం తప్పు చేయలేదుగా అని చంద్ర అంటుంది. శాలిని దగ్గరికి కామాక్షి, శ్రుతి వెళ్లి క్రాంతికి అలా చేసినవాళ్లకు పక్షవాతం రావాలని, నడుము విరిగి మూలపడాలి అని శాపనార్థాలు పెడుతుంది.
శాలినికి శాపనార్థాలు పెడతారు కామాక్షి, శ్రుతి. దాంతో శాలిని భయపడుతుంది. క్రాంతి డిజైన్స్ లీక్ చేసింది శాలినినే. మొగుడునే ముంచేసిందే. మనల్ని కూడా కాటేస్తుందే. మనం జాగ్రత్తగా ఉండాలే అని కామాక్షి, శ్రుతి భయపడిపోతారు. విరాట్, చంద్రకళకు ముచ్చటగా మూడోరాత్రి అని శ్యామల చెబుతుంది. విరాట్ నడుస్తుంటే కాలు తగిలి కిందపడతాడు.
చలించిపోయిన తల్లి
అదే సమయంలో విరాట్ చేతికి కత్తి తగిలి రక్తం వస్తుంది. అది చూసిన జగదీశ్వరి చలించిపోయి కొడుకును దగ్గరికి తీస్తుంది. చూసుకోవాలిగా అంటూ ఏడుస్తుంది. చంద్రను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మని విరాట్‌కు కట్టు కడుతుంది జగదీశ్వరి. అడుగు ముందు చూపుతో వేయాలి అని కొడుకు సలహా ఇచ్చి వెళ్లిపోతుంది జగదీశ్వరి. చంద్రతో పెళ్లి తర్వాత తల్లి మాట్లాడటంతో విరాట్‌కు తిరిగి తల్లి పేమ దక్కుతుంది. దాంతో విరాట్ సంతోషంగా వెళ్లిపోతాడు.
కట్టు చూసుకుంటూ సంబరపడతాడు. తర్వాత తల్లితో చంద్రకళ ఉన్న ఫొటోను శ్యామల చూసేలా శాలిని పడేస్తుంది. చంద్రకళ ముందే ఆ ఫొటోను చూస్తుంది శ్యామల. చంద్రకళ తల్లి ఎవరనే నిజం శ్యామలకు తెలుస్తుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



