నిన్ను కోరి జూన్ 26 ఎపిసోడ్: శ్యామలను బోల్తా కొట్టించిన చంద్రకళ- కలబంద కాకరకాయ పచ్చడి- ఇంటికొచ్చి తిట్టిన కస్టమర్!
నిన్ను కోరి సీరియల్ జూన్ 26 ఎపిసోడ్‌లో విరాట్ చంద్రకళకు మధ్య సక్యత లేదని, గొడవ పడుతున్నారని, ఇదంతా జగదీశ్వరికి తెలిసే జరుగుతుందని శ్యామల రచ్చ చేస్తుంది. కానీ, రఘురాం అలా ఉండటం వల్లే అని శ్యామలకు చంద్రకళ చెబుతుంది. భలే బోల్తా కొట్టించింది అని కామాక్షి అంటుంది. కామాక్షి పచ్చడిని కస్టమర్ వచ్చి తిడతారు.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బెడ్ రూమ్‌లోకి చంద్రకళ వస్తే నువ్ పడుకోవాల్సింది సోఫాపై అని అంటాడు విరాట్. సోఫాపై ఒకవైపుకే పడుకోలేకపోతున్నాను అని చంద్రకళ అంటుంది. కానీ, విరాట్ వినడు. దాంతో సోఫాపై నీళ్లు పోసి బెడ్ మీద పడుకుందామనుకుంటుంది చంద్ర. బాటిల్ పట్టుకుని సోఫాపై చంద్ర నీళ్లు పోస్తుంటే విరాట్ వచ్చి గ్లాస్ పట్టుకుంటాడు.

మెడపట్టి బయటకు గెంటేవాన్ని
నాకు తెలిసే ఇలాంటివి వింత ప్రయోగాలు చేస్తావని అని విరాట్ అంటాడు. ఇద్దరు అలాగే గొడవ పడతారు. ఆ మాటలన్నీ విన్న శ్యామల ఓహో వీళ్ల మధ్య ఏం జరగలేదన్నమాట. చెబుతా అని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం శ్యామల అత్తయ్య లేకపోతే నిన్ను మెడపట్టి బయటకు గెంటేసేవాన్ని అని విరాట్ అన్న మాటలు తలుచుకుంటుంది శ్యామల.
ఇంతలో చంద్ర వచ్చి త్వరగా లేచారు అని అడుగుతుంది. నిద్ర పట్టలేదని శ్యామల అంటే హోమ్ సిక్ అయినట్లున్నారు. మీ ఇంటికి వెళ్తే సెట్ అవుతుందని విరాట్ అంటాడు. ఎందుకు మీ ఇద్దరికి ఇలా నటించే అవకాశం ఉండదనా అని శ్యామల అంటుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. ఎందుకు అన్యూన్నంగా ఉన్నట్లు నటించారు. అంతా మొదటి నుంచి నన్ను మోసం చేశారన్నమాట. వదినకు కూడా తెలుసు కదా అని శ్యామల అంటుంది.
వదినకు తెలిసే జరుగుతుంది
అంతా చంద్రకళ మీద కోపంగా ఉన్నారు. అంటే ఏదో జరిగింది. అది దాస్తున్నారు అన్న శ్యామల అందిరిని పిలుస్తుంది. జగదీశ్వరికి విరాట్, చంద్రకళ నటించింది చెబుతుంది శ్యామల. ఇదంతా మా వదినకు తెలిసే జరుగుతుందని నాకు బాగా అర్థం అవుతుంది అని శ్యామల ఇంట్లో జరిగిన విషయాలన్నిటిపై డౌట్ పడుతుంది. ఎందుకు నా ముందు దాచారు అని శ్యామల నిలదీస్తుంది.
నేను చెబుతాను అని చంద్రకళ చెబుతుంది. మావయ్య అలా బెడ్ మీద ఉంటే మా ఆయన ఎలా సంతోషంగా ఉండగలడు. కాపురం ఎలా చేయగలడు.అందరూ బాధలో ఉంటే ఎలా సంతోషంగా ఉంటాం. మావయ్య బాగా అయ్యేవరకు మేము కలవకూడదు అనుకున్నామని చంద్రకళ చెబుతుంది. ఇంత రచ్చ చేశాను. సారీ వదినా కంగారుపడకు అని శ్యామల అంటుంది.
ఇది మళ్లీ బోల్తా పడిందే. ఇక చంద్రను గెలవడం కష్టమే అని కామాక్షి అంటుంది. సారీ చంద్రకళ అనవసరంగా సీన్ చేశాను. అదంతా ఆ కామాక్షి వల్లే. నీ మాటలు వినే ఇలా చేశాను అని శ్యామల అంటుంది. దాంతో కామాక్షి పారిపోతుంది. పెద్ద తుఫాను వెనక్కి వెళ్లినట్లుంది అని విరాట్ అంటే ఆ తుఫాన్ ఎవరి వల్ల ఆగిందని చంద్రకళ అంటుంది. నువ్వే చేశావ్. ఇలాంటివి నువ్వు బాగా చేస్తావ్ అని విరాట్ అంటాడు.
నీ మాటలకు పడను
మావయ్య కోలుకోవడం నాకే ముఖ్యం. నేను తప్పు చేయలేదని చెప్పేది ఆయన ఒక్కరే అని చంద్రకళ ఏడుస్తూ అంటుంది. ఇలాంటి మాటలకు నేను పడను అని విరాట్ అంటాడు. తర్వాత సోఫా ఎక్కి బూజు దులుపుతుంది చంద్రకళ. దులుపుతు చంద్రకళ పడిపోతుంటే విరాట్ పట్టుకుని ఎత్తుకుంటాడు. రొమాంటిక్‌గా సీన్ ఉంటుంది. ఏదో ఒక రూపంలో నీ ప్రేమ బయటపడుతుందని చంద్రకళ అంటుంది.
మరోవైపు ఆర్డర్స్ అంతా బాగా వెళ్లాయి. కానీ రెస్పాన్స్ ఇంకా రావట్లేదని తల్లీకూతుళ్లు కామాక్షి, శ్రుతి అనుకుంటారు. ఇంతలో ఒక కస్టమర్ నేరుగా ఇంటికి వస్తారు. ఎవరు చేయని కాంబినేషన్‌తో కలబంద కాకరకాయ పికిల్ చేశారుగా. అది తిని మా ఆయన హాస్పిటల్‌లో పడ్డారు అని కస్టమర్ తిడుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



