నిన్ను కోరి జూన్ 2 ఎపిసోడ్: ఇంట్లోకి భీమవరం శ్యామల ఎంట్రీ- మందులు మార్చడంపై ఎంక్వైరీ- శాలినికి కామాక్షి శాపనార్థాలు!
నిన్ను కోరి సీరియల్ జూన్ 2 ఎపిసోడ్‌లో రఘురాం మందులు మార్చడంపై అంతా చంద్రకళను నిందిస్తారు. అసలు దోషి ఎవరో కనిపెట్టేందుకు తాను ఎంక్వైరీ చేస్తానని క్రాంతి అంటాడు. జగదీశ్వరి ఇంట్లోకి భీమవరం శ్యామల ఎంట్రీ ఇస్తుంది. దాంతో కామాక్షి తెగ భయపడిపోతుంది. కూతురుకు శ్యామల గురించి కామాక్షి చెబుతుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళను కొడుతుంది జగదీశ్వరి. మీరు కట్టిన తాళి నా మాంగళ్యాన్ని బలి కోరుతుంది అని జగదీశ్వరి విరాట్‌ను అంటుంది. దీంతో నన్ను చంపుతున్నావ్ కదే అని వెళ్లిపోతాడు విరాట్. అమ్మ ఎక్కడో ఏదో తప్పు జరుగింది అని క్రాంతి అంటాడు. మీ వదినను వెనుకేసుకురావాలంటే రా కానీ నన్ను మర్చిపో అని జగదీశ్వరి అంటుంది.

చంద్రకళే మార్చి ఉంటుంది
అది కాదమ్మా అని క్రాంతి అంటే.. నన్ను నా భర్తను వదిలేయండి. కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాను అని జగదీశ్వరి అంటుంది. దాంతో చంద్రకళ ఏడుస్తూ వెళ్లిపోతుంది. అంతా వెళ్లిపోతారు. పక్కకు వెళ్లిన కామాక్షి, శ్రుతి చంద్రకళ కావాలనే మందులు మార్చి ఉంటుంది అని తిడతారు. అందుకే ఇంట్లోకి వచ్చి. ఇంక అత్తయ్య ఆలోచిస్తుంది. మెడ పట్టి గెంటేయకుండా అని శ్రుతి అంటుంది.
అన్నయ్య జీవచ్ఛవంలా ఉన్నారు. అలాంటి వారిని చంపాలని ఎవరైనా చూస్తారా. అలాంటి మనుషులు సుఖంగా బతుకుతారా. నాశనం అయిపోతారు. వాళ్లు కూడా చేతులు కాళ్లు పడిపోయి ఒక మూలన పడిపోతారు అని ఇన్‌డైరెక్ట్‌గా శాలినినే శపిస్తుంది కామాక్షి. అదంతా విన్న శాలిని సర్లే పిన్ని వదిలేయండి. శాపనార్థాలు పెట్టడం ఎందుకు. చంద్రను ఎలా బయటకు పంపాలో అది ఆలోచించండి అని శాలిని అంటుంది.
ఇంతలో క్రాంతి వచ్చి శ్రుతి ఇది నువ్వు చేసిన పనేగా. అది నువ్వే అని నాకు తెలుసు. అలాంటి పని చేసే అవసరం నీకు, నీ కూతురుకు తప్ప ఎవరికి లేదని క్రాంతి నిలదీస్తాడు. శ్రుతిని అన్నయ్యకు ఇచ్చి చేయాలని, చంద్రను దూరం చేయాలని ఇలా చేసినట్లు నాకు డౌట్‌గా ఉందని క్రాంతి అంటాడు. దాంతో కామాక్షి ఏడుస్తుంది. నేను పెళ్లి చేయాలనుకుందే మా అన్నయ్యకు దూరంగా ఉండకూడదని, అలాంటిది నేనేందుకు చేస్తాను అని కామాక్షి అంటుంది.
అసలు దోషి ఎవరో
ఇన్నాళ్లు మనతో ఉన్నారు వీళ్లేందుకు చేస్తారు అని శాలిని అంటుంది. ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది. చంద్ర వదినకు మాత్రం లేదు. నేను ఎంక్వైరీ చేసి ఇది ఎవరు చేశారో కచ్చితంగా కనిపెడతాను. వాళ్ల పాపం బయటపెట్టి శిక్ష పడేలా చేస్తాను అని క్రాంతి అంటాడు. అలా చేయి, నిజం బయటపడుతుందని, అసలు దోషి ఎవరో తెలుస్తుంది అని శ్రుతి అంటుంది.
ఇప్పుడు ఎంక్వైరీ ఎందుకని శాలిని అంటే.. నేను వదిలిపెట్టను. ఈ పని చేసింది ఎవరో కనిపెట్టి తీరుతాను అని వెళ్లిపోతాడు క్రాంతి. దాంతో శాలిని భయపడిపోతుంది. మరోవైపు ఏడుస్తున్న చంద్రకళను ఓదార్చుతాడు క్రాంతి. నా మీద ఇంతపెద్ద నింద వేస్తే ఎలా తట్టుకోవాలి. నేను పిశాచిలా కనిపిస్తున్నానా వాళ్లకు అని ఏడుస్తుంది చంద్రకళ.
అత్తయ్య శత్రువులా చూస్తుంది. నేను ఎంత ప్రయత్నించినా చివరికి నేనే చెడ్డదాన్ని అవుతున్నాను. నా తప్పు లేదని నిరూపించడానికి నాకు ఇంకో దారి కనిపించట్లేదు. అందుకు దేవుడే దిగిరావాలి అని చంద్ర అంటే అప్పుడే ఆటోలో కొత్త క్యారెక్టర్ భీమవరం శ్యామల ఎంట్రీ అవుతుంది. ఆటో 999 అయిందని డ్రైవర్ చెబితే అమ్మో అని ఆశ్చర్యపోయినా శ్యామల వెయ్యి ఇచ్చి తగ్గిన ఒక్క రూపాయి ఇవ్వమంటుంది.
తోడేలులా
చిల్లర లేదని ఆటో డ్రైవర్ అంటాడు. తర్వాత కాసేపటికి చిల్లర ఇచ్చి పంపించిస్తుంది శ్యామల. ఇంట్లో వాళ్లు ఎలా వేగుతారో అని ఆటో డ్రైవర్ వెళ్లిపోతాడు. భీమవరం శ్యామల ఇంట్లోకి అడుగుపెట్టగానే భూకంపం వచ్చినట్లు అవుతుంది. దాంతో శ్రుతికి భీమవరం శ్యామల గురించి చెబుతుంది కామాక్షి. తోడబుట్టిందయినా తోడేలులా పీక్కుతింటది అని కామాక్షి అంటుంది.
వచ్చి కామాక్షిని పలకరిస్తుంది శ్యామల. నేను వచ్చినందుకు మీ అమ్మ నోరు పడిపోయినట్లుందని శ్రుతి అంటుంది శ్యామల. మా చిన్న తాతయ్య గారి కూతురు, మాకు అత్త అవుతుందని శాలినికి క్రాంతి చెబుతాడు. విరాట్, క్రాంతి వచ్చి పలకరిస్తారు. శాలినిని క్రాంతి పరిచయం చేస్తాడు. ఇంతలో జగదీశ్వరి వచ్చి హగ్ చేసుకుంటుంది. చంద్రకళకు శ్యామల గురించి క్రాంతి చెబుతాడు.
అన్నయ్య ఎక్కడ అని శ్యామల అడిగితే రఘురాం దగ్గరికి తీసుకెళ్తారు. దాంతో రఘురాంను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్యామల. నాకు ఒక్కరైనా ఒక్క మాట అయినా చెప్పాలిగా అని శ్యామల అంటుంది. చంద్రను చూసి ఎవరు అని శ్యామల అడిగితే.. విరాట్ అన్నయ్య భార్య అని క్రాంతి చెబుతాడు. ఈ పెళ్లికి కూడా పిలవలేదా అని శ్యామల అంటుంది.
జగదీశ్వరి ఆర్డర్
వాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మేము ఎక్కడ ఒప్పుకోమో అని భయపడి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు అని జగదీశ్వరి అబద్ధం చెబుతుంది. చంద్రను వచ్చి తన భర్త పక్కన నిలబడమంటుంది. తర్వాత నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు, మా ఆయనకు శ్యామల అంటే చాలా గౌరవం. మేము ఇలా ఉన్నామంటే శ్యామల వల్లే. నాకంటే ఎక్కువ మర్యాద శ్యామలకు ఇవ్వాలి అని ఆర్డర్ పాస్ చేస్తుంది జగదీశ్వరి.
అనంతరం రెండు జంటలను ఒకరినొకరు తినిపించుకోమ్మని శ్యామల చెబుతుంది. దాంతో విరాట్-చంద్ర, క్రాంతి-శ్యామల అలాగే చేస్తారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



