నిన్ను కోరి జూన్ 9 ఎపిసోడ్: శ్యామలను ఏడిపించిన కామాక్షి- శాలిని కన్నింగ్ ప్లాన్ ఫెయిల్- శ్రుతికి తల్లిలాంటి గతి!
నిన్ను కోరి సీరియల్ జూన్ 9 ఎపిసోడ్‌లో తాళి గొప్పతనం గురించి శ్యామల చెబుతుంది. ఆ తాళికి శ్యామల నోచుకోలేదని కామాక్షి అంటుంది. దాంతో శ్యామల కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది. నల్ల పూసలను శాలిని మాయం చేస్తుంది. కానీ, వాటిని తిరిగి తీసుకొచ్చిన చంద్రకళ ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేస్తుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళకు తల్లిగా భీమవరం శ్యామల పుస్తెల తాడు తెప్పిస్తుంది. దాంతో చంద్రకళ చాలా ఎమోషనల్ అవుతుంది. వెళ్లి శ్యామలను హగ్ చేసుకుంటుంది. అది చూసి జగదీశ్వరి కూడా ఎమోషనల్ అవుతుంది. ఏమైందమ్మా. ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావ్. నీకు ఎవరు లేరనుకోకు. నేనున్నాను అని శ్యామల అంటుంది.

పుట్టింటి లేని లోటు
నా పుట్టింటివాళ్లు లేని లోటు తీర్చారు. మీరు నాకు మా అమ్మలాగే కనిపిస్తున్నారు పిన్నిగారు. మీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు అని చంద్రకళ అంటుంది. అసలు తల్లి ప్రేమను పంచే అదృష్టమే నాకు లేదనుకున్నా. నీ వల్ల నాకు అనుభూతి దొరికినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని శ్యామల అంటుంది.
వదినా నీ కొడుకు గొప్ప అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. చంద్రను చూస్తుంటే నిన్ను చూస్తున్నట్లే ఉంది. పుట్టింటికి దూరమైన బాధ నీకు తెలుసు. అది చంద్రకళ పడకూడదు. తనకు అత్తతోపాటు తల్లివి కూడా నువ్వే కావాలి అని శ్యామల అంటుంది. అత్తయ్య నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు అని చంద్రకళ అంటుంది. దృష్టత్రయంపై కోప్పడుతుంది శ్యామల.
నీ కూతురుకు అదే గతి
నీకు బంధాలను కలుపుకుపోవడం తెలియదు కాబట్టే ఇలా ఇంకా పుట్టింట్లో ఉన్నావ్. రేపు నీ కూతురుకు కూడా నీ గతే పడుతుందని కామాక్షిని అంటుంది శ్యామల. శాలిని అనుభవం గురించి అన్నావ్. చూశావుగా. మీ ముగ్గురికి చంద్రకళ కోడలు అవ్వడం నచ్చలేదని అర్థమైంది. అది ఎందుకో పూజ తర్వాత కనిపెడతా అని శ్యామల అంటుంది. విరాట్ గురించి అడిగితే మీటింగ్ ఉందని వెళ్లిపోయారని చంద్రకళ చెబుతుంది.
అలా ఎలా వెళ్లనిచ్చావ్. నాకు చెప్పింటే నేను ఆపేదాన్నిగా అని కోప్పడుతుంది శ్యామల. ఫోన్ చేస్తే విరాట్ స్విచ్ఛాఫ్ వస్తుంది. కట్ చేస్తే విరాట్ ఆఫీస్‌కు శ్యామల వెళ్తుంది. దాంతో విరాట్ షాక్ అవుతాడు. ముహుర్తానికి ఇంకో అరగంట ఉంది. పదా వెళ్దాం అని శ్యామల అంటుంది. టైమ్ ఉంది కాబట్టే నేను వచ్చాను. లేకుంటే వీడి భార్యను తీసుకొచ్చి తాళి కట్టిచ్చేదాన్ని అని విరాట్‌ను బలవంతంగా ఈడ్చుకెళ్తుంది శ్యామల.
విరాట్‌ను తీసుకొచ్చిన శ్యామల
ఈ కార్యక్రమం జరగలేదని శ్యామలను దెప్పిపొడుస్తే ఊరుకోను అని కామాక్షి, శ్రుతి, శాలినికి వార్నింగ్ ఇస్తుంది జగదీశ్వరి. ఇంతలో విరాట్‌ను శ్యామల తీసుకొస్తుంది. తర్వాత విరాట్‌ను డ్రెస్ మార్చుకోమని పైకి పంపిస్తారు. కార్యక్రమం జరగాలంటే నల్లపూసలు కూడా ఉండాలిగా. అవి మాయం చేశానని తన కన్నింగ్ ప్లాన్ గురించి చెబుతుంది శాలిని. విరాట్ పట్టు పంచే కట్టుకుని వస్తాడు.
ముత్యం, పగడం, నల్లపూసలు ఏవని పంతులు అడిగితే దేవుడి దగ్గర ఉన్నాయని శ్యామల తీసుకొస్తుంది. అవి చూసి దుష్టత్రయం షాక్ అవుతారు. నల్లపూసలు మాయం చేశానన్నావ్ అని కామాక్షి అంటే.. నేను మాయం చేశాక ఆ చంద్రకళ ఏదో మాయ చేసినట్లుందని శాలిని అంటుంది. అవును అన్నట్లుగా చంద్రకళ తల ఊపుతుంది. అలా శాలిని కన్నింగ్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
ఏడ్చిన శ్యామల
శ్యామల, జగదీశ్వరి నల్లపూసలు, పగడాలు, సూత్రాలు, తాళికి కుచ్చుతారు. శ్యామల, జగదీశ్వరి ఇద్దరు కలిసి తాళి రెడీ చేస్తారు. తాళి గురించి బాగా చెప్పారు అని చంద్రకళ అంటుంది. ఏం చెప్పి ఏం లాభం తనే తాళికి నోచుకోలేదని కామాక్షి అంటుంది. దాంతో శ్యామల కన్నీళ్లు పెట్టుకుని పక్కకు జరుగుతుంది. కామాక్షి అని జగదీశ్వరి వారిస్తుంది.
అన్ని తెలిసి ఆ మాట ఎలా అన్నావ్. ఇంత వయసు వచ్చి ఏం మాట్లాడాలో కూడా తెలియనప్పుడు ఏం లాభం. శ్యామల ప్రేమకోసం ఒంటరిగా ఉండిపోయింది. అది లోటు కాదు, లోపం కాదు అని జగదీశ్వరితిడుతుంది. తనకు నాకు కొత్త ఇది. కానీ, ఒక్క క్షణం జివుక్కుమంది. మొండిదాన్ని అయినా నేను ఆడదాన్నే కదా అని కన్నీళ్లుపెట్టుకుంది శ్యామల.
ఓదార్చిన చంద్రకళ
అలా శ్యామలను ఏడిపిస్తుంది కామాక్షి. మిమ్మల్ని వదులుకున్నవాళ్లు చాలా దురదృష్టవంతులు అని చంద్రకళ అంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper













