నిన్ను కోరి మే 31 ఎపిసోడ్: బెడిసికొట్టిన శ్రుతి ప్లాన్- రఘురాంను కాపాడిన గురూజీ- కొడుకుపై నింద- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ

నిన్ను కోరి సీరియల్ మే 31 ఎపిసోడ్‌లో చంద్రకళను ఇరికించడానికి శ్రుతి ప్లాన్ చేస్తుంది. కానీ, అది కనిపెట్టిన చంద్రకళ దెబ్బకు దెబ్బ తీస్తుంది. రఘురాంకు ఇచ్చే మెడిసిన్‌ను శాలిని మార్చేయడంతో నురగలు గక్కుతాడు. గురూజీ వచ్చి కాపాడుతాడు. కొడుకు విరాట్‌ను తల్లి జగదీశ్వరి నిందిస్తుంది.

Published on: May 31, 2025, 12:03:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో చంద్రకళ పూజ చేస్తుంది. రఘురాంని హాల్లోకి క్రాంతి తీసుకొస్తాడు. రఘురాంకు హారతి ఇచ్చి బొట్టు పెడుతుంది చంద్రకళ. మామయ్య గారెకి మందులు వేసే టైమ్ అయిందిగా వేశావా అని క్రాంతిని అడుగుతుంది చంద్రకళ. ఇంతలో క్రాంతికి కాల్ వస్తే వెళ్లమని చెప్పి తాను మందులు వేస్తానని అంటుంది చంద్రకళ.

నిన్ను కోరి సీరియల్ మే 31 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ మే 31 ఎపిసోడ్‌

నయం కావాలని

ఆ మాటలు శాలిని వింటుంది. మీకు ఎలాగైనా నయం కావాలని ఆయుర్వేద మందులు తీసుకొచ్చాను. దీనివల్ల త్వరగా కోలుకోవాలి, కోలుకుంటారని నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టండి అని ఆ మందులు ఇస్తుంది చంద్రకళ. అదంతా చూసిన శాలిని ఆ మందులను మార్చేసింది గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు నువ్ మావయ్యకు ఇచ్చిన మందులు ఆ గురూజీ ఇచ్చినవి కాదు. నేను పెట్టిన డూప్లికేట్ మందులు అని శాలిని అనుకుంటుంది.

అవి మావయ్య ఆరోగంగా చేయడం కాదు ఇంకా పాడు చేస్తాయి. గురూజీని నువ్వే తీసుకొచ్చావ్ కాబట్టి నీ మీద నింద పడేలా చేద్దామనుకున్నా. కానీ, లక్కీగా నువ్వే మందులు ఇచ్చావ్. అది ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. ఏదో మూల నీ మీద సింపతి చూపిస్తున్న అత్తయ్య విరాట్ అసహ్యించుకుంటారు. ఇటు అత్తింటికి అటు పుట్టింటికి కాకుండా రోడ్డు పాలు అవుతావ్ చంద్ర అని శాలిని అనుకుంటుంది.

క్రాంతి వచ్చి రఘురాంను గదిలోకి తీసుకెళ్తాడు. మరోవైపు ఏ డ్రెస్ ఐరన్ చేసి లేదని విసుక్కుంటాడు విరాట్. ఆ షర్ట్‌ను తాను ఐరన్ చేస్తానని చంద్రకళ అంటుంది. వద్దని వాదిస్తాడు విరాట్. నాకు కోపం తెప్పించొద్దు. ఇది వరకు ఏం చేశానో గుర్తుందా అని అన్ని ఉతికేసింది గుర్తు చేస్తుంది చంద్రకళ. ఇలా టార్చర్ చేస్తావేంటే. ఏదోటి చేయి. నేను వచ్చేలోపు షర్ట్ ఐరన్ చేసి పెట్టు. షర్ట్‌కు ఏమైనా అయిందో నీ జుట్టు కత్తిరించేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు విరాట్.

తగిన శాస్తి

ఆ మాటలు శ్రుతి వింటుంది. ఇప్పుడు షర్ట్‌కు ఏదైనా అయితే చంద్రకళను బావ క్షమించడన్నమాట అని అనుకుంటుంది శ్రుతి. విరాట్ షర్ట్‌ను చంద్రకళ ఐరన్ చేస్తుంటుంది. ఇంతలో శ్వేత నుంచి చంద్రకు కాల్ రావడంతో ఐరన్ పక్కన పెట్టి వెళ్లిపోతుంది. అక్కడికి వెళ్లిన శ్రుతి విరాట్ షర్ట్‌పై ఐరన్ అలాగే ఉంచేస్తుంది. నీకు బావ చేతిలో బడితపూజే. నన్ను కింద పడేశావ్ కదా. దానికి తగిన శాస్తి ఇప్పుడు జరుగుతుంది చూడు అని చంద్రకళపై రివేంజ్ తీర్చుకుంటుంది శ్రుతి.

ఆ విషయాన్ని కామాక్షికి చెబుతుంది శ్రుతి. చంద్రకు బావ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు. అది మనం చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు అని గది దగ్గరికి వెళ్తారు తల్లీ కూతుళ్లు కామాక్షి శ్రుతి. కానీ, విరాట్‌కు చంద్రకళ నీట్‌గా ఉన్న షర్ట్ ఇస్తుంది. అది చూసి తల్లీ కూతుళ్లు అవాక్కవుతారు. బావ దగ్గర చంద్ర మార్కులు కొట్టేసింది, అసలు ఏమైంది అనుకుంటూ వెళ్తారు.

షర్ట్ కాలిపోకుండా ఉండటం ఏంటీ అని శ్రుతి అంటుంటే చంద్రకళ ఎంట్రీ ఇస్తుంది. నువ్ ఇలాంటి తింగరి పని చేస్తావని ఊహించే బావ షర్ట్ పెట్టిన ప్లేసులో నీ డ్రెస్ పెట్టాను అని శ్రుతికి చూపిస్తుంది చంద్ర. అది చూసి షాక్ అవుతుంది శ్రుతి. ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టాలని చూస్తే మనకు నచ్చినవి దూరమైపోతాయి. ఇంకోసారి చేస్తే నీ మొహం పగిలిపోద్ది అని వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. అలా శ్రుతి ప్లాన్ బెడిసికొడుతుంది.

మెడిసిన్ వేయలేదు

మరోవైపు గుడికి వెళ్లొచ్చిన జగదీశ్వరి భర్త రఘురాంను చూస్తుంది. రఘురాం నురగలు కక్కడం చూసి జగదీశ్వరి షాక్ అవుతుంది. భయపడుతూ అందరిని పిలుస్తుంది. అంతా వచ్చి షాక్ అవుతారు. అయ్యయ్యో నురగ వస్తుందేంటీ. మెడిసిన్ పడలేదేమో అని శాలిని అంటుంది. నేను ఈరోజు మెడిసిన్ వేయలేదు. టైమ్‌కి వేయనందుకే ఇలా అయిందేమో అని జగదీశ్వరి అంటుంది.

ఇందాకే చంద్రకళ వదిన మెడిసిన్ ఇచ్చిందని క్రాంతి చెబుతుంది. నేను ఆ గురూజీ ఇచ్చిన మందులే ఇచ్చాను. ఆయనను ఇంటికి పిలుద్దాం అని చంద్రకళ అంటుంది. ఏదో ఒకటి చేయండి అని జగదీశ్వరి అంటుంది. దాంతో గురూజీకి కాల్ చేసి జరిగింది చెప్పి రమ్మంటుంది. వెంటనే గురూజీ వస్తాడు. రఘురాంను చెక్ చేస్తాడు. మంచి నీళ్లలో వేరే మెడిసిన్ కలిపి రఘురాంకు తాగిస్తాడు గురూజీ.

ఇక ప్రమాదం ఏం లేదు. కంగారుపడకండి. కానీ, నేను ఇచ్చిన మందులు కాకుండా వేరే మందులు ఎందుకు ఇచ్చారు అని గురూజీ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అయిపోయావ్ చంద్ర అని శాలిని అనుకుంటుంది. లేదు మీరు ఇచ్చినవే ఇచ్చాను అని చంద్రకళ ఆ మందులు తీసుకొస్తుంది. అవి చూసిన గురూజీ ఇది నేను ఇచ్చింది కాదే. బాక్స్ ఇదే కానీ మందులు ఇవి కావు అని గురూజీ అంటాడు.

రఘురాం దక్కేవారు కాదు

ఇవి ఇవ్వడం వల్లే ఈయనకు ఇలా అయింది. సరిగ్గా పనిచేయలేదు కాబట్టి ఏం కాలేదు. నిజం తెలిసింది. లేకుంటే ఇవే మందులు ఇచ్చేవాళ్లు. దాంతో ఆయన ఆరోగ్యం మెల్లిగా పాడైపోయి ఈయన మీకు దక్కేవారు కాదు. మందులు ఇచ్చేటప్పుడు కాస్తా చూసుకుని ఇవ్వండి. ఈ పౌడర్ రోజు నీళ్లలో కలిపి ఇవ్వండి అని మరో మెడిసిన్ ఇచ్చి వెళ్లిపోతాడు గురూజీ.

హేయ్ చంద్ర నువ్వే కదా మందులు ఇచ్చావ్. ఏం కలిపి చచ్చావ్. ఇలా కూడా మావయ్యను బతకనివ్వవా అని శాలిని, కామాక్షి, శ్రుతి ముగ్గురు అంటారు. చంద్ర నిజం చెబుతుంటే చాల్లే ఆపు. నేను ఏ పాపం చేశానని నన్ను ఇలా చంపుకుతింటున్నావ్ అని జగదీశ్వరి అంటుంది. నా ముందే మెడిసిన్ ఇచ్చింది. తనకేం తెలియదని క్రాంతి అంటాడు.

నీకంటే ముందే ఆ మెడిసిన్ మార్చి ఉండొచ్చుగా అని శ్రుతి అంటుంది. నేను చేయలేదు. నాకు ఆ అవసరం ఏముందని చంద్రకళ అంటుంది. అన్నయ్యకు స్పృహ వస్తే నీ బండారం బయటపడుతుందిగా అని కామాక్షి అంటుంది. పర్ఫెక్ట్‌ ఇదేగా నేను ఊహించింది అని శాలిని మనసులో సంతోషిస్తుంది. కావాలనే చంద్ర అన్యయ్ను చంపాలని చూసింది అని కామాక్షి అంటుంది.

కొత్త క్యారెక్టర్

అవును, ఇది నా భర్తను చంపడానికే ప్రయత్నం చేసింది అని జగదీశ్వరి అంటుంది. దగ్గరికి వచ్చిన చంద్రకళను కొడుతుంది జగదీశ్వరి. నువ్వైనా నమ్ము బావ అని చంద్ర అంటే.. ఇప్పుడు నువ్వేం చెప్పిన లాభం లేదు. నీ వల్ల మేమింకా ఎన్ని పడాలి. ఏం చూడాలి అని విరాట్ అంటాడు. కోరి తెచ్చుకున్నారు కదా సార్. మీరు కట్టిన తాళి నా మెడలో తెంచేయాలని చాలా ప్రయత్నిస్తోంది అని కొడుకు విరాట్‌ను నిందిస్తుంది జగదీశ్వరి.

తర్వాత క్రాంతితో తన గోడు వెళ్లబోసుకుంటుంది చంద్ర. అత్తయ్య, బావను నమ్మించాలంటే దేవుడు దిగిరావాలి అని చంద్రకళ అంటుంది. ఇంతలో ఆటోలో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More