నిన్ను కోరి జూలై 10 ఎపిసోడ్: దొంగ కోసం విరాట్, చంద్రకళ ఛేజింగ్.. జగదీశ్వరిని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులు

నిన్ను కోరి టుడే జూలై 10వ తేదీ ఎపిసోడ్ లో నగలు కాజేసిన దొంగ ఇంటికి విరాట్, చంద్రకళ వెళ్తారు. ఆ దొంగ తప్పించుకుని పారిపోతే పట్టుకోవడానికి వీళ్లు పరుగెడతారు. మరోవైపు జగదీశ్వరీని అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తారు. మరి దొంగ దొరికాడా?  ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి. 

Published on: Jul 10, 2025, 07:54:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి టుడే జూలై 10 ఎపిసోడ్ లో దొంగ అడ్రస్ వెతుక్కుంటూ విరాట్, చంద్రకళ వెళ్తారు. నా ఇంట్లో దొంగతనం చేసిన వాడిపై కోపంతో ఊగిపోతాడు విరాట్. మనం నగల కోసం వస్తే వాడు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది, అందుకే తెలివిగా డీల్ చేద్దామని చంద్రకళ అంటుంది. బయట ఆ దొంగ బైకు ఆగి ఉండటం గమనిస్తారు. డోర్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేయమంటారు. ఎవరై ఉంటారు అని ఆ దొంగ అనుకుంటాడు.

నిన్ను కోరి సీరియల్ జూలై 10 ఎపిసోడ్
నిన్ను కోరి సీరియల్ జూలై 10 ఎపిసోడ్

తప్పించుకున్న దొంగ

ఎవరు అని దొంగ అడుగుతాడు. ఈ బస్తీలో సొంత ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇప్పించే స్కీమ్ గవర్నమెంట్ తెచ్చిందని, వివరాలు కావాలని చంద్రకళ చెప్తుంది. నమ్మకపోతే మీరే నష్టపోతారని విరాట్ అంటాడు. మీకు డబ్బులు కూడా వస్తాయని ఆశ కల్పిస్తారు. ఆ దొంగ డబ్బుల గురించి ఆలోచించి డోరు తీస్తాడు. లోపలికి వచ్చిన విరాట్ నగలు ఎక్కడ దాచావని అడిగి, ముఖంపై బలంగా పంచ్ ఇస్తాడు. దొంగను విరాట్, చంద్రకళ కొడతారు. దొంగ వాళ్లను తోసేసి పారిపోతాడు.

మరోవైపు ఇంట్లో చంద్రకళను కామాక్షి, శాలిని, శ్రుతి లేనిపోని మాటలు అంటారు. ఆ చంద్రకు తాళాలు అప్పగించి ఎంత పెద్ద తప్పు చేశారో తెలిసిందా? పనికిమాలిన పోటీలన్నీ పెట్టి సింహాసనానికి ఎక్కించారు. కానీ ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తుంది అని కామాక్షి అంటుంది. ఇంతసేపు వాళ్లు ఏం చేస్తున్నారని అంటుంది.

అరెస్టు చేయించాలని

ఇంతలోనే పోలీసులను తీసుకొని పాటు సరిత, వాళ్ల హస్బెండ్ వస్తారు. నగలు ఇస్తారా అరెస్టు చేయమంటారా అని పోలీసులు అంటారు. వాళ్లకు క్రాంతి సీసీటీవీ ఫుటేజీ చూపిస్తారు. మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని పోలీసులు అడుగుతారు. ముందు ఆవిడను అరెస్టు చేయండి అని సరిత భర్త అంటాడు. అరెస్టు చేస్తే పరువు పోతుందని జగదీశ్వరిసరితను రిక్వెస్ట్ చేస్తుంది. కానిస్టేబుల్ అరెస్టు చేయండి అని ఎస్సై అంటాడు.

నగలతో ఎంట్రీ

ఇంతలో ఆగండి అంటూ చంద్రకళ ఎంట్రీ ఇస్తుంది. మీరు చంద్రను అరెస్టు చేయండి అని కామాక్షి అంటుంది. దొంగతో పాటు నగల బాక్స్ ను పట్టుకుని విరాట్ ఇంట్లోకి రావడంతో శాలిని షాక్ అవుతుంది. దొంగను పోలీసులు అరెస్టు చేస్తారు. వాళ్లకు నగలు అప్పగిస్తారు.

ఇంట్లోకి ఎలా వచ్చావు, తాళం చెవులు బీరువాలో ఉన్న సంగతి ఎలా తెలిసింది? ఈ దొంగతనం ఎవరో చేయించారు అని చంద్ర అనగానే శాలిని తెగ కంగారు పడుతుంది. నీతో దొంగతనం చేయించి ఎవరో చెప్పు అంటూ దొంగను పోలీసు కొడతాడు. కానీ చాలా దొంగతనాలు చేశా, ఆ మాత్రం ఎక్స్ పీరియన్స్ ఉండదా అని శాలిని పేరు చెప్పడు దొంగ. దీంతో శాలిని హమ్మయ్యా అనుకుంటుంది.

సారీ చెప్పిన సరిత

సారీ జగదీశ్వరి అని సరిత చెప్తుంది. మా వదిన మీద నమ్మకం కోల్పోవడం సరికాదు అని శ్యామల అంటుంది. క్షమించండి అని సరిత వాళ్లు వెళ్లిపోతారు. జగదీశ్వరి ఒక్కసారిగా సోఫాలో కూలబడుతుంది. ఏమైంది అని అందరూ కంగారు పడతారు. నన్ను ఒంటరిగా వదిలేయండి అని జగదీశ్వరి అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More