...
...
Next Story

నిన్ను కోరి జూలై 11 ఎపిసోడ్: విరాట్ మాటలతో ఫీలైన చంద్రకళ..బిజినెస్ మ్యాన్ తో గొడవ..శాలినిని డబ్బులు డిమాండ్ చేసిన సుందర్

నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 11వ తేదీ ఎపిసోడ్ లో దొంగను పట్టుకున్న చంద్రకళ తెలివికి శ్యామల తెగ ఇంప్రెస్ అయిపోతుంది. అమ్మ కోసం హెల్ప్ చేశానని విరాట్ అంటాడు. శాలినిని డబ్బుల కోసం బెదిరిస్తాడు సుందర్. ఓ బిజినెస్ మ్యాన్ తో గొడవ పెట్టుకుంటుంది చంద్ర.

Published on: Jul 11, 2025, 08:00:58 IST
By ,
Prefer HTon Google
Advertisement

నిన్ను కోరి జూలై 11వ తేదీ ఎపిసోడ్ లో సోఫాలో కూలబడ్డ జగదీశ్వరీని చూసి అందరూ కంగారు పడతారు. చంద్రకళ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పా కదా, ఇప్పుడు ఏం అంటారు? అవసరమైతే ఇంటి కోసం తన ప్రాణాలు పణంగా పెడుతుంది అని శ్యామల అంటుంది. బైక్ నంబర్ ద్వారా దొంగ అడ్రస్ కనిపెట్టామని విరాట్ చెప్తాడు. నువ్వు సూపర్ వదిన అని క్రాంతి పొగిడేస్తాడు.

చంద్ర డౌట్

నిన్ను కోరి సీరియల్ జూలై 11 ఎపిసోడ్
నిన్ను కోరి సీరియల్ జూలై 11 ఎపిసోడ్

దొంగతనం ఎవరైనా కావాలని చేయించారా? అని చంద్రకళ అనుమానపడుతుంది. దీంతో కామాక్షి కంగారు పడుతుంది. జాగ్రత్తగా ఉండు శాలిని అని చెప్తుంది. గదిలోకి వెళ్లి థ్యాంక్యూ శ్రీవారు అని విరాట్ తో చెప్తుంది చంద్ర. నా మీద నీకు ప్రేమ ఉంది బావ. చూశావా నాకోసం నువ్వు నాతో పాటు బయటికి వచ్చి ఆ దొంగని పట్టుకోవడానికి సహాయం చేశావు. నేనంటే నీకు ఇష్టం బావ అని చంద్రకళ విరాట్ తో అంటుంది.

అమ్మ కోసమే

విరాట్ నేను నీకోసం రాలేదు. ఈ ఇంటి కోసం వచ్చాను. ఇంటి పరువు కోసం, మా అమ్మ కోసం వచ్చాను. అంతే తప్ప నీకోసం నీ అవసరం కోసం నిన్ను సేవ్ చేద్దామని కాదు అని విరాట్ అనడంతో చంద్రకళ ఫీల్ అవుతుంది. అసలు నువ్వు ఇంట్లోకి రాకపోతే ఇవన్నీ జరిగేవా? ఇంట్లో ఏం జరిగినా అందులో నీ ప్రమేయం ఉంది. నాన్న శారీరకంగా బాధపడ్డాడు. అమ్మ మానసికంగా బాధపడుతుంది. నేను చిత్రవధ అనుభవిస్తున్నా. నువ్వు వదిలేస్తే కానీ మేం బాగుపడం అని కోపంతో వెళ్లిపోతాడు విరాట్.

డబ్బులు డిమాండ్

మరోవైపు శాలినికి ఫోన్ చేసి సుందర్ డబ్బులు డిమాండ్ చేస్తాడు. నేను చెప్పినట్లు వినకపోతే మీ జీవితం దెబ్బతింటుంది అని సుందర్ బెదిరిస్తాడు. డబ్బులు ఇవ్వకపోతే మీ ఆయన డిజైన్స్ ను లీక్ చేసింది మీరే అని మీ ఫ్యామిలీకి తెలిసేలా చేస్తా. మీరు చేసిన పని మీ ఇంట్లోవాళ్లకు తెలిస్తే మీకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది అని నాకు తెలుసు. అది సీక్రెట్ గా ఉంచాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని అడుగుతాడు.

రాత్రంతా విరాట్ కూర్చొని సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అక్కడికి చంద్రకళ వచ్చి నేను ఏదైనా సహాయం చేయొచ్చా బావ అని అడుగుతుంది. సహాయం చేయకపోయినా పర్వాలేదు గాని చెడగొట్టకు అని విరాట్ చెప్తాడు. కాఫీ తాగితే నిద్ర మత్తు వదిలిపోతుంది అని విరాట్ అనుకుంటుండగానే.. చంద్ర కాఫీ కప్ తో వస్తుంది. కప్ తీసుకున్న విరాట్.. బిల్డప్ ఇవ్వకుండా వెళ్లి పడుకో అని అంటాడు.

బిజినెస్ మ్యాన్ పై సీరియస్

ఉదయం రోడ్డు పక్కన కూర్చున్న ఓ ముసలాయన దగ్గరకు వెళ్లి ఏమైనా తిన్నవా అని అడుగుతుంది చంద్ర. డబ్బులిచ్చి ఏమైనా కొనుక్కుని తిను అంటుంది చంద్ర. మేం కష్టపడి సంపాదించిన డబ్బుతోనే తింటామని ఆ పెద్ద మనిషి చెప్తాడు. వాళ్ల ఆవిడ టిఫిన్ తెచ్చి ఆయనకు తినిపించి, తాను తింటుంది. ఆ సమయంలోనే రోడ్డుపై కారు స్పీడ్ గా వెళ్లడంతో వాళ్లపై బురద పడుతుంది.

అది చూసి కోపంతో చంద్రకళ స్కూటీ మీద కారును ఆపమని అరుస్తూ వెళ్తుంది. కారుకు అడ్డంగా స్కూటీ నిలుపుతుంది. స్కూటీ అడ్డంగా ఎందుకు పెట్టావని కారులో నుంచి దిగిన ఓ బిజినెస్ మ్యాన్ అడుగుతాడు. అసలు సెన్స్ ఉందా? కారు అంత స్పీడ్ గా నడుపుతావా? అని చంద్ర ఫైర్ అవుతుంది. కారు నీదే కావొచ్చు కానీ రోడ్డు నీది కాదు. ముందూ వెనుక చూసుకుని కారు నడపాలి. మీరు స్పీడ్ గా నడపడం వల్ల బురద నీళ్లు పెద్దవాళ్లపై పడ్డాయి అని కోపంతో చంద్ర అడగడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks