...
...
Next Story

నిన్ను కోరి జూలై 17 ఎపిసోడ్: కామాక్షి, శ్రుతి ప్లాన్ రివర్స్.. వ్రతం కంప్లీట్.. శాలిని నిజస్వరూపం తెలుసుకున్న క్రాంతి

నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 17వ తేదీ ఎపిసోడ్ లో విరాట్, చంద్రకళ వ్రతాన్ని అడ్డుకోవాలనే కామాక్షి, శ్రుతి ప్లాన్ రివర్స్ అవుతుంది. శాలిని నిజ స్వరూపాన్ని తెలుసుకుని క్రాంతి షాక్ అవుతాడు. విరాట్, చంద్ర వ్రతాన్ని విజయవంతంగా పూర్తిచేస్తారు.

Published on: Jul 17, 2025, 07:27:04 IST
By ,
Prefer HTon Google
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 17వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ, విరాట్ చేయబోయే వ్రతానికి ఆటంకం కలిగించేందుకు కామాక్షి, శ్రుతి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. విరాట్, చంద్రకళకు బ్రహ్మముడి వేయాలని పంతులు అంటే.. ఇదేమైనా వివాహమా? అని అడుగుతాడు విరాట్. కానీ శ్యామల చెప్పేసరికి పంతులు బ్రహ్మముడి వేస్తాడు. యజ్ణం ప్రారంభిస్తారు. హోమం నుంచి వచ్చే పొగ పీల్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని శ్రుతి దగ్గరగా కూర్చుంటుంది.

పౌడర్ చల్లినా

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)

శ్రుతి ఒక్కసారిగా హోమంలో కెమికల్ పౌడర్ చల్లుతుంది. అందరూ షాక్ అవుతారు. ఏం చేశావే నువ్వు అంటూ శ్రుతిని కొడుతుంది శ్యామల. తను మంచి పనే చేసింది. అలా కర్పూరం పొడి చల్లితే మంట ఆరిపోకుండా ఉంటుంది. పూర్ణాహుతి జరిగే వరకూ కర్పూరం అలాగే వేస్తూ ఉండమ్మ అని పంతులు అనడంతో ఈ సారి కామాక్షి, శ్రుతి షాక్ అవుతారు. నీకు మంచి మొగుడే వస్తాడులే వేయ్ అని శ్యామల అంటుంది.

పవర్ ఫుల్ కెమికల్ అని పెద్ద బిల్డప్ ఇచ్చి, కర్పూర పొడి చేతిలో పెట్టి వెళ్లిపోతాడా? వ్రతం చెడగొడదామనుకుంటే మనమే దగ్గరుండి చేయించినట్లయింది అని కామాక్షి, శ్రుతి ఫీల్ అవుతారు. హోమంలో పూర్ణాహుతి సమర్పించి విరాట్, చంద్ర యజ్ణాన్ని ముగిస్తారు.

క్రాంతి షాక్

మరోవైపు డబ్బుల కోసం శాలిని దగ్గరకు సుందర్ వస్తాడు. ఇతను నా డిజైన్స్ వాడుకున్న ఆపోజిట్ కంపెనీ ఎంప్లాయ్ కదా, శాలినికి డబ్బులు ఎందుకు అడుగుతున్నాడు అని క్రాంతి ఆలోచనలో పడతాడు. రూ.20 లక్షలు తెచ్చారా అని అడుగుతాడు సుందర్. అంత క్యాష్ లేదు అందుకే డబ్బుతో పాటు నగలు కూడా తీసుకొచ్చా అని శాలిని బ్యాగ్ ఇస్తూ మెసేజ్ లు, డిజైన్స్ డిలీట్ చేయమంటుంది. అది విని క్రాంతి షాక్ అవుతాడు.

అందుకే చేశా

వెన్నుపోటు పొడుస్తావని కలలో కూడా ఊహించలేదని క్రాంతి ఫీల్ అవుతాడు. మన లైఫ్ లో చంద్ర జోక్యం ఉంటే నచ్చదు క్రాంతి అని శాలిని అనడంతో కోపంతో వెళ్లిపోతాడు.

చంద్ర థ్యాంక్స్

గుడిలో ఏడుస్తూ శ్యామలకు థ్యాంక్స్ చెప్తుందిచంద్రకళ. మా అమ్మ తర్వాత నా గురించి ఇంతలా ఆలోచించేది మీరే పిన్ని. మీరు దేవతలా అండగా నిలబడ్డారు అని చంద్ర చెప్తుంది. నేను ఉండగా నీకు ఎలాంటి లోటు రానివ్వను, విరాట్ నీతో సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత నాది అని శ్యామల అంటుంది. గుడిలో ముసలి దంపతుల ప్రేమ చూసి, మాటలు విని అందరూ హ్యాపీ అవుతారు. వాళ్లలాగే మీరు కూడా జీవితాంతం సంతోషంగా కలిసి బతకాలి అని శ్యామల అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks