...
...
Next Story

నిన్ను కోరి జులై 21 ఎపిసోడ్: చంద్రకు సారీ చెప్పిన బిజినెస్ మ్యాన్.. డీల్ కు ఓకే.. విరాట్ కు అమ్మవారు కావడంతో కంగారు

నిన్ను కోరి సీరియల్ టుడే జులై 21వ తేదీ ఎపిసోడ్ లో విరాట్ తో అంతకుముందు డీల్ క్యాన్సిల్ చేసుకున్న బిజినెస్ మ్యాన్ చంద్రకు సారీ చెప్తాడు. డీల్ ఓకే చేస్తాడు. విరాట్ కు అమ్మవారు కావడంతో ఇంట్లో అందరూ కంగారు పడతారు.

Published on: Jul 21, 2025, 07:34:00 IST
By ,
Prefer HTon Google
Advertisement

నిన్ను కోరి సీరియల్ జులై 21వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ రోడ్డు మీద యాక్సిడెంట్ నుంచి ఓ బాబును కాపాడుతుంది. ఆ బాబు నా ఒక్కగానొక్క కొడుకు అని విరాట్ తో డీల్ క్యాన్సిల్ చేసుకున్న బిజినెస్ మ్యాన్ అంటాడు. వాణ్ని చాలా అపురూపంగా పెంచుకుంటున్నాం. సమయానికి వచ్చి కాపాడావు. నా ఇంటిని నిలబెట్టిన దేవతవమ్మా అని అంటాడు. ఈ కాలంలో సొంత వాళ్లనే లెక్క చేయని మనుషులు, పరిచయం లేని వాళ్లకు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చావు. ఆ రోజు ముసలి వాళ్ల విషయంలో ఈగోకు వెళ్లి తప్పుడుగా మాట్లాడా. నన్ను క్షమించమ్మా అని అడుగుతాడు.

డీల్ ఓకే

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

నీ మీద కోపంతో డీల్ క్యాన్సిల్ చేశా. విరాట్ తో బిజినెస్ డీల్ ను ఒకే చేస్తున్నాను అని ఆ బిజినెస్ మ్యాన్ చెప్పడంతో అందరూ సంతోషపడతారు. నా వల్ల మీరు కూడా మీ వైఫ్ ను అపార్థం చేసుకున్నట్లు ఉన్నారు అని ఆ బిజినెస్ మ్యాన్ వెళ్లిపోతాడు. ఈ ఊహించని షాక్ తోశాలిని కంగు తింటుంది. కట్టుకునే భర్తను చంద్ర మోసం చేస్తుందా? ఎంత అపార్థం చేసుకున్నావ్ రా, ఎంత అసహ్యించుకున్నావ్? చేయని తప్పునకు తాను ఎంత బాధపడాల్సి వచ్చిందో అని విరాట్ తో శ్యామల అంటుంది. నా ప్రాణం ఉన్నంతవరకూ ఈ ఇంటి పేరు నిలబెట్టే పనులే చేస్తానని చంద్రకళ చెప్పి వెళ్లిపోతుంది.

విరాట్ థ్యాంక్యూ

బెడ్ రూమ్ లో బట్టలు మడతపెడుతున్న చంద్రకళ దగ్గరకు విరాట్ వెళ్తాడు. తాను అన్న మాటలకు ఎలా సారీ చెప్పాలో అని తికమక పడతాడు. నా భర్తే మాటలు అన్నాడు కదా అని ఎప్పుడో మర్చిపోయాను అని చంద్ర అంటే.. థ్యాంక్యూ వెరీ మచ్ అని విరాట్ అంటాడు. థ్యాంక్యూ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఈ మధ్య ఓపిక నశిస్తుందోయ్ శ్రీవారు. వెనకా ముందు ఆలోచించకుండా తిట్టేస్తున్నారని చంద్ర అంటుంది. కోపంతో కొట్టాను ఇప్పుడు థ్యాంక్యూ చెప్పానని విరాట్ అంటాడు.

ఇంట్లోనే క్రాంతి తాగుడు

పొద్దున విరాట్ కు ఎలా ఉందో చూడమని పూజ చేస్తున్న చంద్రకళను పంపిస్తారు శ్యామల, జగదీశ్వరి. బెడ్ పై విరాట్ ను చూసి అందరూ షాక్ అవుతారు. విరాట్ కు అమ్మవారు అయినట్లు కనిపిస్తోందని శ్యామల అంటుంది. బయటకు వద్దు ఇంట్లోనే పద్ధతిగా చూసుకుద్దామంటుంది. చంద్రకళ గుడికి వెళ్లి పూజారిని ఏం చేయాలో అడుగుతుంది. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe