నిన్ను కోరి జూలై 9 ఎపిసోడ్: నగలు పోవడంతో అవమానం.. దొంగ అడ్రస్ కనిపెట్టిన విరాట్, చంద్ర.. టెన్షన్ లో శాలిని
నిన్ను కోరి టుడే జూలై 9వ తేదీ ఎపిసోడ్ లో నగలు పోవడంతో జగదీశ్వరీని సరిత అవమానిస్తుంది. విరాట్, చంద్రకళ దొంగ అడ్రస్ కనిపెడతారు. తన పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని శాలిని టెన్షన్ పడుతుంది.
నిన్ను కోరి జూలై 9వ తేదీ ఎపిసోడ్ లో నగలు మా చేతికి రాకపోతే పోలీస్ కంప్లయింట్ ఇస్తామని జగదీశ్వరి ఫ్రెండ్ సరిత వార్నింగ్ ఇస్తుంది. ఈ అమ్మాయి మమ్మల్ని ముంచేయడానికి ఇలా నటించిందని చంద్రకళను తిడుతుంది. కానీ ఈ చిన్న ఇష్యూ వల్ల మీరు పోలీసు కంప్లయింట్ ఇస్తే మా ఇంటి పరువు పోతుంది. ఆ నగలు కొనడానికి ఎంత డబ్బు అయిందో చెప్పండి ఇచ్చేస్తామని విరాట్ అంటాడు.

పోలీస్ కంప్లయింట్
డబ్బు మా దగ్గర లేదా? అవి మామూలు నగలు కావు. మొక్కు చెల్లించడానికి చేయించిన నగలు. అవి లేకపోతే మేం గుడికి వెళ్లలేం. మాకు ఆ నగలే కావాలి అని సరిత ఖరాకండీగా చెప్పేస్తుంది. మీకు కొంచెం టైమ్ ఇస్తున్నాం, నగలు ఇవ్వకపోతే మాత్రం పోలీస్ కంప్లయింట్ ఇవ్వకుండా వదలం అని వాళ్లు వెళ్లిపోతారు.
చంద్రను నానామాటలు
దొరికిందే ఛాన్స్ కదా అని చంద్రకళను కామాక్షి నానా మాటలు అంటుంది. నన్ను క్షమించండి అత్తయ్య అని చంద్ర అంటే.. పోయిన పరువు తిరిగి వస్తుందా? అని జగదీశ్వరి అంటుంది. నగలు మాయమయ్యాయో, తనే మాయం చేసిందో ఎవరికి తెలుసు అని శ్రుతి అంటే.. శ్యామల ఫైర్ అవుతుంది. చంద్రకళ ఎలాంటిదో ఇక్కడ అందరికీ తెలుసని చెప్తుంది. బాధ్యతగా ఉండాలి కదా అని చంద్రకళతో అంటుంది శ్యామల.
సీసీ ఫుటేజీ
నగలు లాకర్ లోనే పెట్టానని చంద్రకళ పదే పదే చెప్తుంది. సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది అని క్రాంతి సీసీ కెమెరా వీడియోలను తీసుకొస్తాడు. అందరూ చూస్తుంటే దొంగ నగల బాక్స్ తీసుకెళ్లడం కనిపిస్తుంది. వదినను మాత్రం తప్పు పట్టడం కరెక్టు కాదని చంద్రకు క్రాంతి సపోర్ట్ చేస్తాడు. ఈ విషయంలో చంద్రకు సపోర్ట్ చేయను అని విరాట్ అంటే.. చంద్రతో వెళ్లు అని శ్యామల చెప్తుంది. విరాట్, చంద్ర దొంగను పట్టుకోవడానికి వెళ్తారు.
నగలు ఎక్కడున్నాయో తెలిసే ఛాన్స్ లేదని శాలిని అంటుంది. ఆ దొంగ ఎవరో తెలియలేదు కదా అని శాలిని అంటే.. చంద్రను తక్కువ అంచనా వేయలేమని కామాక్షి, శ్రుతి చెప్తారు. శాలిని ఆ దొంగకు కాల్ చేసి ఆ చంద్రకళ నిన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టుకో జాగ్రత్త అని చెప్తుంది.
బైక్ నంబర్
సీసీటీవీ ఫుటేజీలో నేను బైక్ నంబర్ ను గమనించా బావ అని విరాట్ తో చంద్ర చెప్తుంది. అవును నంబర్ తో అడ్రస్ కనుక్కోవచ్చు అని విరాట్ అంటాడు. వెంటనే తన ఫ్రెండ్ కు కాల్ చేసి బైక్ నంబర్ చెప్పి అడ్రస్ కనుక్కుంటాడు విరాట్. ఆ అడ్రస్ ను వెెతుక్కుంటూ విరాట్, చంద్రకళ వెళ్తారు. మరోవైపు సిచ్యువేషన్ ను వాడుకుని చంద్రకళపై లేనిపోనివి జగదీశ్వరికి చెప్తారు కామాక్షి, శ్రుతి. కానీ క్రాంతి మాత్రం చంద్రకు సపోర్ట్ గా మాట్లాడతాడు. చంద్ర గురించి ఎప్పుడూ ఎందుకు నెగెటివ్ గా మాట్లాడుతారు అని శ్యామల ఫైర్ అవుతుంది.
దొంగ అడ్రస్
విరాట్ ను చంద్రకళ ఎక్కడికి తీసుకెళ్లిందో ఇప్పుడే తెలుసుకుంటే సరిపోతుంది కదా అని శ్యామల అంటుంది. విరాట్ కు క్రాంతి ఫోన్ చేస్తాడు. దొంగ అడ్రస్ కనిపెట్టామని, నగలు తీసుకుని వస్తామని క్రాంతితో విరాట్ అంటాడు. అమ్మ ఆ దొంగ అడ్రస్ దొరికిందంటా, అన్నయ్య వాళ్లు ఆ ఇంటి దగ్గరే ఉన్నారంటా అని క్రాంతి చెప్పగానే శాలిని, కామాక్షి, శ్రుతికి మైండ్ బ్లాక్ అవుతుంది.
దొంగకు శాలిని ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇప్పుడెలా అంటూ శాలిని కంగారు పడుతుంది. జనాభా వివరాలు తెలుసుకునేందుకు వచ్చామని దొంగ ఇంట్లోకి వెళ్తారు విరాట్, చంద్ర. నగలు ఎక్కడ దాచావురా అని దొంగను ముఖంపై విరాట్ కొట్టడంతో నేటి నిన్నుకోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.














