ఓటీటీలోకి ఒకేరోజు రిలీజైన తమ్ముడు, 3 బీహెచ్‌కే.. ఒకదానికి పాజిటివ్, మరోదానికి నెగెటివ్.. 5 భాషల్లో స్ట్రీమింగ్!
ఓటీటీలోకి ఒకేరోజు థియేటర్లలో రిలీజ్ అయిన నితిన్ తమ్ముడు, సిద్ధార్థ్ 3 బీహెచ్‌కే సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. జులై 4న విడుదలైన ఈ రెండింట్లో ఒకటి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుంటే మరోటి మాత్రం నెగెటివిటీ మూటగట్టుకుంటోంది. తమ్ముడు, 3 బీహెచ్‌కే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఒకేరోజు థియేటర్లలో విడుదలైన రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. జులై 4న థియేటర్లలో నితిన్ హీరోగా నటించిన తమ్ముడు, సిద్ధార్థ్ చేసిన 3 బీహెచ్‌కే రెండు సినిమాలు విడుదల అయ్యాయి.

నెగెటివ్-పాజిటివ్ టాక్
అయితే, వీటిలో ఒకటి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంటే మరోకొటి మాత్రం నెగెటివిటీ మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో తమ్ముడు ఓటీటీ స్ట్రీమింగ్, 3 బీహెచ్‌కే ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ్ముడు, 3 బీహెచ్‌కే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
హీరోయిన్ లయ రీ ఎంట్రీ
హీరో నితిన్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రమే తమ్ముడు. సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ఇద్దరు హీరోయిన్స్‌గా చేసిన తమ్ముడు సినిమాలో మలయాళ బ్యూటి స్వాసిక మరో కీలక పాత్ర పోషించింది.
వకీల్ సాబ్ డైరెక్టర్
దిల్ రాజు నిర్మాణంలో వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన తమ్ముడు జులై 4న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. తమ్ముడు సినిమాపై చాలా వరకు నెగెటివిటీ టాక్ వస్తోంది. మూవీ ఏం బాలేదంటూ రివ్యూవర్స్ చెబుతున్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ఇక తమ్ముడు ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఇదివరకే నిర్మాత దిల్ రాజు తెలిపారు. కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లో తమ్ముడు ఓటీటీ స్ట్రీమింగ్కానుంది. తెలుగుతోపాటు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ వంటి ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో తమ్ముడు ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం.
చెల్లెలిగా తమిళ సెన్సేషన్
ఇక ఇదే జులై 4న థియేటర్లలో విడుదలైన మరో సినిమా 3 బీహెచ్‌కే. సిద్ధార్థ్హీరోగా నటించిన 3 బీహెచ్‌కే సినిమాలో సీనియర్ యాక్టర్ శరత్ కుమార్, దేవయాని, తమిళ సెన్సేషన్ మీఠా రఘునాథ్ కీలక పాత్రలు పోషించారు. తల్లిదండ్రులుగా శరత్ కుమార్-దేవయాని, అన్నాచెల్లెలిగా సిద్ధార్థ్-మీఠా రఘునాథ్ యాక్ట్ చేశారు.
3 బీహెచ్‌కే టాక్
శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన3 బీహెచ్కే సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా చాలా బాగుందని, చాలా వరకు హై ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని, ప్రభు పాత్రలో సిద్ధార్థ్‌తోపాటు మిగతా నటీనటులు ఎంతగానో మెప్పించారని రివ్యూస్ వచ్చాయి.
రెండు ఓటీటీల్లో
ఈ నేపథ్యంలో 3 బీహెచ్‌కే ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అమెజాన్ ప్రైమ్ లేదా సన్ నెక్ట్స్‌లో 3 బీహెచ్‌కే ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ వంటి ఐదు భాషల్లో 3 బీహెచ్‌కే ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
వచ్చే నెలలో
అంతేకాకుండా, ఆగస్ట్ మొదటి వారంలో 3 బీహెచ్‌కే ఓటీటీ రిలీజ్ కానుందని బాలీవుడ్ యూట్యూబర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాతోపాటు నితిన్ తమ్ముడు మూవీ కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



