- టైటిల్: ఓజీ
- నటీనటులు: పవన్ కల్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఉపేంద్ర లిమాయే తదితరులు
- దర్శకత్వం: సుజీత్
- సంగీతం: ఎస్ఎస్ తమన్
- సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస
- ఎడిటింగ్: నవీన్ నూలి
- నిర్మాతలు: డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్
- రిలీజ్ డేట్: సెప్టెంబర్ 25, 2025

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో హైప్‌తో ఎదురుచూసిన ఓజీ సినిమా ఎట్టకేలకు ఇవాళ (సెప్టెంబర్ 25) థియేటర్లలో విడుదలైంది. సాహో, రన్ రాజా రన్ చిత్రాల డైరెక్టర్, పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన సుజీత్ ఓజీ మూవీని తెరకెక్కించాడు. మరి భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది ఓజీ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఓజీ కథ జపాన్‌లోని సమురాయ్ వంశాల నేపథ్యంతో మొదలవుతుంది. అక్కడ జరిగిన అంతర్గత పోరులో ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కల్యాణ్) తప్పించుకుని ముంబైకి వస్తాడు. ముంబై పోర్టును శాసించే సత్య దాదా (ప్రకాశ్ రాజ్)కు కుడిభుజంగా, రక్షకుడిగా మారతాడు ఓజీ.
అయితే, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ముంబైని వదిలి వెళ్లిపోతాడు ఓజీ. డాక్టర్ కణ్మని (ప్రియాంక అరుల్ మోహన్)ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తాడు. కానీ, సత్యదాదా కుటుంబానికి స్నేహితుడు మిరాజ్ కర్ (తేజ్ సప్రూ)తోపాటు అతని కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మి) వల్ల ప్రమాదం ఏర్పడుతుంది.
అప్పుడు ఓజీ తిరిగి ముంబైకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఓజీ సత్యాదాదా మధ్య ఉన్న బంధం ఏంటీ? ఫ్రెండ్స్ అయిన సత్యదాదా మిరాజ్ కర్‌కు ఎందుకు శత్రుత్వం ఏర్పడింది? సత్యాదాదా కొడుకులకు ఏమైంది? అసలు ఓజీ ఎవరు? ఓజీ గతం ఏంటీ? ఓమీని ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు? తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ:
ఒక డై హార్డ్ ఫ్యాన్ తన అభిమాన హీరోతో సినిమా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహారణే ఓజీ. డైరెక్టర్‌గా సామాన్య ప్రేక్షకుడికి నచ్చేలా కాకుండా పూర్తిగా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ఎలివేషన్స్‌తో ఓజీ మూవీని డైరెక్ట్ చేశాడు సుజీత్. పవర్ స్టార్ అభిమానులు పవన్ కల్యాణ్‌ను ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించాడు.
{{/usCountry}}ఒక డై హార్డ్ ఫ్యాన్ తన అభిమాన హీరోతో సినిమా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహారణే ఓజీ. డైరెక్టర్‌గా సామాన్య ప్రేక్షకుడికి నచ్చేలా కాకుండా పూర్తిగా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ఎలివేషన్స్‌తో ఓజీ మూవీని డైరెక్ట్ చేశాడు సుజీత్. పవర్ స్టార్ అభిమానులు పవన్ కల్యాణ్‌ను ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించాడు.
{{/usCountry}}ఓజీ సినిమాతో వింటేజ్ పవన్ కల్యాణ్‌ను చూస్తారు. పవన్ కల్యాణ్ స్వాగ్, స్టైల్, స్క్రీన్ ప్రజెన్స్ అంతా నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. అంతకుమించి అన్నట్లుగా పవర్ స్టార్‌తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అని చెప్పొచ్చు. ఫస్టాఫ్‌లో డైలాగ్స్ కంటే యాక్షన్ సీన్స్ ఎక్కువ. ప్రతి సీన్ పవన్ కల్యాణ్‌కు ఎలివేషన్ ఇచ్చేలా ఉంటుంది.
ఫుల్ మీల్స్ అనిపించేలా
కటానా, నాంచాక్‌లతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అభిమానులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. ఇక పవన్ కల్యాణ్ నడక, చూపులు, ముఖ్యంగా ఆయన కళ్లు అభిమానులను ఉర్రూతలూగిస్తాయి. పవన్ కల్యాణ్‌ను స్టైలిష్‌గా చూపించడంలో సుజీత్ వందకు వంద శాతం సక్సెస్ అయ్యాడు. ఫ్యాన్ బాయ్ మూమెంట్‌లా అభిమానులు మెచ్చెలా తెరకెక్కించాడు.
ఒక అభిమాని తన హీరోను ఎలా చూడాలనుకుంటాడో, ప్రతీ ఫ్రేమ్‌లోనూ సుజీత్ అదే చూపించాడు. సినిమాలోని మొదటి 30 నిమిషాలు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే ఎలివేషన్ సన్నివేశాలతో నిండిపోయాయి. ఇక టైటిల్ కార్డ్స్ అయితే నెక్ట్స్ లెవెల్. ఇంటర్వెల్ బ్లాక్‌తో దద్దరిల్లిపోయింది.
పోలీస్ స్టేషన్ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. అయితే, ఈ ఎలివేషన్ల మోజులో పడి దర్శకుడు అసలు కథ, కథనాలపై దృష్టి పెట్టడం మర్చిపోయాడు. ఫ్యాన్స్‌కు కావాల్సిన అంశాలను చక్కగా అమర్చిన సుజీత్, సాధారణ ప్రేక్షకుడిని మెప్పించే బలమైన కథనాన్ని సిద్ధం చేసుకోవడంలో తడబడ్డాడు.
రొటీన్ ఫార్ములాతో
కథను పట్టించుకోక కేవలం పవన్ కల్యాణ్‌ను ఇలా చూపించడానికే ఓజీని తెరకెక్కించినట్లుగా అనిపిస్తోంది. కథ పెద్దగాం ఇంపాక్ట్ చూపించదు. రొటీన్ ఫార్ములాతోనే ఉంటుంది. లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఇక ఎమోషన్స్ సైతం అంతగా పండలేదు. దాదాపుగా ఊహించినట్లుగానే సినిమా సాగుతుంది.
టెక్నికల్ పరంగా ఓజీ అదుర్స్. సూపర్బ్ విజువల్స్‌తో సినిమాటోగ్రఫీ వర్క్ అదిరిపోయింది. ప్రతి ఫేమ్ రిచ్‌గా, స్టైలిష్‌గా ఉంది. నిర్మాతల ఖర్చు కూడా తెలుస్తుంది. తమన్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. యాక్షన్ సీన్స్‌తో హై ఇచ్చింది తమన్ బీజీఎమ్.
ఓజస్ గంభీరగా పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో చేశాడు. కళ్లు, యాక్షన్ సీన్స్, యాక్టింగ్‌తో పవర్ ప్యాక్ పర్ఫామెన్స్. ఇక విలన్‌గా ఇమ్రాన్ హష్మి బాగానే చేశాడు. ఆయన పాత్రను ఇంకా సాలిడ్‌గా రాసుకుని ఉండాల్సింది. ఇక డైరెక్టర్ అభిమానిగా సక్సెస్ అయ్యాడు కానీ దర్శకుడిగా కాస్తా నిరాశపరిచాడు.
ఫైనల్‌గా చెప్పాలంటే
ప్రియాంక మోహన్ పాత్ర పరిధి మేర ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలు బాగానే మెప్పించారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఓజీ రొటీన్ స్టోరీతో స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ చిత్రం. ఒక సామాన్యుడి సినిమా కంటే పవన్ కల్యాణ్ అభిమాని మూవీ అనొచ్చు.