ఓజీ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్‌డ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఓజీ ఎట్టకేలకు థియేటర్లలో అడుగుపెట్టింది. ఎన్నో అంచనాలతో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన దే కాల్ హిమ్ ఓజీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేసింది. ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఓజీ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Sep 25, 2025, 09:23:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
  • టైటిల్: ఓజీ
  • నటీనటులు: పవన్ కల్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఉపేంద్ర లిమాయే తదితరులు
  • దర్శకత్వం: సుజీత్
  • సంగీతం: ఎస్ఎస్ తమన్
  • సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస
  • ఎడిటింగ్: నవీన్ నూలి
  • నిర్మాతలు: డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్
  • రిలీజ్ డేట్: సెప్టెంబర్ 25, 2025

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో హైప్‌తో ఎదురుచూసిన ఓజీ సినిమా ఎట్టకేలకు ఇవాళ (సెప్టెంబర్ 25) థియేటర్లలో విడుదలైంది. సాహో, రన్ రాజా రన్ చిత్రాల డైరెక్టర్, పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన సుజీత్ ఓజీ మూవీని తెరకెక్కించాడు. మరి భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది ఓజీ రివ్యూలో తెలుసుకుందాం.

ఓజీ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్‌డ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
ఓజీ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్‌డ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

కథ:

ఓజీ కథ జపాన్‌లోని సమురాయ్ వంశాల నేపథ్యంతో మొదలవుతుంది. అక్కడ జరిగిన అంతర్గత పోరులో ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కల్యాణ్) తప్పించుకుని ముంబైకి వస్తాడు. ముంబై పోర్టును శాసించే సత్య దాదా (ప్రకాశ్ రాజ్)కు కుడిభుజంగా, రక్షకుడిగా మారతాడు ఓజీ.

అయితే, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ముంబైని వదిలి వెళ్లిపోతాడు ఓజీ. డాక్టర్ కణ్మని (ప్రియాంక అరుల్ మోహన్)ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తాడు. కానీ, సత్యదాదా కుటుంబానికి స్నేహితుడు మిరాజ్ కర్ (తేజ్ సప్రూ)తోపాటు అతని కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మి) వల్ల ప్రమాదం ఏర్పడుతుంది.

అప్పుడు ఓజీ తిరిగి ముంబైకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఓజీ సత్యాదాదా మధ్య ఉన్న బంధం ఏంటీ? ఫ్రెండ్స్ అయిన సత్యదాదా మిరాజ్ కర్‌కు ఎందుకు శత్రుత్వం ఏర్పడింది? సత్యాదాదా కొడుకులకు ఏమైంది? అసలు ఓజీ ఎవరు? ఓజీ గతం ఏంటీ? ఓమీని ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు? తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ:

ఒక డై హార్డ్ ఫ్యాన్ తన అభిమాన హీరోతో సినిమా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి పర్‌ఫెక్ట్ ఉదాహారణే ఓజీ. డైరెక్టర్‌గా సామాన్య ప్రేక్షకుడికి నచ్చేలా కాకుండా పూర్తిగా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ఎలివేషన్స్‌తో ఓజీ మూవీని డైరెక్ట్ చేశాడు సుజీత్. పవర్ స్టార్ అభిమానులు పవన్ కల్యాణ్‌ను ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించాడు.

ఓజీ సినిమాతో వింటేజ్ పవన్ కల్యాణ్‌ను చూస్తారు. పవన్ కల్యాణ్ స్వాగ్, స్టైల్, స్క్రీన్ ప్రజెన్స్ అంతా నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. అంతకుమించి అన్నట్లుగా పవర్ స్టార్‌తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అని చెప్పొచ్చు. ఫస్టాఫ్‌లో డైలాగ్స్ కంటే యాక్షన్ సీన్స్ ఎక్కువ. ప్రతి సీన్ పవన్ కల్యాణ్‌కు ఎలివేషన్ ఇచ్చేలా ఉంటుంది.

ఫుల్ మీల్స్ అనిపించేలా

కటానా, నాంచాక్‌లతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అభిమానులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. ఇక పవన్ కల్యాణ్ నడక, చూపులు, ముఖ్యంగా ఆయన కళ్లు అభిమానులను ఉర్రూతలూగిస్తాయి. పవన్ కల్యాణ్‌ను స్టైలిష్‌గా చూపించడంలో సుజీత్ వందకు వంద శాతం సక్సెస్ అయ్యాడు. ఫ్యాన్ బాయ్ మూమెంట్‌లా అభిమానులు మెచ్చెలా తెరకెక్కించాడు.

ఒక అభిమాని తన హీరోను ఎలా చూడాలనుకుంటాడో, ప్రతీ ఫ్రేమ్‌లోనూ సుజీత్ అదే చూపించాడు. సినిమాలోని మొదటి 30 నిమిషాలు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే ఎలివేషన్ సన్నివేశాలతో నిండిపోయాయి. ఇక టైటిల్ కార్డ్స్ అయితే నెక్ట్స్ లెవెల్. ఇంటర్వెల్ బ్లాక్‌తో దద్దరిల్లిపోయింది.

పోలీస్ స్టేషన్ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. అయితే, ఈ ఎలివేషన్ల మోజులో పడి దర్శకుడు అసలు కథ, కథనాలపై దృష్టి పెట్టడం మర్చిపోయాడు. ఫ్యాన్స్‌కు కావాల్సిన అంశాలను చక్కగా అమర్చిన సుజీత్, సాధారణ ప్రేక్షకుడిని మెప్పించే బలమైన కథనాన్ని సిద్ధం చేసుకోవడంలో తడబడ్డాడు.

రొటీన్ ఫార్ములాతో

కథను పట్టించుకోక కేవలం పవన్ కల్యాణ్‌ను ఇలా చూపించడానికే ఓజీని తెరకెక్కించినట్లుగా అనిపిస్తోంది. కథ పెద్దగాం ఇంపాక్ట్ చూపించదు. రొటీన్ ఫార్ములాతోనే ఉంటుంది. లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఇక ఎమోషన్స్ సైతం అంతగా పండలేదు. దాదాపుగా ఊహించినట్లుగానే సినిమా సాగుతుంది.

టెక్నికల్ పరంగా ఓజీ అదుర్స్. సూపర్బ్ విజువల్స్‌తో సినిమాటోగ్రఫీ వర్క్ అదిరిపోయింది. ప్రతి ఫేమ్ రిచ్‌గా, స్టైలిష్‌గా ఉంది. నిర్మాతల ఖర్చు కూడా తెలుస్తుంది. తమన్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. యాక్షన్ సీన్స్‌తో హై ఇచ్చింది తమన్ బీజీఎమ్.

ఓజస్ గంభీరగా పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో చేశాడు. కళ్లు, యాక్షన్ సీన్స్, యాక్టింగ్‌తో పవర్ ప్యాక్ పర్ఫామెన్స్. ఇక విలన్‌గా ఇమ్రాన్ హష్మి బాగానే చేశాడు. ఆయన పాత్రను ఇంకా సాలిడ్‌గా రాసుకుని ఉండాల్సింది. ఇక డైరెక్టర్ అభిమానిగా సక్సెస్ అయ్యాడు కానీ దర్శకుడిగా కాస్తా నిరాశపరిచాడు.

ఫైనల్‌గా చెప్పాలంటే

ప్రియాంక మోహన్ పాత్ర పరిధి మేర ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలు బాగానే మెప్పించారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఓజీ రొటీన్ స్టోరీతో స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ చిత్రం. ఒక సామాన్యుడి సినిమా కంటే పవన్ కల్యాణ్ అభిమాని మూవీ అనొచ్చు.

రేటింగ్: 3/5

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More