...
...
Next Story

ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత ఇవాళ తెలుగులో వచ్చిన మలయాళ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి తెలుగులో ఇవాళ మలయాళ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఒక యముడి ప్రేమకథ డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చేసింది. 2019లో మలయాళం విడుదలైన ఈ సినిమా ఆరేళ్ల తర్వాత తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ అయింది. దుల్కర్ సల్మాన్, సంయుక్త మీనన్ నటించిన ఒక యముడి ప్రేమకథ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ చూద్దాం.

Published on: Jun 5, 2025, 11:12:55 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీ మలయాళ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో అంతే కొందరు హీరోలకు సైతం మంచి పాపులారిటీ ఉంటుంది. అలా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న మలయాళ స్టార్ హీరోల్లో దుల్కర్ సల్మాన్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగులో సూపర్ హిట్ కొట్టి అందరి మనసు దోచేశాడు.

బాక్సాఫీస్ విజయాలతో

ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత ఇవాళ తెలుగులో వచ్చిన మలయాళ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత ఇవాళ తెలుగులో వచ్చిన మలయాళ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి!

అలాగే, కల్కి, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ ఒక స్ట్రైట్ తెలుగు హీరోగా ఇక్కడ సూపర్ ఫ్యాన్స్ బేస్ నెలకొల్పుకున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న అభిమానంతో పాటు బాక్సాఫీస్ విజయాలతో దుల్కర్ సల్మాన్ సత్తా చాటుతున్నాడు. ఇక గతంలో దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ సినిమాలను అందించాడు.

2019లో వచ్చిన

వాటిలో చాలా వరకు మూవీస్ తెలుగులో డబ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా 2019లో దుల్కర్ సల్మాన్ నటించిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ "ఒరు యమండన్ ప్రేమకథ". ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు. అది కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు.

ఒక యముడి ప్రేమకథ ఓటీటీ రిలీజ్

"ఒరు యమండన్ ప్రేమకథ" సినిమాను తెలుగులో "ఒక యముడి ప్రేమకథ" టైటిల్‌తో విడుదల చేశారు. ఆహాలో ఒక యముడి ప్రేమకథ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (జూన్ 5) ఒక యముడి ప్రేమకథ ఓటీటీ రిలీజ్ అయింది. అంటే, 2019లో విడుదలైన ఈ సినిమా ఆరేళ్లకు తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమాను తెలుగులో భవానీ మీడియా విడుదల చేసింది.

హీరోయిన్‌గా సంయుక్త మీనన్

ఇదిలా ఉంటే, ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు చిత్రాలు ఒక్కొక్కటీ రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించబడుతున్నాయి. ఈ విధంగా టాలీవుడ్‌ టాప్ హీరోల సరసన దుల్కర్ సల్మాన్ నిలిచే స్థాయికి ఎదుగుతున్నాడు.

రెండు తెలుగు ప్రాజెక్ట్స్

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా స్పిరిట్ మీడియా నిర్మిస్తున్న "కాంతా", స్వప్న సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న "ఆకాశంలో ఒక తారా" అనే రెండు తెలుగు ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, నటనలోని నైపుణ్యం భారతదేశంలోని అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe