...
...
Next Story

ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత.. ఆయనో సూపర్ హిట్ పాటల రైటర్

టాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా కన్నుమూశారు. ఆయన తెలుగులో పలు సూపర్ హిట్ సాంగ్స్ రాశారు.

Published on: Jul 8, 2025, 11:25:19 IST
By ,
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించి ఆస్కార్ అవార్డు గెలిచిన ఎంఎం కీరవాణికి పితృవియోగం. ఆయన తండ్రి శివశక్తి దత్తా మరణించారు. 92 ఏళ్ల శివశక్తి దత్తా సోమవారం రాత్రి మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు. దీంతో కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శివశక్తి దత్తా టాలీవుడ్ లో ఫేమస్ సాంగ్స్ రాశారు. దీంతో ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

అసలు పేరు

కీరవాణి తండ్రి శివశక్తి దత్తా (x)
కీరవాణి తండ్రి శివశక్తి దత్తా (x)

కీరవాణితండ్రి శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు శివశక్తి దత్తా సోదరుడు. రాజమహేంద్రవరం లోని కొవ్వూరులో 1932 అక్టోబర్ 8న శివశక్తి దత్తా జన్మించారు. చిన్నప్పటి నుంచి కలలపై ఆసక్తి ఉన్న ఆయన.. ఇంట్లో నుంచి ముంబయికి వెళ్లిపోయారు. ఓ ఆర్ట్స్ కాలేజీలో చేరారు. రెండేళ్ల తర్వాత తిరిగొచ్చి చిత్రకారుడిగా పనిచేశారు. ఆ తర్వాత గిటార్, సితార్, హర్మోనియం వాయించడం నేర్చుకున్నారు.

సోదరుడితో కలిసి

కళలపై ఉన్న ఇష్టం శివశక్తి దత్తాను కుదురుగా ఉండనివ్వలేదు. తమ్ముడు విజయేంద్ర ప్రసాద్ తో కలిసి శివశక్తి దత్తా సినీ రంగంలో అడుగుపెట్టారు. జానకి రాముడు సినిమాకు ఆయన స్క్రీన్ రైటర్ గా పని చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత సాంగ్స్ రైటర్ గా పేరు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పని చేశారు.

ఈ సూపర్ హిట్ పాటలు

శివశక్తి దత్తా కలం నుంచి సూపర్ హిట్ పాటలు వచ్చాయి. మమతల తల్లి, ధీవర (బాహుబలి 1), సాహోరే బాహుబలి (బాహుబలి 2), కథానాయక (ఎన్టీఆర్ కథానాయకుడు), రామం రాఘవమ్ (ఆర్ఆర్ఆర్), అంజనాద్రి థీమ్ సాంగ్ (హనుమాన్), నల్లా నల్లాని కళ్ల పిల్ల (సై), మన్నేల తింటివిరా (ఛత్రపతి), అమ్మా అవని (రాజన్న) లాంటి సూపర్ హిట్ పాటలు శివశక్తి దత్తా రాసినవే.

పవన్ సంతాపం

‘‘కీరవాణి తండ్రి, రచయిత శివశక్తి దత్తా మరణించారని తెలిసి ఎంతో చింతిస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి ఆయన. కొన్ని సినిమాల్లో పాటలు రాశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని పవన్ పోస్ట్ పెట్టారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe