OTT Crime Thriller: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు.. రేపటి నుంచే స్ట్రీమింగ్..

OTT Crime Thriller: ఓటీటీలోకి మరో కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ ను ఎవరైనా సరే ఫ్రీగా అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో చూడొచ్చు. రేపటి నుంచే అంటే సెప్టెంబర్ 16 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Published on: Sep 15, 2026, 22:14:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Crime Thriller: పాట్నా రైల్వే స్టేషన్ వేదికగా సాగే ఓ భారీ తత్కాల్ టికెట్ స్కామ్ చుట్టూ క్రైమ్, కామెడీ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న కొత్త హిందీ వెబ్ సిరీస్ 'వెయిటింగ్ హై' (Waiting Hai) డిజిటల్ ప్రీమియర్ డేట్ కన్ఫర్మ్ అయింది. 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ, 'ఫర్జీ' నటుడు భువన్ అరోరా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఇంట్రెస్టింగ్ షో సెప్టెంబర్ 16, 2026 నుంచి డైరెక్ట్‌గా ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

OTT Crime Thriller: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు.. రేపటి నుంచే స్ట్రీమింగ్..
OTT Crime Thriller: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు.. రేపటి నుంచే స్ట్రీమింగ్..

తత్కాల్ స్కామ్ నుంచి స్టార్ట్ అయ్యే కిక్కిచ్చే డ్రామా

పాట్నాలో పోస్టింగ్ ఉన్న సుగమ్ మిశ్రా (దివ్యేందు శర్మ) అనే ఆర్‌పిఎఫ్ (RPF) కానిస్టేబుల్ కథ ఇది. మరోవైపు కంప్యూటర్ టెక్నాలజీలో ఎక్స్‌పర్ట్ అయిన అఫ్రోజ్ హమ్జా (భువన్ అరోరా) అనే కుర్రాడు రైల్వే తత్కాల్ టికెట్లను క్షణాల్లో బుక్ చేసేలా ఒక స్పెషల్ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తాడు. ఈ టాలెంట్‌ను చూసిన హమ్జా బాబాయ్ (మామా) దాన్ని ఒక పెద్ద బిజినెస్ నెట్‌వర్క్‌గా మారుస్తాడు.

అలా సామాన్యులకు దొరకని తత్కాల్ టికెట్లను ఎక్కువ ధరలకు బ్లాక్‌లో అమ్మే నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తుంది. ఈ విచిత్రమైన టికెటింగ్ దందాను గమనించిన ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ సుగమ్ మిశ్రా.. నిజాన్ని ఛేదించే క్రమంలో ఈ రాకెట్‌కు ఎలా దగ్గరయ్యాడనేది మెయిన్ పాయింట్.

కామెడీతో పాటు క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్

క్రైమ్, హ్యూమర్ పర్ఫెక్ట్‌గా మిక్స్ అయిన ఈ కథలో పర్సనల్ డ్రామా, రిలేషన్‌షిప్స్, డ్రీమ్స్ కూడా కీలకంగా ఉంటాయి. మన వ్యవస్థలోని లొసుగులను వాడుకుని నెట్‌వర్క్ నడిపే క్రమంలో వచ్చే సమస్యలు, పోటీ వల్ల క్యారెక్టర్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయో డైరెక్టర్ సమీర్ విద్వాన్స్ చాలా నేచురల్‌గా ప్రెజెంట్ చేశారు.

కథనాన్ని ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా నడిపించడంలో 'సత్యప్రేమ్ కీ కథ' ఫేమ్ సమీర్ విద్వాన్స్ తన మార్క్ చూపించారు. శ్రేయాస్ జైన్, ప్రతీక్ పయోధి, ఆశిష్ థామస్ రాసిన స్క్రీన్‌ప్లే ఈ సిరీస్‌కు మెయిన్ అసెట్.

తారాగణం నటన, టెక్నికల్ వేల్యూస్

'మీర్జాపూర్' షోలో మున్నా భయ్యాగా మాస్ ఆడియన్స్‌ను అలరించిన దివ్యేందు శర్మ.. ఇందులో ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌గా సరికొత్త రోల్‌లో కనిపించబోతున్నారు. అలాగే 'ఫర్జీ' సిరీస్‌లో ఫిరోజ్ క్యారెక్టర్‌తో అలరించిన భువన్ అరోరా, సాఫ్ట్‌వేర్ హ్యాకర్ తరహా క్యారెక్టర్‌లో జీవించేశారు.

వీరిద్దరి కాంబినేషన్‌కు తోడు కుముద్ మిశ్రా, విజయ్ మౌర్య, హర్షితా గౌర్, సునీతా రాజ్‌వార్, యశ్‌పాల్ శర్మ లాంటి సీనియర్ నటులు తమ పర్ఫార్మెన్స్‌తో షో రేంజ్ పెంచారు. ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా జియో స్టూడియోస్, జార్ పిక్చర్స్ రియలిస్టిక్ లోకేషన్లలో విజువల్స్ గ్రాండ్‍గా తీర్చిదిద్దాయి.

ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది?

'వెయిటింగ్ హై' సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 16, 2026 నుంచి ఇండియాలో ప్రైమ్ వీడియో (Prime Video), అలాగే రీబ్రాండ్ అయిన ఎమ్‌ఎక్స్ ప్లేయర్ (MX Player by Prime Video) ఆండ్రాయిడ్ యాప్‌లో ఉచితంగా అలాగే సబ్‌స్క్రిప్షన్ ద్వారా వీక్షించవచ్చు.

రియలిస్టిక్ డ్రామా, ఇండియన్ రైల్వేస్ బ్యాక్‌డ్రాప్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఓటీటీ లవర్స్‌కు ఈ 'వెయిటింగ్ హై' కచ్చితంగా మంచి వాచ్ అవుతుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More