...
...
Next Story

ఓటీటీలోకి కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు మూవీ.. 3 సాంగ్స్ రిలీజ్.. ఆరోజు నుంచే 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

మహానటి కీర్తు సురేష్ నటించిన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ మూవీ ఉప్పు కప్పురంబు. ఈ సినిమాలో హీరో సుహాస్ మరో ప్రధాన పాత్ర పోషించాడు. 5 భాషల్లో ఉప్పు కప్పురంబు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా సినిమా మ్యూజిక్ ఆల్బమ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. జూన్ 27న ఉప్పు కప్పురంబులోని 3 పాటలు విడుదల చేశారు.

Published on: Jun 28, 2025, 06:40:37 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

సౌత్ సినీ ఇండస్ట్రీలో మహానటిగా పేరు తెచ్చుకుంది బ్యూటిపుల్ కీర్తి సురేష్. థియేట్రికల్ సినిమాలు మాత్రమే కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో కూడా అలరిస్తోంది. ఇదివరకే చిన్ని, మిస్ ఇండియా వంటి ఓటీటీ సినిమాలతో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అట్రాక్ట్ చేసింది కీర్తి సురేష్.

ఓటీటీ మూవీతో

ఓటీటీలోకి కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు మూవీ.. 3 సాంగ్స్ రిలీజ్.. ఆరోజు నుంచే 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఓటీటీలోకి కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు మూవీ.. 3 సాంగ్స్ రిలీజ్.. ఆరోజు నుంచే 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

ఇప్పుడు మరోసారి ఓటీటీ మూవీతో అలరించడానికి రెడీగా ఉంది కీర్తి సురేష్. మహానటి కీర్తి సురేష్ నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మూవీ ఉప్పు కప్పురంబు. ఈ సినిమాలో హీరో సుహాస్మరో ప్రధాన పాత్ర పోషించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సెటైరికల్ కామెడీ చిత్రంగా ఉప్పు కప్పురంబు తెరకెక్కింది.

తాజాగా ఉప్పు కప్పురంబు సినిమాలోని మ్యూజిక్ ఆల్బమ్‌ను మేకర్స్ విడుదల చేశారు. జూన్ 27న అంటే శుక్రవారం నాడు ఉప్పు కప్పురంబు సినిమాలోని ప్రత్యేకమైన మూడు పాటలను రిలీజ్ చేశారు. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా ఉప్పు కప్పురంబు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.

స్వీకార్ అగస్తి సంగీతం

ఈ పాటలు చిత్రంలో చూపించే చిన్న పట్టణ జీవితం, హాస్యం, భావోద్వేగాలు అన్నింటినీ మనస్సుకు హత్తుకునేలా పాడబడ్డాయి. ఈ సినిమాకు సంగీతాన్ని స్వీకార్ అగస్తి అందించగా, పాటల సాహిత్యాన్ని రవికృష్ణ విస్సాప్రగడ, ఎస్. అత్తావుర్ రహీం, రఘురాం ద్రోణావజ్జల అందించారు.

సీన్ రోల్డన్, అనురాగ్ కులకర్ణి ఆంటోని దాసన్ పాటలను ఆలపించారు. వీళ్ల గానంతో సాంగ్స్ ఇంకా హృద్యంగా మారాయి. ఒకవైపు నోమిలాలా అనే పాట ఉత్సవాన్ని పాడుతుంటే, మరోవైపు యాడున్నావో అనే పాట ఒక తల్లి, బిడ్డ మధ్య దూరాన్ని హృదయాన్ని తాకేలా చూపుతుంది.

అమెజాన్ మ్యూజిక్‌తోపాటు

ఇకపోతే అమెజాన్ ప్రైమ్లో ఉప్పు కప్పురంబు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో నిర్మించిన తాజా తెలుగు ఒరిజినల్ సినిమానే ఉప్పు కప్పురంబు. జూలై 4న తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి ఐదు భాషల్లో ప్రైమ్ వీడియోలో ఉప్పు కప్పురంబు ఓటీటీ రిలీజ్ కానుంది.

శ్మశానంలో స్థలం కోసం

కాగా సాధారణంగా ఓటీటీ సినిమాల్లో సాంగ్స్ అవి ఉండవు. కానీ, ఇటీవల కాలంలో ఓటీటీ మూవీస్‌లో కూడా పాటలు జోడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉప్పు కప్పురంబు సినిమాలో పాటలను పెట్టారు. ప్రస్తుతం ఇవి ఆకట్టుకుంటున్నాయి. శ్మశానంలో శవాలను కాల్చడానికి స్థలం దొరక్కపోవడం, రెండు వర్గాల వారు పంచుకోవడం వంటి కథాంశంతో ఉప్పు కప్పురంబు ఓటీటీ మూవీ తెరకెక్కింది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks